1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

31, డిసెంబర్ 2018, సోమవారం

Life is a Celebration

*Life is a Celebration.... జీవితంలో ప్రతీ క్షణాన్ని మనం ఆస్వాదించే పరిపక్వత, సమర్ధత మనకు లేదు కాబట్టి, ఏదో ఒక పేరు చెప్పి Celebrate చేసుకోవడంలో తప్పు లేదు.* ఇందులో Celebration అనే పదానికి ఎవరి అర్ధం వారికుంది,అది వారి వారి పరిపక్వతని బట్టి ఆధారపడివుంటుందనుకోండి, అది వేరే విషయం.

*ఇంతకీ...యావన్మంది ప్రజానీకానికీ నేను సెప్పొచ్చేది యేటంటే...* ఈ 364 రోజులు ఏదో పొడిసేసామ్, రక్కేసామ్, దున్నేసాం అనుకోని చివరి రోజంతా వృధా చెయ్యడం (దీన్నే Celebration అంటారోయ్ అని మీరంటే, నేను ఏమి సెప్పను సెప్మా) ఒక ఎత్తు.... మరో 365 కత్తి, కేక, తురుము రోజులు వస్తాయి అనుకొని ఊహల్లో విహరిస్తూ, మరో రోజు వృథాగా ఖర్చు చెయ్యడం మరో ఎత్తు.

*మన జీవితాన్ని , అలాగే మనకు తెలిసిన వారి జీవితాలను Happy & Prosperous గా ఉంచడానికి* అసలు మనకి జీవితం గురించి సరైన అవగాహన ఉందా యూవరానర్?.. పోనీ అలా ఉండడానికి ఏమి చేస్తున్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మనకు కనపడేది పెద్ద ????

కాబట్టి సోదర సోదరీమనులందరు కనీసం ఇప్పుడు మన స్థితి ఏమిటి, మన జీవిత లక్ష్యం ఏమిటి *(మానవులందరి జీవిత లక్ష్యం సంతోషం, సమృద్ధి అని మనం తెలుసుకోవడానికే, ఇక దానిని అర్ధం చేసుకోని, దానికోసం ప్రయత్నించడానికి మరో జీవితం కావాలేమో-అతిశయోక్తా???),* దీని కొరకు ఈ సంవత్సరం మన లక్ష్యం ఏమిటి, దాని సాధన కొరకు *ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎందుకు చేయాలి అనే ప్రణాళిక వేసుకొని, పని ప్రారంభిస్తే బావుంటుందని నా అవుడియా...ఆలోచన...అభిప్రాయము....*

ఓ..సో..సి.. ఇదా నువ్వు సెప్పొచ్చేది, ఇలాంటి వాగ్దానాలు, లక్ష్యాలు (రాజకీయ నాయకులలాగా) మేము ఎన్ని పెట్టుకోలేదు, ఎన్ని తుంగలో తొక్కలేదు అంటే.. ఏమి సేతురా లింగ, నేను ఏ.....మీ..... సేతురా...

ఆలోచించండి, అడుగేయ్యండి, ఆచరించండి.... *మీ అందరికి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మీకు సెప్పింది నాకూ.... వర్తిస్తుంది కదా, కావున నేను ఆ పనిలో ఉండేద జహ..పనా.....*

*అందరూ బాగుండాలి, అందులో నువ్వు, నేను, మనమందరం ఉండాలి*

నా అనంతరంగం...మీ అమ్మ శ్రీనివాస్  2018/12/31 22:25

http://ammasrinivas4u.blogspot.com/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0


28, డిసెంబర్ 2018, శుక్రవారం

అందరూ గొప్పవారే

*ప్రపంచంలో అందరూ గొప్పవారే...* సమస్యల్లా సంపూర్ణ అజ్ఞానం చేతనా (లేక) మిడి మిడి జ్ఞానం చేతనా అనేదే???

ముందసలు, నేను ఏ కోవలోకి వస్తానో చెక్ చేసుకోవాలి☺️, *అయినా విశ్వమే శూన్యం కదా...*

నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్


పోయాక, పాడెక్కాక.... చాలా మంచివారని, వారిలోని గొప్ప గుణాలు వెలికితీసి కొనియాడుతావు...

*పోయాక, పాడెక్కాక.... చాలా మంచివారని, వారిలోని గొప్ప గుణాలు వెలికితీసి కొనియాడుతావు...*

*కానీ ప్యాణంతో మన పక్కనేనో, పంచనో బతికున్నప్పుడు మాత్రం, ఎప్పుడూ వారిలో తప్పులను వెతుకుతూ, బంధాలను, సంబంధాలను బతుకు జీవుడా అని కొనసాగిస్తూ...* ఎవరికి వారే యమునా తీరే అనే తీరులో, దగ్గరగా ఉంటూనే మధ్య గోడలు కట్టుకు బతికేస్తావు...

అట్ట కాక, *ఎటువంటి పరిస్తితులలోనైనా, ఎలాంటి వ్యక్తులు, వ్యక్తిత్వాల మధ్య వున్నా, నువ్వు(నేను,మనం) మనుషుల మధ్య విభేదాలు పెంచక, ఒక మంచి వాతావరణాన్ని సృష్టించగలిగితే.....* ఇంకేముంది మనం ధన్యజీవులమైనట్టే, మనకి పరిపక్వత వచ్చినట్టే, అలాగే మనతోనపాటు ఇతరుల సుఖ సంతోషాలకోసం ప్రయత్నిస్తున్నట్టే....

అటుల కాక విభేదాలను సృష్టిస్తూ, రెచ్చగొడుతూ, అగ్నికి ఆజ్యం పోస్తుంటే మాత్రం.... *చివరికి బాధపడేది నువ్వు, నేను,  మనమే సుమీ.... ఎందుకు బతికినంత కాలం ఈ మనస్సాంతి లేని అంతర్యుద్ధాలు... బతుకు అర్ధం సమజ్ గాలేదనే మనకి. అయ్యా, సమజ్ గాలేదని మనం ఒప్పుకుంటామా ఏంది.* మనల్ని మనం మోసం చేసుకుంటూనే ఉంటాం.

కాబట్టి *కామ్రేడ్స్ మనం బ్రతికి ఉన్నప్పుడే పక్క మనిషిలో మంచిని, మానవత్వాన్ని మాత్రమే చూస్తూ, ఆనందంగా బతికితే పోలా...అదిరిపోలా....*

*అప్పుడప్పుడు నా అనంతరంగం యొక్క ఆవిష్కరణ జరుగుతూ ఉంటుంది, అవన్నీ ఈ బ్లాగ్లో ఆవిష్కరించటం జరిగింది.*
http://ammasrinivas4u.blogspot.com/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

*శుభం భూయాత్.....*

మీ అమ్మ శ్రీనివాస్
2018/12/28 11:56


8, అక్టోబర్ 2018, సోమవారం

An inspiration


*Scene-1:*
*నెలకు ఒక గంట సమయం* ఇవ్వమంటే చెయ్యవలసిన పనులు మనకి వంద గుర్తొస్తాయి. జీవితంలో నెలకు 1 గంట సమయం తోటి వారికోసం ఇవ్వడం అసంభవం, అసాధ్యం అనిపిస్తుంది మనలాంటి వారికి ఎందరికో....

కానీ ఇతను ప్రతి సోమవారం  ప్రభుత్వ పాఠశాల పిల్లలతో నేరుగా *3 గంటలు* గడుపుతారు, ఇక ఇంటి నుంచి స్కూల్ కి రాను పోను *1.5 గంటకు పై మాటే,* పిల్లలకి ఏమి చెప్పాలో, ఎవరెవరు వస్తున్నారు, రావటం లేదు ఇలాంటి వాటికి కనీసం *1.5 గంట పట్టదా?* దీనికి తోడు సెషన్ అవగానే ఏమి చెప్పారు, ఎవరెవరు వచ్చారు మొదలగు వివరాలు వెంటనే మాకు తెలుపుతూ, డాక్యుమెంట్ చేసుకోవడానికి *1 గంట...* మొత్తం *7 గంటలు ఒక వారానికి అతను ఇచ్చే సమయం... అంటే సరాసరి రోజుకు గంట*

*దీనికే మనలాంటి చాలా మందిలో సూపర్ అహే నువ్వు అనే ఫీలింగు, సమాజం కోసం జీవితాన్నే త్యాగం చేస్తున్న భావన కలుగుతాయి.... కానీ ఇతనికి ఆయన ప్రాజెక్ట్ కాకుండా....* అశ్వ లో రక్త దానాలు, అన్న దానాలు, ఆశ్రమ సందర్శనలు, నెల వారీ సమావేశాలు అన్నింటిలోను ముందుంటాడు...

అలా అని ఆఫీస్ కి డుమ్మానా అంటే మీరు కాలు కుండీలో వేసినట్టే.... *అవసరనప్పుడు ఆదివారాలు, ఓవర్ టైం లు కూడా చేస్తాడు..*

పోనీ తాడు బొంగరం లేని బ్యాచిలరా అంటే.... అది కూడా కాదు... తల్లిదండ్రులు, అర్ధాంగి అంత ఒకటే చోట, ఉమ్మడి కుటుంబం....

*Scene-2:*
గత 6 సంవత్సరాలుగా (ప్రతి వారం చెయ్యడం ఎంత కష్టమో సేవా రంగంలో ఉన్న వారికే తెలుస్తుంది) పట్టువదలని విక్రమార్కుడిలా, వాలంటీర్లు వచ్చినా, రాకపోయినా, సహాయ సహకారాలు అందించినా, అందించకపోయినా, గుర్తింపు వచ్చినా, రాకపోయినా ఆ వ్యక్తికి ఏమి పట్టవు. *బాధ్యత తీసుకుంటే ఎలా ప్రాణం పెట్టి, ఇష్టంగా చెయ్యాలో అతనిని చూసే నేను నేర్చుకుంటున్నా అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు... అతను బాద్యతకు నిలువెత్తు నిదర్శనంలాగా కనిపిస్తాడు...*

*Scene-3:*
ప్రతి సంస్థ ఎదుర్కోనే సమస్య వాలంటీర్స్ చాలా మంది ఎందుకొస్తారో, ఎంత కాలం పని చేస్తారో, ఎందుకు వెళ్లిపోతారో తెలీదు... పోనీ వెళ్లిన కారణం తెలిస్తే, దీనికి కూడా సేవ చెయ్యడం మానేసి వెళ్లిపోయే వారుంటారా అనిపిస్తుంది. *ఎందుకంటే 90 నుంచి 95% ఎంత వేగంగా వస్తారో, అంతే వేగంగా వెళ్ళిపోతారు.. ఎందుకా అని ఆరా తీస్తే ... దుర్యోధనున్నీ చూసి పాంచాలి నవ్విందనో, ఇంగ్లాండ్లో ఇండియా టెస్ట్ లు గెలవలేదనో, అర్జున్ రెడ్డి సినిమా 100 రోజులు ఆడిందనో, ఎవరో ఉచిత సలహా ఇచ్చారనో, లేక ఇవ్వలేదనో, తన సలహా సంస్థ స్వీకరించలేదనో, తనకి పట్టం కట్టి పల్లకీలో ఊరేగించలేదనో, పని వత్తిడో, కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నామనో.....* ఇలా చాలానే ఉంటాయిలేండి..... *సంస్థకి కాదు, సేవకు బాయి బాయి చెప్పేస్తారు....* ఏమి చేద్దాం పాపం సేవ అంటే ఏమిటో పూర్తి అవగాహన లేదు or అర్ధం చేసుకునే మానసిక  పరిపక్వత లేదు... ఇంకేం చేద్దాం అడ్జెస్ట్ అవుదాం అనే పాటలాగా.. మరో సారి ప్రయత్నించి ఊరుకోవడం తప్ప...

*కానీ మన సినిమాలో హీరో మటుకు ప్రేమించిన పనిని, తన తృప్తి కోసం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్న మొదటి వ్యక్తి (ఆస్వా లో)* అనడంలో ఆవగింజంత కూడా అనుమానం లేదు, నేను ఎక్కువ కూడా చెప్పడం లేదు...

*Scene-4:*
మనోడు ప్రైమరీ స్కూల్ ప్రాజెక్ట్ లీడర్... *కానీ వేరే ప్రోజెక్ట్ లో పాల్గొన్నప్పుడు, ఇప్పుడే కార్యక్రమాలకు మొదటి సారి వచ్చిన వాడిలా బ్యానర్ లు కడుతూనో లేదా ఎవరు ఊహించని పని ఏదో చెస్తూనో కనపడుతూ ఉంటాడు...* ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తాడు, ఎవరితోను దురుసుగా మాట్లాడడు.. ఒక నవ్వు నవ్వుతాడు.. ఏముంది డ్యూడ్ మహా అయితే తిరిగిస్తారు కదా అన్న రీతిలో.....

ఇంకా చాలానే ఉన్నాయి ఈ ఒకటో నంబరు కుర్రాడి దగ్గర నేర్చుకోవాల్సినవి, స్ఫూర్తి పొందాల్సినవి.. ముఖ్యంగా ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకోకుండా... పోనీ కార్యకర్త అయిన తరువాత తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేని ఎందరో వాలంటీర్స్ కి *సేవ ఎలా, ఎందుకు చేయాలో చెప్పే నిలువెత్తు ఉదాహరణ ఇతను...*

*ఇంతకీ ఇతని పేరు చెప్పలేదు కదా... దనేశ్ కుమార్.ఖక్కర్....పిల్లలకి పాటలు చెప్పడం కోసం తెలుగు నేర్చుకుంటున్న కార్పొరేట్ కుర్రాడు.... సేవా రంగంలో ఇతనేమి ఉద్యోగం చెయ్యడం లేదు జస్ట్ వాలంటీర్... కాకపోతే ఉద్యోగి కూడా చెయ్యలేనిది చేస్తున్నాడు కదా.... ప్రేమగా, బాధ్యతగా, పద్దతిగా*

(అశ్వ లో) సేవ చేస్తున్న అందరూ గొప్ప వారే, కానీ ఇతను కొంచెం ఎక్కువ గొప్పవాడు. మనకి ప్రేరణ, స్ఫూర్తి ఎక్కడో ఉండదు...  మనం చూడగలిగితే మన ముందే ఉంటుంది, మన చుట్టూ ఉంటుంది....6 సంవత్సరాలకు పైగా అలాంటి ప్రేరణను, స్పూర్తిని నాకు ఇస్తున్న ఈ వ్యక్తికి అశ్వ ఎమిచ్చిన రుణం తీరదు.

*ఇలాంటి వ్యక్తుల నిస్వార్థ సేవల వల్లనే అశ్వ లాంటి ఎన్నో సంస్థలు ప్రజల సేవలో మమేకమై వర్ధిల్లుతున్నాయి.....* మంచి సంస్థలుగా సేవలందిస్తూ, వేనోళ్ళ కొనియాడబడుతున్నాయి...  దనేశ్ నీ సేవలు ఇలాగే ఇంకా ఎంతో మందికి చేరాలని, నువ్వు నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా, ప్రేరణగా,ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ... మీ అమ్మ శ్రీనివాస్  2018/09/11 00:26