1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

31, మే 2018, గురువారం

అంతర్యామి అలసితి, సొలసితి... అంతట నీ శరనిదే జొచ్చితిని....

*అమ్మ శ్రీనివాస్*: అంతర్యామి అలసితి, సొలసితి... అంతట నీ శరనిదే జొచ్చితిని....

*చెప్పు చెకుముకి, అంటూ దేవుడు దర్శనమిచ్చారు*

*అమ్మ శ్రీనివాస్:* స్వామీ, మీకోసం...నేనొక కీర్తన రాసాను

*దేవుడు:* వద్దులే నాయనా కొంపదీసి చుట్టూ పక్కల చూడరా చిన్నికృష్ణ అంటావా.... లేక కీర్తనలో కూడా నన్నొక గంట సమయమో, రక్త దానమో, తలసీమియా పిల్లలకు అమృత  భాండమో, రోగులకు నా పుష్ప పల్లకినో, విద్యార్థులకు జీవన విద్యను కథలు, కీర్తన రూపంలో చెప్పమనో, మేడం లక్ష్మీ ని అడిగి ఆర్ధిక సాయమో, ఏమి కుదరకపోతే వైకుంఠంలో కూర్చొని డేటా లేక ఈవెంట్ రికార్డర్ అప్డేట్, డాక్యుమెంటేషన్ చెయ్యమని అడుగుతావేమో... నీ మేటర్ మా దాకా చేరింది బాబు.. మేమూ జియో ఫోన్ వల్ల అప్ టు డేట్ గా ఉన్నాం..

*అమ్మ శ్రీనివాస్:* కాదు స్వామి పనిని ప్రేమించి, ఇష్టంగా స్వీకరించి, భాద్యత తీసుకుని సామర్థ్యం వున్న వారు లేదా పెంచుకునే ఆలోచనవున్న కనీసం ముగ్గురు కత్తి లాంటి వాలంటీర్ లని ఇవ్వు... వారు తీసుకున్న పనిలోకి పరకాయ ప్రవేశం చేస్తే చాలు... ఇంకా ఎన్నో పనులు చెయ్యాలనే తపనతో తహ తహ లాడుతున్న గురువు గారు

*దేవుడు మనసులో:*  ఓరి... ఈడీ ఆశ ... 10 ఏళ్లకే... అయినా ఇక్కడ క్యూ చాలా పెద్దది ఉంది మాస్టారు...  నిబద్ధత కలిగిన వారు లేక ఇక్కడే మేము ఔట్ సోర్సింగ్ ఇచ్చి కూర్చొని ఉంటే... నీ నస ఏంటి బాబు... *ఓహో నీకు ఉచితంగా, బాధ్యతగా, ప్రేమగా, ఇష్టంగా చేసే వారు కావాలి కదూ.....*

*అమ్మ శ్రీనివాస్:* పెద్ద పనికి అవకాశాలు సమకూరుస్తున్నావు అదే సామీ డ్రీమ్ ప్రాజెక్ట్. బాగా చేసే వారిని చూపిస్తే వారికి ఈ పని అప్పగించాలి మహా ప్రభు.... నాకు తెలిసినంతలో నేను నేర్చుకున్నది పంచుకోవడం ద్వారా సంపూర్ణంగా తయారుచేసే సామర్థ్యం కొద్దో, గొప్పో నాకు ఉంది.

ఎందుకంటే ఎక్కువ మందికి పావో, సగమో, ముప్పావో చేసే ప్రేరణ ఉంటోంది, కానీ సంపూర్ణంగా చెయ్యాలనే ఆలోచన, తద్వారా మనల్ని మనం సంపూర్ణంగా తయారుచేసుకొనే ఆశక్తి వుండే వారే కనుమరుగాయే. *డబ్బు ఏదో విధంగా సమకూర్చగలం, కానీ మంచి పని కోసం, ప్రాణం పెట్టె మనుషులను పూర్తిగా కనపడకుండా చేస్తున్నావేంటి దర్శక రత్న.....

*భక్తా శ్రీనివాసా.....* ఎదో ఒక గంట ఇవ్వడమే గొప్ప విషయం అనుకుంటుంటే, నువ్వేంటి బాబు సంపూర్ణ రామాయణం, సంపూర్ణేష్ బాబు అనుకుంటూ....ఆశ, దోశ, అప్పడం, వడేమి కాదు.....

*నేనొక నిజం చెపుతా విను ప్రసాదు..* ఎంచుకున్న పని మీద నిబద్ధత, ఇష్టం, పనే జీవితం, పనే వృత్తి గా గడిపే వారు తక్కువ..   కాదు కాదు అరుదుగా వుంటారు. అది పూర్వ జన్మ సుకృతమేమి కాదు... దేవునికి దగ్గరగా చేరడానికి మనిషి ఎంచుకున్న సర్వోత్తమమైన మరో దారి (మానవ సేవయే మాధవ సేవ అనే నా మాటలు అర్ధం చేసుకోగలిగితే)... ఆవేశ పడి, అతిగా ఆలోచించి, ఆరోగ్యం పాడుచేసుకోక, 3 గంటలు కావస్తోంది బబ్బో.... మళ్ళీ కాసపటికి నాకు సుప్రభాత సేవ మొదలవుద్ది...

*స్వామీ.....ఎక్కడ*

*భయపడకు....వెళ్లిపోలేదులే* అగాధమౌ జలనిధిలోనే ఆణిముత్యమున్నటులే, కష్టాల మాటున కూడా సుఖమున్నదిలే.... దృఢ సంకల్పం ఉంటే ఎదైనా సాధించవచ్చు చెవుతుంటావుగా నువ్వు.... వెతుకుడి.... దొరుకుడు.

*సర్లే సామీ ఏమి చేద్దాం....* ప్రయత్నమే నాది, ఫలితం గురించి పెద్ద పరేషాన్ లేదు... ధోని సెపుతుంటాడులే... అవునయ్యా... నీ కర్మ సిద్దాంతమే, లేటెస్ట్ వెర్షన్....


నా అనంతరంగం దేవునితో సంభాషణ.... ఏదో నా రాతలు.... ఎవరినీ ఉద్దేశించినవి కావు... తప్పులేమన్న ఉంటే అన్యధా భవించక, తిట్టుకోక, నాకు తెలియజేయ ప్రార్ధన....అమ్మ శ్రీనివాస్ 2018/05/31 02:09 

26, మే 2018, శనివారం

లక్ష్యం, లక్ష్య సాధకునితో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది.

నేను అలా అయితే ఎంత బావున్ను అనేది కాదు - నేను దీన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నాను అనేదే అసలు తేడా. *లక్ష్యం అనేది అస్పష్టమైన ఆలోచన కాదు, ఒక స్పష్టమైన అవగాహన*.

*మనిషి నర నరాల్లో జీర్ణించుకొనిపోయిన లక్ష్యం, లక్ష్య సాధకునితో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. అతనికి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్లాలి, ఏమి చెయ్యాలి, ఏది తప్పొ, ఏది ఒప్పో అనే స్పష్టమైన సంకేతాలను ఇస్తూ, దారి తప్పనివ్వక, సరైన దారిలో తీసుకెళ్తుంది. కష్టాలలో ఏమి చెయ్యాలి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే సర్వ సామర్ధ్యాలను, ఆయుధాలను అదే నీ కోసం సిద్ధం చేస్తోంది. అసలు ఏమి సాధించని వారికి, సగం సాధించిన వారికి, పూర్తిగా సాధించిన వారికి తేడా ఒకటే వారికి వారి లక్ష్యం మీద వుండే అవగాహనా స్థాయి. అది ఎంత సంపూర్తిగా ఉంటే, సాధన (విజయం) అంత సంపూర్తిగా ఉంటుంది.*

ప్రయాణంలో వున్నాను కదండీ, నాతో నేను గడిపే సమయం దొరికినట్టే.... నా అనంతరంగం ద్వారాలు తెరుచుకుని, ఆలోచనలు వరదలా పరవళ్ళు తొక్కుతాయి....

అమ్మ శ్రీనివాస్ 2018/05/25 21:20

25, మే 2018, శుక్రవారం

ప్రచారం అవసరమా? లేదా?

*పాలు అమ్మాలంటే ఇల్లిల్లు తిరగాలి-కల్లు అమ్మాలంటే చిటికలో పని....*

సమాజం నాశనం అయిపోతోంది....చెడు విపరీతంగా పెరిగిపోతోంది..

*మంచి వారు ఎక్కువే వున్నారు-కానీ మంచి తక్కువగా ఉన్నది, నిదానంగా వ్యాపిస్తుంది..*

చెడ్డ వారు తక్కువ వున్నారు-చెడు మాత్రం విపరీతంగా, తొందరగా వ్యాపిస్తుంది...

చెడ్డ పనులకు, వార్తలకు ఎక్కువ వ్యూస్, దాని మీద అందరం విపరీతంగా చర్చ... దీనిని మరో నలుగురికి స్ప్రెడ్ చెయ్యడానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను  మనమే కారణం...

*ఇంకో పక్క మంచిని పాఠించడానికి, చూడడానికి, వినడానికి, నలుగురితో చెప్పడానికి, చర్చించడానికి, వ్యాప్తి చెయ్యడానికి కించిత్ కూడా కష్టపడం. కానీ మనము, మన కుటుంబం, సమాజం అంతా మన దగ్గరికి వచ్చేసరికి మంచిగా ఉండాలి??*

మనం, మన కుటుంబం మనకి అందుబాటులో ఉన్న  భావవ్యక్తీకరణ, ప్రచార, ప్రసార సాధనాలను రోజులో ఎంత సేపు మంచి వ్యాప్తి కోసం వాడుతున్నాం... తెలిసి తెలీకుండా ఎంత సేపు చెడు వ్యాప్తికి వాడుతున్నాం?పెద్దలు మనకే తెలియనప్పుడు పాపం పిల్లలు ఏమి చేస్తారు, వారితో ఏర్పడబోతున్న నవ సమాజం ఎలా మంచి సమాజం అవుతుంది..చెడు వ్యాపించడానికి మనం సహకరించి, మంచి వ్యాప్తి కోసం ఏమి చెయ్యక.. మళ్ళీ మంచి సమాజం కావాలని కలలు కనడం ఏమిటో చెప్మా....

*మంచి / సేవ చేసే వారికి ప్రచారం అవసరం లేదు, ఎందుకంటే అది మనిషిగా పుట్టిన, మనిషి అని భావించే ప్రతి ఒక్కరి భాధ్యత... కాకపోతే అందరిలా సమాజంలో కొట్టుకుపోకుండా తన బాధ్యతను నిర్వర్తించే ఎవరికైనా ఆ గౌరవం ఇవ్వడం ప్రస్తుత సమాజంలో సబబే... కానీ మంచికి / సేవకి మట్టుకు తప్పకుండా ప్రచారం కావాలి, ఎప్పటిదాకా అంటే ప్రతి ఒక్క మనిషి సాటి వారికి సాయం చెయ్యడం సేవ కాదు, మన సామాజిక బాధ్యత అని లోకం గుర్తించే వరకు, పాటించే వరకు*.... ఏదో మూల సమాజం కోసం పరితపించే మంచి వ్యక్తులు కూడా ఇది గమనించాలి.....

*సమాజం గమనించాలి, సహకరించాలి. ఎందుకంటే మనం ఒక్క అడుగు కూడా వేయడానికి కదలకుండా, సమాజాన్ని పరిగెత్తమంటే ఎలా సామీ... అంటే సమాజం అంటే మనమే అనే కనీస స్పృహ కోల్పోయామా...??*

నా అనంతరంగంను ఆవిష్కరించడానికి, చర్చ ద్వారా సహకరించిన మా మిత్రులు *లక్ష్మణ్* గారికి కృతజ్ఞతలు... అమ్మ శ్రీనివాస్ 2018/05/25 17:18

http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

14, మే 2018, సోమవారం

తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే

ఏందయ్యా... *తల్లి కడుపులో పిండ దశ నుంచి, చివరి దశలో పాడే దాకా ప్రతి క్షణం నా పైనే ఆధారపడతావు....* అన్నింటికీ ప్రాధాన్యత, సమయం, డబ్బు ఉంటాయి కానీ, నాకు ఇవ్వడానికి ఉండదా, అంత బిజీ నా నువ్వు.. కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం, భవిష్యత్ అని కుంటి సాకులు చెబుతావ్...  ఎవరిచ్చిన్రు ఇయన్ని...??? ఏం భాయ్... *నాకేమన్నా దయ, దాక్షిణ్యాలతో చేస్తున్నావా ఏంటి... నీ భాద్యత మాస్టారు... నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వవలసిన మొట్ట మొదటి వ్యక్తిని నేనే, పని నాదే, ఆలోచన నా గురించే...* నీకు అవసరం అయినవి అందగానే దిమాగ్ చెడిందా ఏంది..  తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే అని అతనెవరో సెప్పినట్టు....

*అని ఎవరు ఎవరితో అంటున్నారో చెప్పుకోండి సూద్దాం....*

నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్
2018/05/14 11:13

*నా ఘోష్ట్ లు (అదే పోస్ట్ లు) చదవాలంటే*

http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

6, మే 2018, ఆదివారం

ప్రాంతాభిమానం, కులాభిమానం, మతాభిమానం

ప్రాంతాభిమానం, కులాభిమానం, మతాభిమానం డాష్ డాష్ డాష్ అభిమానాలు ఎన్నైనా కొద్దిగా ఉండొచ్చునేమో...

*కానీ... దేశాభిమానాన్ని, సంస్కారాన్ని, మానవత్వాన్ని, సమానత్వాన్ని మరిచిపోయేలా, మరుగునపడిపోయేలా ఉంటే ఎలా చిట్టీ...*

నువ్వు చదివిన పుస్తకాలు లేదా నీకు నేర్పిన మనుషులు సరైన సమాచారాన్ని / విషయాన్ని ఇవ్వక, వారికి అర్ధమైంది అనుకున్న, సగం సగం అర్ధ రహిత విషయాన్ని నీకు నేర్పించారు మహాప్రభూ.... ఎందుకంటే ఎవరికి వారే గోప్ప్పోరు, వారికి నచ్చిన విధంగా వక్రీకరించి సమాజ పతనానికి కారణం అవుతున్నారు....

మరి సరైన భావజాలం ప్రజలకు ఎలా చేరుతుంది...???

నా అనంతరంగం.... అమ్మ శ్రీనివాస్

1, మే 2018, మంగళవారం

నా ప్రేమ నన్ను వలచి, నన్ను మలచి ఒక దశాబ్దం గడిచిందా....

అప్పుడే నా ప్రేమ నన్ను వలచి, నన్ను మలచి ఒక దశాబ్దం గడిచిందా....

కాలం మాయ చేసిందా, 10 ఏళ్ళు ఇంత తొందరగానా... నా ప్రేమే... నా ప్రాణంగా, శ్వాశగా, జీవన శైలిగా మారుతూ ఉంటే.. . సంతోషమే గా...

ఒక సామాన్యుని కల, కళ్ళ ముందు ఆవిష్కరించబడుతుంటే... జీవితానికి ఇంకేమి కావాలి....ఇది సంకల్ప బలమా ? నిస్వార్థ ఫలమా?

ఇదంతా ఆస్వాదిస్తూనే, గుర్తెట్టుకోవాల్సింది మరోటుంది అదే......మాస్టారు... చేసింది గోరంత, చేయాల్సింది కొండంత....

దృఢ సంకల్పం, నిరంతర సాధన నా పని....మిగతావన్ని సమకూర్చడం దేవుని పని... అమ్మ...నా అస్వో...

*కానీ ఎంత మాట్లాడుకున్నా... 10 ఏళ్ళు ఒక సంస్థను, స్వచ్చంద కార్యకర్తల సాయంతో, వివిధ కార్యక్రమాలను తరచూ చేస్తూ... కార్యకర్తలలో సేవ చెయ్యడం నా భాద్యత అని ప్రేరణ కలిగించడం ఒక ఎత్తు అయితే, ఎదో కార్యక్రమాలు చెయ్యాలి అని కాకుండా..మంచి, మార్పు తెచ్చే కార్యక్రమాలు చెయ్యడం మరో ఎత్తు... నా లాంటి అర్భకుడికి ఇది సాధ్యమైంది అంటే దైవ లీల, నా పూర్వ జన్మ సుకృతం కాక ఇంకేమిటండి.*

అమ్మ శ్రీనివాస్
www.aswa.co.in
9948885111

జవాబుదారీ తనం

నేను ఈ మధ్య చూసిన సినిమాలలో రెండు డవులాగులు నన్ను బాగా ఆకర్షించాయి....

1. భాద్యత, భయం (దీనిగురించి కొంత ముందే రాసానుగా)

2. జవాబుదారీ తనం

*నిజమే  వ్యవస్థ, సంస్థ లో జవాబుదారీ తనం రావాలంటే    వ్యక్తులలో మార్పు రావాలి.*

A. వ్యక్తి తన చర్యలకు తను జవాబుదారీ ఫీల్ అవడం

బి. వ్యక్తిగా వ్యవస్థలో జవాబుదారీ ని ప్రశ్నించడం

*మొదట A చేస్తే, B సులభం అవుతుంది...  సమస్యల్లా A ని మర్చిపోయి, B ని ప్రయత్నించడం...*

సినిమా చూసి బయటి కొచ్చిన కాసేపైనా, కనీసం రాంగ్ రూట్లో వెళ్లకూడదు అన్న సెన్సిటివిటీ లేనంతగా తయారయ్యాం... మానవులం.....మహనీయులం...

*నా అనంతరంగానికి ఈ రోజు సమయం ఇచ్చాను మరి... పాపం మీకు తప్పుదుగా.... మీ అమ్మ శ్రీనివాస్*

నువ్వు పంచే సార్వజనీనమైన ప్రేమ వల్ల ప్రపంచం మొత్తం రాత్రికి రాత్రే మారకపోవచ్చు

నువ్వు చేసే చిన్నదో, పెద్దదో సాయం వల్ల... నువ్వు పంచే  సార్వజనీనమైన ప్రేమ వల్ల ప్రపంచం మొత్తం రాత్రికి రాత్రే మారకపోవచ్చు...

కానీ... నువ్వు సాయం చేసిన వారి ప్రప్రంచంలో కొంత మార్పు వస్తుంది. వారి హృదయ ప్రప్రంచంలో నీకు కొంత స్థలం దొరుకుతుంది....

అలా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మంది హృదయాలలో చోటు సంపాదించగలిగితే, ప్రపంచమనే వసుధైక కుటుంబంలో *ప్రేమ-తద్వారా సేవ" పాళ్లు పెరిగి, జరుగుతున్న అనర్ధాలు తక్కువయ్యే అవకాశం ఎక్కువగా వుంది సుమీ...

నా అనంతరంగం... అమ్మ శ్రీనివాస్
FB : AMMAASWA
www.aswa.co.in
9948885111

పదవులు మటుకు అందరికి కావాలి... కానీ దాని వెనక భాద్యత మటుకు వద్దండోయ్....

*పదవులు మటుకు అందరికి కావాలి... కానీ దాని వెనక భాద్యత మటుకు వద్దండోయ్....*

ఇది ఏ రంగంలోనూ మంచిది కాదు, మరీ ముఖ్యంగా సేవా రంగంలో....  అలా ఉంటే మనకి సేవ అనే పదానికి అర్థం పూర్తిగా, కాదు కాదు కొంచెం కూడా తెలియదు అని నా అనంతరంగం ఎప్పటినుంచో గోల పెడుతోంది.... మీరేమంటారు..... ఎందుకంటే భాద్యత వద్దనుకున్నప్పుడు నువ్వు చేయగలిగినంత సేవ/ పని హాయిగా చేయ్యడమే. చేసే పని మీద ప్రేమ, గౌరవం ఉండాలి గాని... పదవుల మీద కాదు కదండీ... అమ్మ శ్రీనివాస్

ఇది నా గురించే కదా...ఇది వారి గురించే కదా...మంచిగా కొందరు...చెడుగా ఇంకొందరు....

ఇది నా గురించే కదా...ఇది వారి గురించే కదా...మంచిగా కొందరు...చెడుగా ఇంకొందరు.... సలహా కొందరికి....ఎత్తిపొడుపని మరికొందరికి....

ఇదీ నేను నా రాతలు పోస్ట్ చేసినప్పుడు వచ్చే అత్యుత్సాహ మెస్సేజ్ లు...

కానీ నా వరకు నేను రాసే పోస్టులన్నీ ఎప్పుడూ పలానా వ్యక్తి లేదా వ్యక్తులు లేదా ఒక సందర్భం గురించో రాయను సుమీ.... వాటి వెనుక వుండే మానసిక స్థితి గురించి కొన్ని వందల సందర్భాలు వ్యక్తిగతంగా ఎదుర్కొన్నాక... G నోట్స్ లో ఒక హెడ్డింగ్ పెట్టి వదిలేసి, ఖాళీ దొరికినప్పుడు దాన్ని విశదీకరిస్తాను... ఇదండీ సంగతి...

ఈ సందర్భంలో అలాంటి స్థితిలో ఉన్న లేదా పూర్వం ఉండిన వారు ఇది నా గురించే అని అనుకునే అవకాశం ఉంది....ఎందుకంటే ఇవి ప్రతి వ్యక్తి జీవితంలో, ఒకరి కంటే ఎక్కువ మందితో ఎదురయ్యే సందర్భాలే...

*నా ఉద్దేశ్యం ఇతరులకు ప్రేరణ కలిగించడం లేదా మనలో మనం తొంగి చూసుకోడానికి ఉపయోగపడి, తద్వారా వారి అభివృద్ధి కి, ఆనందానికి తోడ్పడే పనిముట్టు కావాలనే నా ఆశ...అనంతరంగ ఘోష.... కావున అందరూ ఆశావహ దృక్పథంతో వీటిని స్వీకరించాలని నా మనవి... ఎందుకంటే అందరిని ప్రేమించు-అందరిని సేవించు అనేది నేను నమ్మిన సిద్దాంతం... నిరాశవాదులను తాత్కాలికంగా పక్కన పెడతాను కానీ... ఎవరితోనూ బంధాలు తెంచుకోవడం నాకు ఇష్టం లేని పని సుమీ.....మీ అమ్మ శ్రీనివాస్*