మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
26, డిసెంబర్ 2013, గురువారం
21, డిసెంబర్ 2013, శనివారం
మంత్రం ప్రయోజనం ఏమిటి?
మంత్రాలమీద చాలామంది, చాలా రకాలుగా వ్యాఖ్యానించడం వింటూ ఉంటాం. ''దేవుడికి సంస్కృతం మాత్రమే వస్తుందా?'', ''అసల మంత్రాలు సంస్కృతంలో ఎందుకున్నాయి, తెలుగువాళ్ళకి మంత్రాలు రాసే విద్య రాదా?'', ''మనం నోరు తిరక్క తప్పులు చదివితే, దేవుడు చెవులు మూసుకుంటాడా లేక శాపాలు పెట్టేస్తాడా?'' - అంటూ సరదాగా మాట్లాడడమూ వినే ఉంటారు..
...
మంత్రం విలువ తెలీకనే ఈరకంగా మాట్లాడతారు. ఒకపక్కన మంత్రోచ్ఛారణ చేస్తుంటారు కానీ, ఆ.. వీటిని పఠించడంవల్ల ఏమిటి ప్రయోజనం..'' అనుకుంటారు. అందుకే, మంత్రం గురించి వివరంగా తెలుసుకుందాం.
''మననాత్ త్రాయతే ఇతి మంత్రః'' అన్నారు.
అంటే, మననం చేయడంవల్ల రక్షించేది మంత్రం అని అర్ధం.
''మకారం మన ఇత్యాహుః త్రకారం త్రాణమేవచ
మనఃప్రాణ సమాయుక్తో మంత్రమిత్యభిధీయతే''
మంత్రానికి దేవతలు అధీనులౌతారు. మంత్రం రక్షిస్తుంది. లేనిపోని ఆలోచనలను నియంత్రిస్తుంది. అయితే మంత్రాన్ని స్వచ్చంగా, సుస్పష్టంగా ఉచ్చరించాలి. తప్పులు దొర్లకూడదు. పరిశుభ్రమైన మనసుతో, చాంచల్యం లేని బుద్ధితో మంత్రాన్ని స్మరించాలి.
ఇంతకీ మంత్రాలు సంస్కృతంలో ఎందుకు ఉంటాయంటే... సంస్కృతాన్ని దేవనాగరి అంటారు. ఇది దేవతలా భాష. అదలా ఉంచితే, సంస్కృతంలో ఒక అద్భుతమైన సొగసు ఉంటుంది. సంస్కృత శ్లోకాల్లో లయ ఉంటుంది. ఈ రెండు కారణాలవల్ల మంత్రాన్ని నాలుగుసార్లు జపించేసరికి కంఠతా వస్తుంది. పూర్వకాలంలో ఇప్పటి వసతులు, వెసులుబాట్లు లేవు. కంప్యూటర్లు కాదుకదా, పుస్తకాలు అయినా లేవు. తాళపత్ర గ్రంధాలు ఉన్నప్పటికీ, అని అందరికీ అందుబాటులో ఉండేవి కావు. కనుక, శిష్యులు ఏది నేర్చుకున్నా గురువు చెప్పింది విని నేర్చుకునేవారు. శాస్త్రాలు, ధర్మ గ్రంధాలు మాత్రమే కాదు, స్తోత్రాలు, మంత్రాలు కూడా అంతే. ఒకరి ద్వారా, ఇంకొకరు నేర్చుకునేవారు. అందువల్ల కావ్యాలు, మంత్రాలు ఏవైనా లయబద్ధంగా ఉండేవి.
మంత్రాలు సంస్కృతంలో ఉండటం వల్ల, ఆయా మంత్రాలు నోటికి రావడం ఒక్కటే ప్రయోజనం కాదు.
18, డిసెంబర్ 2013, బుధవారం
Art of Living Daily Sutras
Ego is weight. By your weight, you hurt others. When you become heavy you fall down. One who is weightless is wise. ~~Sri Sri Ravi Shankar
Living moral values - Swami Chinmayananda
A strong mind is cultivated by living moral values. All outer actions start gathering a dazzling polish, once your mental values change. A morally strong person spends less of his mental powers in facing the day to day problems of life.Moral values and ethical principles adopted and accepted by you must be lived fearlessly, even in the face of death. Never compromise, under any amount of pressure. You will find God's help coming to you, to pull you out from even the direst situation.
విజయానికి మూలం విశ్లేషించుకోండి?-గర్వాన్ని అధిగమించడం ఎలా?
విజయానికి మూలం విశ్లేషించుకోండి?
గర్వాన్ని దూరంగా ఉంచడానికి మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేమిటంటే, మీ విజయానికి మూలం ఏమిటి? ఉదాహరణకు సామర్థ్యం అని అవతలి వారు కీర్తించారనుకుందాం. అప్పుడు ఆ సామర్థ్యానికి మూలమేమిటని కూడా ప్రశ్నించుకోవాలి. అవతలి వారు మనని రకరకాల పొగడ్తలతో ముంచెత్తి ఉండవచ్చు. కానీ, అవన్నీ నిజమనే నమ్మకమేమిటి? ఒకవేళ నిందించారనుకుందాం. దానిని అంగీకరిస్తామా? నిందలకు మూలం లేనిపోని కల్పనలైనప్పుడు, పొగడ్తలకు మాత్రం ఎందుకు కాకూడదు? ఈ భ్రమ నుండి బయటపడాలంటే మనలో మనమే ప్రశ్న వేసుకోవాలి. మనకు లభించిన అవకాశాలను మనం వినియోగించుకోగలమే కానీ, వాటిని సృష్టించుకోలేము. ఎంతో ప్రతిభ ఉన్నా, మీ విజయానికి అదొక్కటే కారణం కాలేదు. ఒక విజయం వెనుక ఎన్నో కారణాలున్నాయి. అవేవీ మీరు సృష్టించ గలిగినవి కావు. మీకు సమకూరిన కొన్ని అవకాశాల వల్ల విజయం సాధ్యమయింది. ఈ రహస్యాన్ని గుర్తించినపుడు మీకున్న సామర్థ్యాన్ని గ్రహించి, ఆనందపడడంతో పాటు మీకు సహకరించిన అనేక ఇతర కారణాలకు మీరు కృతజ్ఞతతో ఒదిగిపోతారు. ఎవరో మెచ్చుకోవాలన్న తపన కూడా క్రమేపీ మటుమాయమవుతుంది.
గర్వం వెర్రితనమే!నాలో ఫలానా గొప్పదనం ఉందనీ, దానిని ఇతరులు మెచ్చుకోవాలని ఆరాటపడడం, అలా జరగనప్పుడు సంఘర్షణకు లోను కావడం ఇవన్నీ గర్వానికి మూలమని చెప్పుకున్నాం. ఏదైనా గొప్పదనం ఉన్నా, దానికి గర్వించాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే, ఆ గొప్పదనానికి కారణం మీరు ఒక్కరే కాదు. అసలైన కారణాలలోకి వెళ్ళే సరికి మనలో తలెత్తే కృతజ్ఞతా భావం సంఘర్షణలను పారదోలుతుంది. ఈ భావన మనలోని గర్వాన్ని అధిగమించడానికి మనకు అన్ని విధాలా తోడ్పడుతుంది. ఇక్కడ ఇంకొక రహస్యం కూడా దాగుంది. అదేమిటంటే, ఎదుటి వారి నుంచి గౌరవాన్ని పొందాలనుకోవడానికి కారణం అది మీకు తృప్తినివ్వడమే. మీ సామర్థ్యం మీద మీకు పూర్తి నమ్మకం లేనప్పుడే, మీరు ఎదుటి వారి నుంచి పొగడ్తలను ఆశించి, దానివల్ల లభించే తృప్తిని కోరుకుంటారు. మీ గురించి మీకు తృప్తి ఉన్నప్పుడు, ఇతరులు చేసే సన్మానాల అవసరమే ఉండదు. ఆత్మ విశ్వాస లోపాన్ని గర్వంతో పెంచి పోషించుకుంటున్నామని పదే పదే గుర్తుచేసుకోవాలి.
సమర్థతకి స్వతః ప్రకాశం:సామర్థ్యం కలిగి ఉండడం, దానిని వినియోగించుకోగలగడం మంచిదే. కానీ, అది స్వతస్సిద్ధంగా ప్రకాశించాలి. సువాసనలను వెదజల్లే అందమైన పువ్వులను విరగబూయించే చెట్టు, తానెక్కడున్నా, ఎవరు చూసినా, చూడకపోయినా, తన పనిని తాను ఏ గుర్తింపు పొందాలనీ ఆశించకుండా నిర్వర్తిస్తుంది. నేను విరగబూస్తున్నానొహో అని చాటింపు వేయించదు. మీలోని ప్రజ్ఞాపాటవాలను, సామర్థ్యాలను మీరూ అలాగే వినియోగించాలి. అవి మీకే ఎందుకు వచ్చాయి? దీనిపై ఎవ్వరూ సూటిగా సమాధానం చెప్పలేరు. అందుకే దానిని భగవంతుని అనుగ్రహంగా భావించి, వినియోగించాలి. మీ విలువను గుర్తించిన వాళ్ళు మిమ్మల్ని గౌరవించవచ్చు, లేనివారు పట్టించుకోకపోవచ్చు. దేనికీ చలించ కూడదు.
ఈ అవగాహనతోనే వ్యక్తి గర్వాన్ని సునాయాసంగా అధిగమించగలడు. నిగర్వి లో సంఘర్షణలకు తావులేదు. వెలితి అసలే కానరాదు. నిర్మలంగా ప్రశాంత చిత్తుడై ఉంటాడు. ఈ పరిణతి ఆత్మ జ్ఞానానికి ఊతమిస్తుంది.
ఈ నిర్మలత లేని వ్యక్తిలో దంభం చెలరేగుతుంది. అది వ్యక్తిని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది.
ఓం నమో భగవతే వాసుదేవాయసర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తుకె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం
17, డిసెంబర్ 2013, మంగళవారం
16, డిసెంబర్ 2013, సోమవారం
Details about HAMPI
4, డిసెంబర్ 2013, బుధవారం
Pics & Videos of Ayyappa Padi Puja at my Home
More Photos @ https://plus.google.com/photos/100175864288837441918/albums/5953158357339296545?authkey=CIHuxcb6wsDfTA
Abhishekam & Padi Puja Videos @ YOU TUBE :
http://www.youtube.com/watch?v=1e4s8H3N-QU&feature=youtube_gdata_player
http://www.youtube.com/watch?v=cRnsmM4nbpg&feature=youtube_gdata_player
http://www.youtube.com/watch?v=1e4s8H3N-QU&feature=youtube_gdata_player
Thanks & Regards
S. Sreenivasa Prasad Rao
Smiling, Sharing, Loving, Caring and Helping are my five main weaknesses