*పాలు అమ్మాలంటే ఇల్లిల్లు తిరగాలి-కల్లు అమ్మాలంటే చిటికలో పని....*
సమాజం నాశనం అయిపోతోంది....చెడు విపరీతంగా పెరిగిపోతోంది..
*మంచి వారు ఎక్కువే వున్నారు-కానీ మంచి తక్కువగా ఉన్నది, నిదానంగా వ్యాపిస్తుంది..*
చెడ్డ వారు తక్కువ వున్నారు-చెడు మాత్రం విపరీతంగా, తొందరగా వ్యాపిస్తుంది...
చెడ్డ పనులకు, వార్తలకు ఎక్కువ వ్యూస్, దాని మీద అందరం విపరీతంగా చర్చ... దీనిని మరో నలుగురికి స్ప్రెడ్ చెయ్యడానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మనమే కారణం...
*ఇంకో పక్క మంచిని పాఠించడానికి, చూడడానికి, వినడానికి, నలుగురితో చెప్పడానికి, చర్చించడానికి, వ్యాప్తి చెయ్యడానికి కించిత్ కూడా కష్టపడం. కానీ మనము, మన కుటుంబం, సమాజం అంతా మన దగ్గరికి వచ్చేసరికి మంచిగా ఉండాలి??*
మనం, మన కుటుంబం మనకి అందుబాటులో ఉన్న భావవ్యక్తీకరణ, ప్రచార, ప్రసార సాధనాలను రోజులో ఎంత సేపు మంచి వ్యాప్తి కోసం వాడుతున్నాం... తెలిసి తెలీకుండా ఎంత సేపు చెడు వ్యాప్తికి వాడుతున్నాం?పెద్దలు మనకే తెలియనప్పుడు పాపం పిల్లలు ఏమి చేస్తారు, వారితో ఏర్పడబోతున్న నవ సమాజం ఎలా మంచి సమాజం అవుతుంది..చెడు వ్యాపించడానికి మనం సహకరించి, మంచి వ్యాప్తి కోసం ఏమి చెయ్యక.. మళ్ళీ మంచి సమాజం కావాలని కలలు కనడం ఏమిటో చెప్మా....
*మంచి / సేవ చేసే వారికి ప్రచారం అవసరం లేదు, ఎందుకంటే అది మనిషిగా పుట్టిన, మనిషి అని భావించే ప్రతి ఒక్కరి భాధ్యత... కాకపోతే అందరిలా సమాజంలో కొట్టుకుపోకుండా తన బాధ్యతను నిర్వర్తించే ఎవరికైనా ఆ గౌరవం ఇవ్వడం ప్రస్తుత సమాజంలో సబబే... కానీ మంచికి / సేవకి మట్టుకు తప్పకుండా ప్రచారం కావాలి, ఎప్పటిదాకా అంటే ప్రతి ఒక్క మనిషి సాటి వారికి సాయం చెయ్యడం సేవ కాదు, మన సామాజిక బాధ్యత అని లోకం గుర్తించే వరకు, పాటించే వరకు*.... ఏదో మూల సమాజం కోసం పరితపించే మంచి వ్యక్తులు కూడా ఇది గమనించాలి.....
*సమాజం గమనించాలి, సహకరించాలి. ఎందుకంటే మనం ఒక్క అడుగు కూడా వేయడానికి కదలకుండా, సమాజాన్ని పరిగెత్తమంటే ఎలా సామీ... అంటే సమాజం అంటే మనమే అనే కనీస స్పృహ కోల్పోయామా...??*
నా అనంతరంగంను ఆవిష్కరించడానికి, చర్చ ద్వారా సహకరించిన మా మిత్రులు *లక్ష్మణ్* గారికి కృతజ్ఞతలు... అమ్మ శ్రీనివాస్ 2018/05/25 17:18
http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి