1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

14, సెప్టెంబర్ 2020, సోమవారం

Happy birthday my dear sweet sister 03.09.2020

జీవితమంటేనే కష్ట సుఖాల కలయిక. కానీ కష్టం (చిన్నదైనా / పెద్దదైనా) వచ్చినప్పుడు, తట్టుకొని గుండె నిబ్బరతో పోరాడడం అందరు చెయ్యలేని పని.

చదువుకోవడం కోసం తల్లి తండ్రులకు దూరంగా వుంది బంధువులతో వుండి చదువు కొనసాగించడమే కాకా, కొన్ని సంవత్సరాలు ఒక పూట కూడా సరిగా తినని రోజులు...

_అనారోగ్య పరిస్తితులలో కూడా చలించక, మొక్కవోని ధైర్యంతో కర్మ ఫలాన్ని ఆనందంగా అనుభవించి, ఇంటి పరిస్తితుల దృష్ట్యా పై చదువులు చదువుకోలేక, స్కూల్ లో టీచర్ గా జాబ్ చేస్తూ కుటుంబానికి ఆర్ధిక చేయూతను ఇవ్వడం, ఇప్పుడు కూడా దానిని కొనసాగిస్తూ భర్త కి చేదోడు వాదోడు వుంటూ, సహనం, అణకువతో ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్న *మా "శ్రీ లలిత" అక్కకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలతో...*_

నాకు బాగా గుర్తు... మేమిద్దరం (1996-98) రూమ్ లో వున్నప్పుడు చుట్టూ పక్కల వారి న్యూస్ పేపర్ లు తెచ్చుకొని, వాటిని వివిధ సైజు లలో కవర్ లు చేసి స్వీట్ స్టాల్స్ లోనూ, మెడికల్ షాప్స్ లోను వేసుకొని కొంత సంపదించే వాళ్ళం. అపెండిసైటిస్ ఆపరేషన్ అయి. *నడుము నొప్పిగా వున్నా సరే మా చిన్న గదిలో గోడకు అనుకోని కూర్చొని టప టప కవర్ లు చేసి పడేస్తూ వుండేది మా అక్క. అమెది ప్రొడక్షన్ డ్యూటీ,* నాది మార్కెటింగ్ అంటే ప్రతి షాప్ కి వెళ్లి అడిగి కవర్ లు అమ్మడం. వాళ్ళు డబ్బులతో పాటు అప్పుడప్పుడు బోనస్ గా ఎదో స్వీట్ ముక్క లు ఇచ్చే వారు, దానిని ఇంటికి తెచ్చుకొని అపురూపంగా తినేవాళ్ళం.

6 నుంచి 10వ తరగతి దాకా నెల్లూరు ములాపేట లో నేను చదివిన ESRM స్కూల్ లో గాని, మాకు ఫ్రీ గా ట్యూషన్ చెప్పిన నాగేంద్ర సర్ ట్యూషన్ లో టీచర్స్ *నన్ను లలిత తమ్ముడుగానే గుర్తుపట్టేవారు.*

అక్క సంపాదించి కొనుకున్న వస్తువల మీద పురుష అహంకారంతో నేను పెత్తనం చెలాయించే తరుణంలో మేమిద్దరం ఎప్పుడు కొట్టుకుంటేనే వుండేవాళ్ళం. *మా కుటుంబం కోసం నేను చేసిన దానికంటే ఒక పిసరు ఎక్కువే చేసింది మా అక్క.*

ఇలా చెప్తూ పోతూ వుంటే చాలా వున్నాయి లెండి. అందుకే నేను పెద్ద వాడ్ని అయ్యి ఎదో నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను కాబట్టి వారికీ ఎప్పుడు... ఏదీ... లేదు అనకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నా..... అది నేను తనకి ఇచ్చే బహుమతి.....

*చిన్నపటి నుంచే పరిస్తితులకి అనుగుణంగా సర్దుకుపోయి ఎలా బతకాలో...అలాగే కష్టాలకి ఎదురొడ్డి ఎలా నిలవాలో చేసి చూపించిన మా అక్క ఎంటే ఎంతో ప్రేమ, ప్రేరణ...మరొక్కసారి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలతో....మీ అమ్మ శ్రీనివాస్*





జీవితమంటేనే  కష్ట సుఖాల కలయిక.  కానీ కష్టం (చిన్నదైనా / పెద్దదైనా) వచ్చినప్పుడు, తట్టుకొని గుండె నిబ్బరతో పోరాడడం అందరు చెయ్యలేని పని.

చదువుకోవడం కోసం తల్లి తండ్రులకు దూరంగా వుంది బంధువులతో వుండి చదువు కొనసాగించడమే కాకా, కొన్ని సంవత్సరాలు ఒక పూట కూడా సరిగా తినని రోజులు...

_అనారోగ్య పరిస్తితులలో కూడా చలించక, మొక్కవోని ధైర్యంతో కర్మ ఫలాన్ని ఆనందంగా అనుభవించి, ఇంటి పరిస్తితుల దృష్ట్యా పై చదువులు చదువుకోలేక, స్కూల్ లో టీచర్ గా జాబ్ చేస్తూ కుటుంబానికి ఆర్ధిక చేయూతను ఇవ్వడం, ఇప్పుడు కూడా దానిని కొనసాగిస్తూ భర్త కి చేదోడు వాదోడు వుంటూ, సహనం, అణకువతో ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్న *మా  "శ్రీ లలిత" అక్కకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలతో...*_

నాకు బాగా గుర్తు... మేమిద్దరం (1996-98) రూమ్ లో వున్నప్పుడు చుట్టూ పక్కల వారి న్యూస్ పేపర్ లు తెచ్చుకొని, వాటిని వివిధ సైజు లలో కవర్ లు చేసి స్వీట్ స్టాల్స్ లోనూ, మెడికల్ షాప్స్ లోను వేసుకొని కొంత సంపదించే వాళ్ళం. అపెండిసైటిస్ ఆపరేషన్ అయి. *నడుము నొప్పిగా వున్నా సరే మా చిన్న గదిలో గోడకు అనుకోని కూర్చొని టప టప కవర్ లు చేసి పడేస్తూ వుండేది మా అక్క. అమెది ప్రొడక్షన్ డ్యూటీ,* నాది మార్కెటింగ్ అంటే ప్రతి షాప్ కి వెళ్లి అడిగి కవర్ లు అమ్మడం. వాళ్ళు డబ్బులతో పాటు అప్పుడప్పుడు బోనస్ గా ఎదో స్వీట్ ముక్క లు ఇచ్చే వారు, దానిని ఇంటికి తెచ్చుకొని అపురూపంగా తినేవాళ్ళం.

6 నుంచి 10వ తరగతి  దాకా  నెల్లూరు ములాపేట లో నేను చదివిన ESRM స్కూల్ లో గాని, మాకు ఫ్రీ గా ట్యూషన్ చెప్పిన నాగేంద్ర సర్ ట్యూషన్ లో టీచర్స్  *నన్ను లలిత తమ్ముడుగానే గుర్తుపట్టేవారు.*

అక్క సంపాదించి కొనుకున్న వస్తువల మీద పురుష అహంకారంతో నేను పెత్తనం చెలాయించే తరుణంలో మేమిద్దరం ఎప్పుడు కొట్టుకుంటేనే వుండేవాళ్ళం.  *మా కుటుంబం కోసం నేను చేసిన దానికంటే ఒక పిసరు ఎక్కువే చేసింది మా అక్క.*

ఇలా చెప్తూ పోతూ వుంటే చాలా వున్నాయి లెండి. అందుకే నేను పెద్ద వాడ్ని అయ్యి ఎదో నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను కాబట్టి వారికీ ఎప్పుడు... ఏదీ... లేదు అనకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నా.....  అది నేను తనకి ఇచ్చే బహుమతి.....

*చిన్నపటి నుంచే పరిస్తితులకి అనుగుణంగా సర్దుకుపోయి ఎలా బతకాలో...అలాగే  కష్టాలకి ఎదురొడ్డి ఎలా నిలవాలో చేసి చూపించిన మా అక్క ఎంటే  ఎంతో ప్రేమ, ప్రేరణ...మరొక్కసారి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలతో....మీ అమ్మ శ్రీనివాస్*





Happy Birthday Sankar Rao Garu 31.08.2020

శంకర్ రావు గారు మా అశ్వ ఫామిలీ లో ఒక కుటుంబ సభ్యులు, మా యూత్ లీడర్.... మాలో ఎంతో మందికి ప్రేరణ.

ఏ కార్యక్రమమైన నేనున్నాను అంటూ ముందుండేవారు. మా కుటుంబానికి అయితే వ్యక్తిగతంగా ఒక మేన మామ లాగా... వారిద్దరూ మమ్మల్ని ఎంతో అప్యాయంగా చూసేవారు. గత 3 సంవత్సరాల నుంచి మేము వారిని, వారి ప్రేమ ని, వారి ప్రేరణను, వారి సలహాలను ఎంతో మిస్ అయ్యాము.

ప్రతి ప్రాజెక్ట్ లో కూడా ఎన్నో సలహాలు ఇచ్చి ప్రాజెక్ట్ అభివృద్ధికి తోడ్పడేవారు.

యువతరం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన గుణం లేదా లక్షణం ఏమిటంటే ఎన్నో సలహాలు ఇచ్చేవారు, కానీ అవి ఆచరించడం, పాటించడం మాకున్న వనరులను బట్టి చేసే అవకాశం ఇచ్చేసేవారు. కానీ మనసులో వెంటనే పాటించలేదు అనే కించిత్ కోపం లేకుండా మిగతా కార్యక్రమాలలో అంతే ఆక్టివ్ గా పాల్గొనేవారు. ఇలాంటి ఆలోచన, పరిపక్వత ఈ కాలంలో కార్యకర్తలలో చాలా కొరవడింది.

మీరు ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు సర్. మీ అమ్మ శ్రీనివాస్


Many more happy returns of the day Siva Sankar Kantheti

శివ తరువాత నాగార్జున తెలియనోడు ఉండడు.... జీవన విద్యలో శివ శంకర్ కంతేటి తెలియని వారుండరు.

అశ్వ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన విలువలతో కూడిన స్కూల్ మొదలు పెట్టాలి అనే ఆలోచన ఎప్పటికి ఫ్రెష్ గా ఉండడానికి కారణం, చెయ్యగలను అనే నమ్మకం ఇచ్చింది, వచ్చింది మటుకు అజిమ్ ప్రేమ్ లాంటి దేశంలోనే పేరెన్నికగన్న విశ్వవిద్యాలయంలో MA ఎడ్యుకేషన్ చదివి, దాదాపు 7 రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేసిన ఒక టీచర్ ఎడ్యుకేటర్ అయిన శివ మనతో వున్నాడు అనే భావనే.

అతను ఇచ్చే సలహాలు మన అశ్వ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లో చేస్తున్న చిన్న చిన్న కార్యక్రమాల నుంచి మార్పు దిశగా ప్రయత్నం చేసే CHDHC కి మొదలెట్టదానికి కారణం కూడా శివ నే... అలాగే నేను, హరిత ఈ రోజు ఇలా ఆనందంగా విప్రో తో కలసి ప్రాధమిక పాఠశాలల్లో పిల్లల భాషాభివృధ్ధికి సంబంధించి నేర్చుకోవడం, పరిశోధన, ప్రయోగాలు చెయ్యడంలో మాకు దిశా నిర్ధేశం చేసింది మన సైకిల్ చైన్ శివనే..

శివ మాట్లాడితే ఎదో బాబా బోలేనాథ్ అనుకుంటాం, కానీ నాకంటే దాదాపు అరడజను సంవత్సరాలు చిన్నోడు అని ఎవ్వరికీ తెలీదు, అతనితో మాట్లాడితే మనం అస్సలు గుర్తుపట్టలేం. గురువు గారు చాలా పెద్దోరు అనుకుంటాం...

ముక్కుపచ్చలారని వయస్సులో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం మానేసి, ఎంతో సంపాదించే అవకాశాన్ని వదులుకొని, రామకృష్ణ మఠం, వ్యక్తిత్వ వికాసం ఇలా ఎన్నో తిరగేసి అలుపెరగక.. జీవిత లక్ష్యం కోసం, సమాజ సేవ కోసం మార్గాన్ని వెతికి వెతికి విసికిన సమయంలో తనని ఆపగలిగిన జ్ఞానం / మజిలీ "జీవన విద్య". ఇది చా...లదు మనోడు సమాజం కోసం ఎంత చేసాడో, ఆలోచిస్తాడో సెప్పడానికి...

ఇక నీ ప్రయోగాలకు కూసింత విశ్రాంతి ఇచ్చి, జీవితం నీకే అంకితం అన్నట్టు CHDHC, Value Based School కి మీ పూర్తి సమయం కేటాయించాలని కోరుకుంటూ.... నా జీవితంలో నేను నా లక్ష్యం దిశగా పయనించడానికి, ఇంత ఆనందంగా ఉండడానికి కారణమైన... నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులలో ఒకడు...మన ఒకే ఒక్కడు... శివుడు.... ఎప్పుడూ ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ... హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా.... మీ శీనయ్య (అమ్మ శ్రీనివాస్)


Happy birthday Sreenivasa Chakravarty

లక్ష్మిని... గృహ లక్ష్మిని.... లవ్వాడి కట్టుకోకపోయినా,
స్వయంవరంలో వరించి పెళ్ళి చేసుకుని,
స్వాతీ ముత్యపు ప్రేమ జల్లులలో సేద తీరుతున్న,
మా రేపల్లె కొత్త పెళ్లి కొడుకు, నవరస నట చక్రవర్తి... మా శ్రీనివాస చక్రవర్తికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.

అశ్వ లో అందరూ ఎవరి రాతల కోసం, రచనల కోసం వేచి చూస్తారో.... వారే మా స్మైలీ స్టార్ చక్రీ....

కల్మషంలేని చిరునవ్వు...
నిత్యం నేర్చుకొవాలనే తపన...
అందరితో ఆత్మీయంగా స్నేహం చెయ్యగల ప్రేమ తత్వం...
సేవ చెయ్యడంలోను, తీసుకున్న బాధ్యతను నెరవేర్చడంలోను తన నిజాయితీ, నిబద్దత...
ఎలాంటి స్థితిలోనైనా చెక్కు చెదరని ఓర్పు...
సంబంధాలకు విలువనిస్తూ, విలువలతో జీవిస్తున్న, మా పుస్తకాల పురుగు, మా అశ్వ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కు జన్మదిన శుభాకాంక్షలు...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు ఏదో చేయాలని వారం, వారం నిర్వహించే ఆటలు, పాటలు, కథలు, నటన, పద్యాలు ఇలా విద్యార్థులలో ఆశక్తి రేకెత్తించి, వారిలోని శక్తి సామర్ధ్యాలను వెలికితీయడం కోసం విభిన్న కార్యక్రమాలను బాగా నిర్వహించడం కోసం aswa4u.org లో వికాస్ ప్రాజెక్ట్ లీడర్ గా తాను పడే తపన, చేస్తున్న కృషి ఒక ప్రేరణ అయితే...

మరొ పక్క మారుమూల ప్రాంతాలలో ఉన్న 10 వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం, వారాంతాలలో సుదూర ప్రాంతలకు అలుపెరగక పయనించి, వారితో ముచ్చటించి, వారి జీవితాల్లో లక్ష్యం గురించి, వ్యక్తిత్వం గురించి, పది తరువాత వివిధ రకాల అవకాశాల గురించి వివరించి, వారి జీవితాల్లో లక్ష్యాల పట్ల స్పష్టత రావడానికి ప్రయత్నించే నీ సేవా భావానికి జోహార్ మిత్రమా...

అన్నట్టు చెప్పడం మరిచాను మనోడి మహా మంచితనానికి తోడు, కొంచెం మొహమాటం, చిటికెడు సిగ్గు కూడా ఉన్నాయండోయ్...

నీ జీవితం, నీ సహధర్మ చారిణి సహకారంతో ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు... మీ అన్నయ్య అమ్మ శ్రీనివాస్



13, ఆగస్టు 2020, గురువారం

47 వ సారి రక్తదానం - ఈరోజు (04.08.2020)


దాదాపు 4 నెలల తరువాత, విజయవాడ కి వెళ్లి హరిత, చరితను తీసుకునేవచ్చే పనిలో భాగంగా ఈ రోజు ఉదయం హైద్రాబాద్ వచ్చా...

వచ్చినప్పటి నుంచి అశ్వ కి ఫ్రీ ఆఫీస్ రూమ్ (దగ్గరలో) వెతికే పనిలో ఒకటే ఫోన్ లలో గడుపుతున్న... ఎందుకో అలా.. అలా.. ఫేస్ బుక్ ఓపెన్ చెయ్యగానే మా ఆక్టివ్ వాలంటీర్ దుర్గ ప్రసాద్ గారు (Durgaprasad Chintapally) ఈ రోజే 20 వ సారి రక్త దానం గురించిన పోస్ట్ చూసా...

కానీ పై పోస్ట్ చూడగానే, వెంటనే నాలో నుంచి అమ్మ శ్రీనివాస్ బయటకొచ్చి, సర్వరాజు శ్రీనివాస ప్రసాద్ రావు తో ఇలా అన్నాడు (పాత సినిమాలో సీన్ లాగా)... *ఏమయ్యా ప్రతి 3 నెలలకు బ్లడ్ డొనేట్ చేస్తావు కదా... ఈ సారి 7 నెలలు అయ్యింది* (అంటే మళ్ళీ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ వచ్చి 4 నెలలు అయింది) కానీ ఎందుకు చేయలేదు అని ప్రశ్నించాడు (ఇదేమి మొదటి సారి కాదనుకోండి, ఇచ్చిన 3 నెలల నుంచి ఇలా నాకు ఇచ్చేదాకా గుర్తు చేస్తూనే ఉంటాడు)..

మార్చ్ లో బ్లడ్ కాంప్ అనుకున్నాం కానీ అదే రోజు జనతా కర్ఫ్యూ పెట్టారు. ఆనాటి నుండి ఈ నాటి దాకా కరోనా మహోమ్మరి వలన ఎక్కడికి రాలేదు... స్టే హోమ్ - స్టే సేఫ్. కానీ 4 నెలల నుంచి బ్లడ్ ఇవ్వలేకపోయినందుకు ఒక గిల్టీ ఫీలింగ్, ఈ రోజుతో తీరిపోయింది అన్నాడు అమ్మ శ్రీనివాస్...

*నేను రక్త దానం చెయ్యగలిగే ఆరోగ్యాన్ని, ప్రతి 3 నెలలకు చెయ్యాలనే తపనను ఇచ్చిన దేవునికి, నిరంతరం ప్రేరణ ఇస్తున్న తోటి, సాటి రక్తదాతలకు పాదాభివందనాలతో.....*

ఇక్కడ (Institute of Preventive Medicine, Narayanguda Rd, near YMCA, Lingampally, Kachiguda, Hyderabad, Telangana
https://g.co/kgs/RDoR1W) *రక్తం అవసరం చాలా ఉంది, అవకాశం ఉన్న వారు వెళ్లి దానం చెయ్యండి. దీని గురించి వివరంగా మరో పోస్ట్ పెడతా*






మీ అమ్మ శ్రీనివాస్
04.08.2020
www.aswa4u.org

స్పెషల్ డేస్ ని కరోనా లో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి --- విరాళాలు - మంచి పనులకు మాత్రమే కాదు.. చెడ్డ పనులకు కూడా ప్రోత్సాహకాలే... -

*1. స్పెషల్ డేస్ ని కరోనా లో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి*

ప్రస్తుత పరిస్థితులలో ఏవరైనా *వారి స్పెషల్ డేస్ లో* ఎక్కడో ఆశ్రమాలకు సాయం/దానం చెయ్యడం కన్నా... *కరోనా లో ఇబ్బంది పడుతున్న ఫామిలీస్ కి* అదే మొత్తాన్ని సాయం చెయ్యడం మేలు... కాకపోతే అలా చేసేట్టు దాతలను కన్విన్స్ చెయ్యడానికే NGO/కార్యకర్తలు కొంత శ్రమ పడాల్సిందే. కానీ తప్పదు...

ప్రస్తుతం చాలా ఆశ్రమాలలో పిల్లలు కూడా లేరు మరియు మిగతా విషయాలు మీకు తెలిసిందే. ఏవో వేళ్ళ మీద లెక్కపెట్టే స్థితిలో తప్ప జెన్యూన్ గా హోమ్స్ లేవు...

కాబట్టి కరోనా గడ్డు కాలంలో మీ పక్కింటిలో, మీ వీధిలో, మీ కాలనీలో, మీ ఊర్లో సాయం కోసం చూసే కుటుంబాలు ఎన్నో వున్నాయి, ఆలోచించండి, కనిపెట్టండి (మీరు నేరుగా కనుగొన లేకపోతే, NGO, మీడియా లో చూడండి) మీకున్న సమాచారం, జ్ఞానంతో సరిపోల్చుకోండి.. నిజమే అనిపిస్తే.. సాయం చెయ్యండి. దీని వల్ల మీ దగ్గరలో వారే కాబట్టి, వారితో మీ సంబంధం కూడా బలపడుతుంది. మీ విరాళం ఎంత చిన్నదైనా పర్లేదు.


*2. విరాళాలు - మంచి పనులకు మాత్రమే కాదు.. చెడ్డ పనులకు కూడా ప్రోత్సాహకాలే...*

*మనం చేసే ప్రతి రూపాయి మీ కష్టార్జితమే కదా.... సో ఎక్కడ ఇచ్చినా... ప్రతీదీ బాగా లోతుగా పరిశీలించండి... తరువాతనే దానం చెయ్యండి.* ఎదో ఒకటి ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ముఖ్యంగా మనం ఎమోషనల్ గా ఫీల్ అయ్యే అవకాశం వుండే ఆశ్రమాలకి దానం చేయడం లాంటి వాటి మీద ఎక్కువ మంది ఆశక్తి చూపిస్తూ వుంటారు, అది కూడా మంచిదే, కానీ ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసేస్తే సరిపోదు, ఇచ్చేముందు వెరిఫై చెయ్యండి. నచ్చితే ఇప్పుడే కాదు తరచు వెళ్ళండి, ఇవ్వండి.

*వెరిఫై చేయాలంటే ఖచ్చితంగా కొన్ని సార్లైనా తరచు విసిట్ చేయాల్సిందే, పిల్లలతో కనెక్ట్ అయితే అన్ని వారే చెప్తారు, కొన్ని దగ్గర్ల చెప్పకుండా కూడా ట్రైనింగ్ ఇస్తారు, అలాంటప్పుడు మీ పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు.* మనమేమో మనం వెళ్ళినప్పుడు మనల్ని రిసీవ్ చేసుకొనే పద్దతిని పట్టి, పెట్టిన భోజనాన్ని బట్టి, అక్కడ ఉన్న వసతులను (పై పై మెరుగులను) బట్టి నిర్ణయానికి వచ్చేస్తాం. మరొకటి ఏమిటంటే ఈరోజు బానే ఉన్న, రేపటికి మారిపోయే ఆశ్రమాలు, సంస్థలు ఎన్నో.... *కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడం మన భాద్యత.*

*సరైన వారికి ఇవ్వడంలో కూడా మనం బాగా శ్రద్ధ తీసుకోవాలి. అలా అని ఎక్కడా, ఏది ఇవ్వకుండా వుండకండి. మీరిచ్చే ప్రతి పైసా లేదా విరాళాలను మీరిచ్చే వారు ఎలా, ఎందుకు ఖర్చు పెడుతున్నారో మొహమాటం లేకుండా చూడండి, అడిగి తెలుసుకోండి.* అలా తెలుసుకోకుండా, శ్రద్ధ తీసుకోకుండా ఇచ్చే విరాళాల వలన మంచి కంటే, చెడే ఎక్కువ జరిగే అవకాశముంది. ఎందుకంటే కలి కాలంలో ప్రతిదీ వ్యాపారమే.

*అంత ఓపిక లేదని మీరిచ్చే సంస్థలకు, ఆశ్రమాలకు విరాళాలు ఇవ్వడం మానకండి. ఓపిక తెచ్చుకోండి, పరిశీలించి దానం చెయ్యండి*

ఇది నా అనంతరంగం ఘోష.. మీకు నచ్చితే మంచిది... నచ్చకపోతే వదిలెయ్యండి...

అమ్మ శ్రీనివాస్
13.08.2020
http://ammasrinivas4u.blogspot.com/

25, జులై 2020, శనివారం

ప్రియమైన పద్మిని అక్కకు

@⁨Padmini Bhavaraju Advisor⁩ 

లక్ష్మీ సౌభాగ్యవతి అయిన పద్మిని అక్క గారికి మీ తమ్ముడు అమ్మ శ్రీనివాస్ నమస్కరించి వ్రాయునది ఏమనగా... ఇచ్చట అంతా క్షేమం, అచట అందరూ క్షేమమని తలుస్తాను. కరోనా రక్కసి నుంచి కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఇంట్లోనే వుంటున్నారు అని ఆశిస్తున్నాను (ముఖ్యంగా బావ గారు)..

ఇక విషయానికొస్తే, మీరు మమ్ములను ఆశీర్వదించి పంపిన తిరుప్పావై పుస్తకములు, నాన్న గారి వంటల పుస్తకములు ఇప్పుడే అందినవి. శుక్రవారం నాడు రావడం మా మహద్భాగ్యంగా భావిస్తున్నాము. మాసంతో సంబంధం లేకుండా ఈ రోజు నుంచి రోజు ఒక పాశురాం / పద్యం చదువుదామని అనుకుంటున్నాను. 

ఇక పోతే, మా అమ్మగారు శుక్రవారం ప్రసాదం కోసం ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో,  క్రికెట్ ప్రేమికుడుకి బ్యాట్ దొరికనట్టు మీ నాన్నగారి వంటల పుస్తకం దొరికింది. నువ్వుల పులిహారా, అటుకుల దద్దోజనం అని చేసినా, చర్యకపోయినా పుస్తకాన్ని తెగ తిరిగేస్తూ, నాకు నోరూరిస్తూ ఉంది. ఈ రోజు వంట హార్డ్ కాపీ ఉందా లేదా సాఫ్ట్ కాపీ నో ఇంకా తెలియరాలేదు.

మీ మరదలు, కోడలు ఇంకా ఉరిలోనే ఉన్నారు, నేను మా అమ్మ కాలక్షేపం కోసం పేకాట, చెస్, క్యారం బోర్డ్ లాంటి స్కిల్స్ గేమ్స్ ఆడుకుంటూ, కాసేపు మొబైల్ చూసుకుంటూ, కాసేపు కార్యకర్తల ప్రాణాలు తింటూ ఇలా గడిపేస్తున్నాము. మొన్ననే చంటబ్బాయి సినిమా చూసాము. మనసు విశ్వనాద్ గారి మీద మళ్లింది స్వాతి కిరణం, శృతి లయలు, సాగర సంగమం, సప్త పది సినిమాలు చూసే ఆలోచనలో వున్నాను. 

ఇంతే సంగతులు, మీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ మీ అమ్మ, తమ్ముడు. ఇంతకు రాం గోపాల వర్మది ఎదో గొడవ జరుగుతున్నట్టు ఉంది, దాని గురించి మీ అభిప్రాయం ఏమిటో అని తెలుసుకోవాలని ఉంది. సర్లే అక్క ఇంగలాండ్ కవర్ ఖాళీ లేకుండా నింపేసాను. కొడళ్లని అడిగానని చెప్పు. 

నమస్సులతో


అమ్మ శ్రీనివాస్

Happy birthday Giri Garu

అవతలి వారి మీద "విశ్వాసం" వుంచాలి అని మనం జీవన విద్యలో నేర్చుకున్నాం, కానీ ఆచరణ గురించి ఆలోచిస్తే టక్కున గుర్తొచ్చే పేరు ఈయనే... ఎవరినైనా చిన్నపిల్లాడిలా నవ్వుతూ ఇట్టే ఆకర్షిస్తాడు... ఈయన కొప్పడడం ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నేను చూడలేదు ఈ పది ఏళ్లలో...

మితభాషి, మృదు స్వభావి, నిష్కల్మషమైన హృదయం, మదర్ థెరిసాకు తమ్ముడు, కర్ణుడికి వారసుడు...

నేను ఇలా ఈరోజు సదా మీసేవలో ఉండడానికి ఒక కారకుడు, సదా మా వెన్నంటి వుండే మా సోదరుడు...

అవకాశాలు, వసతులు అందుబాటులో ఉండి కూడా ప్రకృతి మీద ప్రేమతో, బాధ్యతతో నడుచుకుంటూనో, పరోగేత్తుకుంటూనో లేదా సైక్లింగ్ చేసుకుంటునో వందల కిలోమీటర్లు అలవొకగా తిరిగే గొప్ప పర్యావరణ ప్రేమికుడు...
CHDHC ప్రాజెక్ట్ ఆవిర్భావానికి మూల పురుషుడు, పర్వతమంతటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వారు మన గిరిధరుడు..

జీవన విద్య facilitator గా, ఒక సేవా కార్యకర్తగా, మనిషిగా మీ జీవన పయనం అద్భుతం, మా లాంటి వారికి ఆదర్శం...

అలాగే మీ మధురమైన స్వరంతో మరెంతో మందికి జీవన విద్య తరగతుల ద్వారా మంచి జ్ఞానాన్ని అందించాలని ఆశిస్తూ...

మీరు ఆనందంగా, ఆరోగ్యంగా, ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలని కోరుకుంటూ.... హార్ధిక జన్మదిన శుభాకాంక్షలతో మీ అమ్మ శ్రీనివాస్


How Project Save Life Started... Exactly 9 years Ago

*Exactly 9 years for this pic and initiation of a Noble Project*

After donating blood for many emergencies, this was my first donation for and Thalassemia Children in their Blood Bank. *It's also 1st Blood Camp of ASWA.* Since then I and ASWA has been *doing it regularly for every 3 Months* (missed couple of times and donated after 6 months).

I am proud to say that #ASWA #ammasocialwelfareassociation is the *ONLY organization which is conducting blood camps for every 3 months without fail and also consistently from last 9 years.*

These statistics are not for comparision just to appreciate the *DEDICATED, DISCIPLINED, DETERMINED efforts OF each and every VOLUNTEER.* Kudos my dear friends for your NOBLE deeds.

I still remember, how this personal wish of Haritha Vemulapalli became and turned into (by Srinivasa Kumar Sarvaraju who make this as a group activity) initial steps in starting SAVE LIFE project. *Till now we conducted 36 Blood Camps, Avg 4 per year, 100 donations per Camp.*

How hard we have been working to create awareness on Blood Donation and Thalassemia awareness is another big success story and need a separate post.

*This is an example of how a small thought of any person, can become an important service to the society and gradually go big. Everything starts from One, i.e. you. So please start SERVING FELLOW BEING how ever and where ever you are.*

With this inspiration, i continued to donate blood quarterly, reaching 46 times till today.

Happy Birthday Save Life Team and kudos for your services


*Telugu Film Industry & other Celebrities about ASWA Blood Donation*

Https://www.youtube.com/playlist?list=PLDWqdgiPCDjEcrp9PYFL1t6AGwL-3lP0Z


www.aswa4u.org
Fb.com/ammaaswa
99 4888 5111

6, జూన్ 2020, శనివారం

సేవ అంటే సమస్యను నిర్మూలించడం కోసం పనిచెయ్యడమేనా?

మనం అందరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. ఏదైనా సంఘటనను లేదా ఎవరైనా వ్యక్తులను వివిధ పరిస్థితులలో చూసి, చలించి వెంటనే మనకు చేతనైన సాయం చేస్తాం, ఆ సాయం ఎంతో గొప్పది, సాయం అందుకున్న వారిని తాత్కాలికంగా (కొన్ని క్షణాలు/ గంటలు/ రోజులు/సంవత్సరాలు) నిలబెడుతుంది. కొంత కాలం తరువాత వారి పరిస్థితి మళ్లీ మాములే. *ఆ పరిస్థితిని చూడగానే మనలో కలిగే భావోద్వేగాల (Emotional Connect) వలన మనం చేస్తుంటాము.* చాలా వరకు స్వచ్చంద సంస్థలు, సేవా భావం కల వ్యక్తులు ఇదే పని చేస్తున్నారు. ఇది చాలా అవసరం కూడా.

ఇప్పుడు మనందరం చేయాల్సింది... *మనం మరో మెట్టు పైకి ఎక్కి పని చెయ్యాలి. అలా చెయ్యాలంటే, మనం భావోద్వేగాల దగ్గర ఆగిపోకుండా, ఆ సమస్య మన మనసుకు హత్తుకోవాలి (Connecting to the Cause).* ఎప్పుడైతే ఆ వ్యక్తిని కాక, సమస్యను చూస్తామో, అప్పుడు మనం ఆ సమస్య మొదట ఆ వ్యక్తికికే రాకుండా...తర్వాత ఎవ్వరికీ, ఎప్పటికి రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయుడమే కాదు, అసలు ఆ సమస్య కోసం పని చేస్తున్న వారితో కలసి ఆ సమస్యను సమూలంగా నిర్మూలించే విధంగా పనిచేస్తాం. ఇదే అసలు మనం చెయ్యాల్సిన పని. అలా చెయ్యలేక పోవడం వలననే ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది కష్టపడుతున్నా కానీ సమస్య అక్కడే ఉంటోంది, దానికి ఎంతో మనిషి బలైపోతున్నారు.

*కాబట్టి*
1. *సమస్యను గుర్తించడం*
2. *సమస్యను ప్రచారం చెయ్యడం*
3. *సమస్యను నిర్మూలించడం*

కాకపోతే ఎక్కువ శాతం, వ్యక్తిగత లేదా సంస్థ లకి ప్రచారం చేసుకోవడం దగ్గరే ఆగిపోతున్నాం. అది ఏమి తప్పు కాదు, అది కూడా అవసరమే.

మరి.... మన ప్రయాణం *మొదటి దశను*(సమస్యను గుర్తించడం) ఎప్పుడు దాటుతుందో... *చివర దశను* (సమస్య నిర్మూలన) ఎప్పుడు చేరుకుంటుందో చూడాలి..

*మనం చివరి దశ చేరుకోక పోయినా పర్లేదు...*
సమస్యను నిర్మూలించలేకపోయినా పర్లేదు.... *కానీ... మన పయనం, మన ప్రయత్నం మాత్రం మన లక్ష్యం ("సమస్య నిర్మూలన")  వైపు చెక్కు చెదరక ఉంటే చాలు...*

మీ అమ్మ శ్రీనివాస్...
జూన్ 6, 2020 12.10am

*అప్పుడప్పుడు నా అనంతరంగం యొక్క ఆవిష్కరణ జరుగుతూ ఉంటుంది, అవన్నీ ఈ బ్లాగ్లో ఆవిష్కరించటం జరిగింది. మీకు ఇంకా తనివి తీరకపోతే, నా మరిన్ని రాతల కోసం సందర్శించండి* http://ammasrinivas4u.blogspot.com/

Donated Blood for the _*46th time*

రక్తదానం అనేది ఒక మహత్తర కార్యం,
3 నెలలకు ఒకసారి అలా చేయడం అనివార్యం,
కాదా ఇది పూర్వజన్మ సుకృతం,
మనకి దేవుడిచ్చిన వరం,
అలా చెయ్యకపోతే నాలో నాకు మొదలవుతుంది రణం-మనసు అవుతుంది కకలావికలం-ఆ బాధ వర్ణనాతీతం,
ఎందుకంటే తలసీమియా భాదితులకు ప్రతి 15 రోజులకు రక్తం ఎంతో అవసరం,
ఎవరు చెప్పినా ఒకటే-ఇదొక బృహత్కార్యం,
మరెందుకాలశ్యం, అనుమానం? మొదలెడుదాం మనందరం ఈ క్షణం,

Donated Blood for the _*46th time*_ yesterday in the 35th Blood Donation Camp of Amma Social Welfare Association (ASWA) with *blessings of my mother*.

SPECIAL Thanks to www.aswa4u.org / www.aswa.co.in

అందరిని ప్రేమించు - అందరిని సేవించు
అమ్మ శ్రీనివాస్

5, జూన్ 2020, శుక్రవారం

44 వ సారి రక్తదానం నా అదృష్టం

*3 నెలల కి ఒక సారి రక్తం ఇవ్వకపోతే, ఏదో కోల్పోయిన ఫీలింగ్. నిజమే కదా! 3 ప్రాణాలని కాపాడే అవకాశం కోల్పోయినట్టే కదా...* నిన్న టికెట్ క్యాన్సల్ చేసుకొని, వేరే మార్గంలో ప్రయాణం కుదుర్చుకొని, *ఎట్టకేలకు ఈ రోజు మిస్ అవకుండా 44వ సారి రక్త దానం చేయడం, నిజంగా నాకు దేవుడిచ్చిన వరం.*

రక్తం ఇవ్వగానే విప్రో పార్టనర్స్ సదరన్ నెట్వర్కింగ్ మీటింగ్ కోసం విజయవాడ మీదుగా పోండిచేరీ బయలుదేరాను, రేపు ఉదయం 5 గంటల దాకా ప్రయాణంలోనే. అయినా అదో తుత్తి...

*నాకోసం కొంచెం తొందరగా వచ్చి నా రక్తాన్ని స్వీకరించిన అశ్వ సేవ్ లైఫ్ టీం అండ్ TSCS వారికి నా కృతజ్ఞతలు.*

*మరి మీరు రండి... రక్త దానం చెయ్యండి-ప్రాణ దాతలుకండి. ఈ రోజు 12.30 దాకా కాంప్ జరుగుతుంది.*

మీ అమ్మ శ్రీనివాస్
www.aswa4u.org

ఈ రోజంతా ప్రయాణం

With Gods grace i am able to donate Blood for the "44th Time" in a blood camp conducting by www.aswa4u.org today.

You too can donate blood.

Love all-Serve all
9948885111

జూన్, 2019

Don't you donate blood?

So called *EDUCATORS and EMPLOYEES* keep calling us requesting Blood in emergencies. We can understand their need, but *they need to think on...*

*"why they calling us without"*

- *Donation* by themselves

- *Referring their* friends, colleagues, Relatives

- Posting on their *FACE BOOK STATUS* (it has separate feature too)

- Posting on *their WALLS* and Many *WHATSAPP groups*

- even *donating* after their requirement is fulfilled

- *Promoting Blood Donation and Volunteering* to bridge the donors and requirements, If they are not eligible to donate

*Blood never be manufactured in the Body / homes of Blood Donor...*.

*Every eligible person has to donate blood regularly for every 3 or atleast 6 months*

*ఏరు దాటగానే, తెప్ప తగులబెట్టే ఆలోచలనలతో, వైఖరితో ఎన్నాళ్ళు బ్రతికి ఏమి ఉపయోగం...*

Love all-Serve all
Amma Sreenivas
99 4888 5111
www.aswa4u.org

Happy Birthday

తండ్రి, కూతురు ఒకే రోజు పుడితే, పుట్టిన రోజు జరుపుకుంటే...అది భలే తమాషాగా, డిఫరెంట్ గా ఉంటుంది.ఏదో ఒక రకమైన బహుమతిలా ఉంటుంది. తండ్రి కూతురి పుట్టిన రోజు ప్లానింగ్ లో బిజీ అయిపోతారు.

ఆత్మేయులకి మాత్రం ఒక ఫోన్ కాల్ తో రెండు విషెస్ లతో పనైపోతుంది. అలాంటిదే ఈ రోజు.

నన్ను, నా కూతుర్ని విష్/ బ్లెస్ చేసిన సహృదయులకు, ఆత్మేయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు.

మీ అమ్మ శ్రీనివాస్
99 4888 5111

20.12.2019

మా చిట్టితల్లితో పుస్తక ప్రదర్శనకు

వారం రోజుల నుండి ఒకటే ప్రయాణాలు... త్రోట్ ఇన్ఫెక్షన్, దగ్గు ఒక పక్క అద్భుతమైన షిరిడీ, నాసిక్, త్రయంబకం, ఘృష్ణేశ్వరం, ఎల్లోరా దర్శనాలు మరో పక్క... ఈ రోజే హైదరాబాద్ చేరుకున్నాం. నేరుగా షాద్ నగర్ వెళ్లే ఆలోచన కొద్దిగా వాయిదా వేసి మా చిట్టితల్లిని పుస్తక ప్రదర్శనకు తీసుకెళ్లాలనే ఆలోచన... మాకు వెళ్లాలనే ఎందుకంటే ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి.

ఎట్టకేలకు 12.30 కి NTR స్టేడియం చేరుకొని ఒక గంటలో అన్నీ చుట్టేసి వెళ్లిపోవాలని అద్భుతమైన ప్లాన్ వేసా, కానీ ఏమీ లాభం.

లోపలికెళ్లి ఒక్క స్టాల్ దగ్గరే దాదాపు 2 గంటలు గడిచిపోయాయి. నేను, నా కూతురు, మా ఆవిడ అందరం ఎవరికి తోచిన పుస్తకాలు వారు తీసుకోని, చదువుకొని, తిరిగేసే పనిలో పడిపోయాం. ఈ లోపు తమ్ముడు Naresh Padmaraju మాతో కలిసాడు.

మాలో, మా పాప లో పుస్తక పఠనం పట్ల ఆశక్తిని కాపాడుకోవడానికి ఇలాంటివి తరచు చాలా ఉపయోగపడతాయి సుమీ. కాకపోతే ఇంకా 300 కి పైగా ఉన్న షాప్ లు ఎప్పుడు చూడాలో ఏమో అనుకుంటూ... సమయం అయిపోతు ఉండడంతో నిరాశతో, మళ్ళీ ఒక రోజు రావాలనే ఆశతో వెనుదిరిగాం.

మా చిట్టిది పుస్తకాలు చూసేస్తూ, బుల్లి చేతులతో తాకుతూ, అటు ఇటు తిప్పుతూ, వాటిని చదివి (చూసి) అది ఉంది, ఇది లేదు అనుకుంటూ లీనమై పోయి బాగా ఎంజాయ్ చేసింది. దాన్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది. పిల్లలకి మనం బుక్స్ కొనడం వేరు. వారి ఆలోచనలకు తగ్గట్టు వారు చూసి, కావలసినవి ఎన్నుకొనడం వేరు.

ఇక మా టీచర్ అమ్మ Haritha Vemulapalli సంగతి తెలిసిందే కదా, పిల్లలకి ఏవి సరిపోతాయో, ఏవి సరిపోవు... అలాగే తనకోసం కొన్ని అని తెగ వెతుకులాట......

మీకు, మీ పిల్లలకు మీరిచ్చే అద్భుత గిఫ్ట్ ఇదే సుమీ... కొనడం, కోనకపోవడం, అనవసరంగా కొనడం తరువాత సంగతి... ముందు వెళ్ళండి..

అమ్మ శ్రీనివాస్
www.aswa4u.org

December, 2019

నా అభివృద్ధి కోసం 10 రోజులు

నా జీవితంలో నా అభివృద్ధి కోసం 10 రోజులు కేటాయించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే వర్కుషాప్ పూర్తి అయిన తరువాత మన అభివృద్ధి కి కావాల్సిన, చెయ్యవలసిన, చెయ్యగలిగిన వాటి గురించి తెలిపే విషయ పరిజ్ఞానం మన చేతుల్లోనే ఉంది అని తెలుసుకొని... జీవితాన్ని మరింత ఆనందంగా గడపగలమనే ఆనందంతో, నా గురించి నేను మరింత లోతుగా అధ్యయనం చేసుకున్న అనుభవాలతో కాన్పూర్ నుంచి తిరుగు ప్రయాణం.

ఇది తెలుసుకోలేక, చెప్పినా వినే తీరిక, ఓపిక లేని స్థితిలో, సమాజంతో పాటు ఎటో కొట్టుకొనిపోతున్నాము. మన నిజమైన అవసరాలు ఏమిటో గుర్తించక, డబ్బే సర్వస్వం అనుకొని, సంతోషాలను, బంధాలను తాకట్టు పెట్టి... 1 గంట కూడా మన అభివృద్ధి కోసం కేటాయించుకోలేని సమాజంలో... నాకు ఇలాంటి అవకాశం దొరకడం, నేను దానిని ఉపయోగించుకోవడం నిజంగా నా అదృష్టమే కదా...


మీ అమ్మ శ్రీనివాస్...
 2020/01/25 18:47 

5 వసంతాలు పూర్తి

ఈ రోజుకి 5 వసంతాలు పూర్తి చేసుకున్నాం. మాది సేవా వివాహం అని తెలిసిందే కదా... అయినప్పటికీ మేము ఈనాటి సమాజంలో ఉన్న అమ్మాయి, అబ్బాయిలమే కదా..... ఆలోచన, అభిప్రాయభేధాలు, భిన్న లక్ష్యాలు మాములే...

కానీ....అలాంటి మమ్మల్ని ఒకరినొకరు బాగా అర్ధంచేసుకుంటూ, ఒకే లక్ష్యం వైపు, పరిస్థితులను, పరిసరాలను అర్ధంచేసుకుంటూ, ఓపిక, సహనంతో వుంటూ... సంబంధాలకు, అనుబంధాలకు విలువనిస్తూ, డబ్బే జీవితం కాదు అని గుర్తు చేస్తూ... జీవన పయనంలో నిరంతర సంతోషం కోసం ప్రయత్నించే విధంగా ముందుకి తీసుకెళ్తున్నది మాత్రం జీవన విద్య (Universal Human Values) అనే జ్ఞానం.

అలాగే ఇద్దరం కలిసిచేసే ప్రయాణంలో మాలో మేము, అలాగే కుటుంబంతో కలసి వున్నప్పుడు, మనుషులు ఒకరికొకరు అర్ధమయ్యేవరకు కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి... అలాగని వాటిని భరించే సహనం, ఓర్పు లేకుండా మనుషులను దూరం చేసుకోవడం, వదిలెయ్యడం కాకుండా... ఎలా కలిసి, కలుపుకుపోవాలో కూడా నేర్పింది ఈ జీవన విద్యే...

మొత్తంమీద జీవన విద్య మా ఆనందమయ వైవాహిక జీవితానికి పునాది వేసింది, జ్ఞానాన్ని ఇస్తోంది.

*ఇలా ఉండాలనేది మా లక్ష్యం*

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

ఆశలు తీరని ఆవేశములో... ఆశయాలలో....ఆవేదనలో...
చీకటి మూసిన ఏకాంతములో.....
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

మీ అమ్మ శ్రీనివాస్
08.03.2020

మేము మారం-మేము మనీశులం- మాదంతా వినాశ కులం (మాలో చాలా మందిది మూర్ కులం కూడా)

*మేము మారం-మేము మనీశులం- మాదంతా వినాశ కులం (మాలో చాలా మందిది మూర్ కులం కూడా)*

ఏంది భయ్యా ఇంత నెగటివ్ గా ఉంది...  మనం ఎక్కువ మంది ఇలానే ఉన్నాం, ప్రకృతిని నాశనం చేసేస్తున్నాం... మన నిజ స్వరూపం మనకు తెలియంది కాదుగా... పైపైనే కవరింగ్ లు చేసేసుకుంటూ... గడిపేస్తున్నాం... కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో జంతు, పక్షి జాతులు నాశనమైనా, మనం మటుకు శిలేసుకొని, మృత్యుంజయులమనే భావనతో పోతా...ఉన్నాం...  

వరదలకి మారామా...!
వడగండ్లకి మారామా...!
భూమి కంపిస్తే మారామా...!
ఉపద్రవాలకి మారామా...!
ప్రకృతి వైపరీత్యాలకి మారామా....!
సునామీకి మారామా...!
గ్లోబల్ వార్నింగ్ కి మారామా...!
సహజ వనరులు తగ్గితే మారామా...!
కాన్సర్, అల్సర్లకు మారామా...!
అప్పుడేప్పుడో కలరా కదిలించినా - 
ఇప్పుడు కరోనా వచ్చినా !
అబ్బే మేము మారుతామా...??? "మేము మారం"

కర్ఫ్యూ అన్నా, కరోనా అన్నా, ఎవరు ఏమన్నా మేము మటన్ షాప్ ల ముందు బారులు తీరుతాం... తిరిగి మేమే మార్చురీలలో మాంసం ముద్దలవుతాం... అయినా "మేము మారం"

మట్టిని, చెట్టుని, పిట్టని, చివరికి మనిషిని... నానావస్థలు పడి, ఎలాగైనా సరే ఆ... నాలుగు అవస్థలను అస్తవ్యస్థం చేస్తాం, సామరస్యాన్ని సమాధి చేస్తాం,  అస్థిరమైన మన అస్థిత్వాన్ని చాటుకొంటాం, చివరికి మా నోట్లో మేమే మన్ను కొట్టుకుంటాం.... ఎందుకంటే సృష్టి మొత్తం మేమే, మా కోసమే అన్న అహం...  అందుకే "మేము మారం"

పాత పద్ధతులు చేదంటాం, విజ్ఞానం లేదంటాం, అన్నిటినీ ప్రశ్నిస్తాము, దేనిని ఆచరించం, మంచి ఎక్కడో గ్రహించం, అన్నిటికి పెటెంట్ అంటాం, లేకపోతే గుడ్డిగా నమ్మమంటాం... జ్ఞానానికి, మతానికి, మనిషికి, మానవత్వానికి ఏవేవో లింకులెడతాం, మా వాదమే నిజమంటాం... చివరకి అటు ఇటు కానీ మనుషులం అవుతాం... తెలుసుగా "మేము మారం"

మనం మారకుండా, మనల్ని నియంత్రించు కోకుండా ఏదో విధంగా సమస్యకు ఒక (తాత్కాలిక) సమాధానం కనిపెడతాం, ప్రకృతితో పరాచకాలు ఆడుతాం, ఏవేవో అరాచకాలు చేస్తాం, బాధ్యత మరుస్తాం, తరచు ఇలా భయంతో వణికి చస్తాం......అయినా "మేము మారం"

మనల్ని, మన తోటి మనుషులను అర్ధం చేసుకొనే జ్ఞానమే మనకు లేదు... ఇక ప్రకృతిని, దాని నియమాలను, సృష్టి రహస్యాలను ఏమి అర్ధం చేసుకోగలం... కానీ... అన్నీ తెలుసనో, తెలుసుకోగలమనో అహంభావంతో ప్రపంచాన్ని పాలించాలంటామ్, తెలిసీ తెలియక తనువు చాలిస్తాం... ప్రకృతిని ప్రేమిస్తే, గౌరవిస్తే అన్నీ తెలుసుకోవచ్చు అనే చిన్న విషయాన్ని మరుస్తాం...ఎన్ని జరిగినా "మేము మారం"
 
మనుషుల మధ్య బంధాలను విస్మరిస్తాం, ఏదేదో గ్రహాల మధ్య దూరాలను విశ్లేషిస్తాం...ఇంటిలో మనుషుల మధ్య మొదలలై, దేశాల సరిహద్దుల దాకా జరిగే ఆధిపత్య పోరులో అశువులు భాస్తాం... ఇంతకీ ఎందుకు పుట్టాం, ఎందుకు చచ్చాం, ఎందుకు ఆరాటం, దేని కోసం పోరాటం...ఏమో ఎవరికి తెలుసు ? పాడే ఎక్కినా తెలీదు, ఎక్కిన వారిని చూసైనా అర్ధం చేసుకోము. పోనీ కాసేపటి స్మశాన వైరాగ్యమైనా కానరాదాయే.... తెలిసిన జ్ఞానులము కాదు, తెలుసుకోలేని గొర్రెలము కాము...తెలుసుకొనే సమయము, సహనము రెండు లేవాయే... వీటికితోడు ఎవరికి వారు తామే గురువు అనే భావన...

ప్రకృతితో ప్రేమగా జీవించే మార్పు మా DNA లో లేదంటామ్, రాదంటాం.... మా అలవాట్లను, పద్దతులను మార్చుకొకుండా పని జరగాలంటాం. కానీ ఇలా ప్రకృతి కన్నెర్ర చేస్తే... ఇంకేం చేస్తాం.... చెయ్యకపోతే కలిసి కట్టుగా చస్తాం... ఇంకెంతకాలం మారకుండా ఉంటాం.... 

*మనిషి నేనొక్కడినే అనే భావనలో కాకుండా...  ప్రకృతితోను, అందులోని అన్ని జీవరాసులతోనూ కలిసి, మమేకమై సామరస్యంతో  ఆనందంగా మనుగడ సాగించడమే మానవ జీవిత లక్ష్యం. దానిని తెలియచెప్పి, అర్ధంచేయించి (చదువు), ఆచరించేట్టు (సంస్కారం) చెయ్యడమే మన విద్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి పరిశ్రమలకు ఉద్యోగస్తులనే కాకుండా, మనిషిగా సామరస్యంతో  జీవించే మనుష్య జాతిని తీర్చిదిద్దడం ఈ విద్యకే సాధ్యం, ఈ మార్పుకు విద్యా రంగమే తొలి మెట్టు...* ఇదే నా ఆనంతరంగం... మీ అమ్మ శ్రీనివాస్...  2020/03/22 01:32  

21, మే 2019, మంగళవారం

మనం వెతికేది షార్ట్ కట్ కోసమే

*ఏమిటో నా అనంతరంగంలో ప్రతి క్షణం ఇవే ఆలోచనలు. ఏమి చెయ్యాలి చెప్మా.. అందుకే రాసి నాకు హితులు, స్నేహితులు అయిన మీ మీద వదులుతూ వుంటా, పాపం మీకు తప్పదుగా, చదువుకోండి...మీ అమ్మ శ్రీనివాస్*


సినిమాలలో హీరోలలాగానో (లేదా) నిజ జీవితంలో వ్యాపారవేత్తల లాగానో ఒక్క గంట లో సమాజాన్ని మార్చెయ్యడం, (లేదా) బాగా సంపాదించేసి భారీ ఎత్తున (ప్రపంచం అంతా గుర్తించేట్టు, అవాక్కయేట్టు) సాటి వారికి సాయం చెయ్యాలి *అనే ఆలోచన సమాజంలో చాలా బలంగా నాటుకుపోయిన మాన్యత.*

*చెయ్యాల్సిన, చెయ్యగలిగిన పనులు మానేసి ఎప్పుడో ప్రపంచాన్ని ఉద్దరించాలి అనే వాయిదా వేసుకొనే ఆలోచనలు ఎందుకు మాష్టారు.* ఈ ఆలోచన విధానమే తప్పు మహాప్రభో. *తెలిసిన, తెలియకపోయినా, నచ్చిన, నచ్చకపోయినా ప్రతి క్షణం మనకు అవసరమైన సాయం, సాటి వారిని నుంచి అప్పనంగా తీసుకోవడం / పొందడం ఎలా అయితే మన నరనరాల్లో జీర్ణించుకుపోయిందో, అలాగే.... మనకున్న దాంట్లో ప్రతి క్షణం సాయం చెయ్యడం (ఎందుకంటే తీసుకున్నది తిరిగి ఇవ్వడం) మన కనీస భాద్యతగా అలవాటుచేసుకోవాలి.* ఇది మన కల్చర్ లో నుంచి, మన DNA లో నుంచి క్రమేపి కనుమరుగైపోతోంది. రాబోయే  రోజుల్లో సాటి వారికి సాయం చేసే భాద్యత గల వారిని ప్రత్యేకంగా రీసెర్చ్ చేసి పుట్టించాల్సిన రోజులు దగ్గరపడ్డాయి. *ఇదెలా ఉంటుందంటే నిర్లక్ష్యం వలన తీర్చడం మానేసి పెరిగి పెద్దదైన (రోజు రోజు కి పెరిగిపోతున్న వడ్డీతో) అప్పుని తీర్చడం చేతకాక అప్పుడు, ఇప్పుడు అని వాయిదా వెయ్యడంలాగా. దీవాల తీయడం తప్ప, తిరిగి ఇవ్వడం వుండదు.* అసంతృప్తితో చనిపోతూ, ఈ మొత్తం అప్పుని కట్ట కట్టుకొని తీసుకుపోతావు. అప్పుని మాత్రమే కాదు సుమీ, దానిని సకాలంలో తీర్చకపోవడం వలన వచ్చే పరిణామాలను, ఫలితాలను కూడా.

*"ఎన్ని జరిగిన, జరుగుతున్నా, ఇప్పటికీ మనం వెతికేది షార్ట్ కట్ కోసమే. అది సంపాదన అయినా, సంతోషం అయినా".* మనం ఏమి చెయ్యనక్కరలేదు, చెయ్యగలిగిన చిన్న చిన్న పనులను (ఎదో సమాజాన్ని మనం ఉద్దరిస్తున్నామనే భావనతో కాకుండా) *నా ఋణాన్ని నేను ఖచ్చితంగా తీర్చుకోవాలి, తీర్చుకుంటున్నాను అనే కృతజ్ఞతా భావానికి ప్రాధాన్యత ఇస్తూ... నిబద్దతతో,  భాద్యతతో,8 ప్రేమతో, సంతృప్తితో చెయ్యాలి, అది చాలు.*

*చేయగలిగిన చిన్న చిన్న పనులను, తిరిగి ఇవ్వగలిగిన చిన్న చిన్న అవకాశాలను వెంటనే అందిపుచ్చుకోకుండా..చూసి చూడనట్టు, పట్టీ పట్టనట్టు, నిర్లక్ష్యంగా,(కొన్ని సంవత్సరాల తరువాత/ జీవితంలో బాగా స్థిరపడిన తరువాత/పెళ్ళైన తరువాత/వుద్యోగం రాగానే/చదువు అవగానే/ రిటైర్మెంట్ అవగానే/బాగా సంపాదించగానే ఎదో ఉద్దరిస్తాను లాంటి) వాయిదా వేసే ధోరణితో వ్యవహరించే (మన)అందరిలోనూ ఈ మార్పు రానంత కాలం..మారవ్.. మారవ్..రోజులు ఎప్పటికి మారవ్...* మీ తిట్లు, కామెంట్లు ఏమైనా ఉంటే కింద లింక్ లొనే రాసుకోండి...

మీకు ఇంకా తనివి తీరకపోతే, నా మరిన్ని రాతల కోసం సందర్శించండి http://ammasrinivas4u.blogspot.com/ *(కాకపోతే నా ఆశ, శ్వాస ఒకటే. కాబట్టి ఆలోచనలు, రాతలు కూడా వాటి మీదే)*