1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

14, అక్టోబర్ 2017, శనివారం

ఇది మరీ విడ్డూరం సుమీ....

*మనం అందరం  ఎదో ఒక దాని కోసం అనేక విధాలుగా, అనేక రకాలుగా ప్రతి రోజు, ప్రతి క్షణం ఎవరో ఒకరి మీద ఆదారపడి బ్రతుకుతూన్నాం....ఇదే సమాజం అనే పదానికి నిజమైన అర్ధం కూడాను....*

మనలో చాలా మందికి (నాతో కలిపి) తీసుకోవడం బాగా తెలుసు అప్పుడు మన ఇబ్బందులే తప్ప, సహాయం పొందడానికి  ఇంకేమి అడ్డురావు. కానీ మనం ఏదైనా సాయం చెయ్యవలసి వచ్చినప్పుడు, ఇవ్వవలసి వచ్చినప్పుడు వ్యక్తిగత జీవితం, ఉద్యోగం ఇలా ఎన్నో గుర్తొస్తాయి, అడ్డుపడతాయి. మన పరిధిలో మనం చేయగలిగినా కూడా మనల్ని మనం సమర్ధించుకొంటూ చెయ్యకుండా దాటేస్తాం.

*మనం ఉద్యోగం చెయ్యడం లేదా సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం, వారి బాగోగులు చూసుకోవడం ఎలా బాధ్యతగా భావిస్తామో.....సాటి వారికి / సమాజానికి వీలైనంత సాయం చెయ్యడం మన బాధ్యతే....అదేదో మనం ప్రపంచానికి, సమాజం కోసం చేస్తున్న గొప్ప సేవ అని మరీ ఫీల్ అయిపోయి, నాకు సమయం ఉండడం లేదు, ఇది నా జీవితంలో అంత ప్రాధాన్యత కాదు అని ఆలోచించడం మానేసి.... మనం మన రోజు వారీ జీవితంలో ఖచ్చితంగా సమయం కుదుర్చుకొని చెయ్యవలసిన ఒక ముఖ్యమైన, ప్రాధాన్యత గల బాధ్యతే.*

ఇందులో ఆర్ధిక సాయం చెయ్యడమా,  నేరుగా వారిని కలిసి మానసిక స్థైర్యం నింపడమా, కాసేపు ప్రేరణ కలిగించడమా, అలా చేస్తూన్న వారికి మన సహకారం అందించడమా…... ఇది మీ ఇష్టం.....

అసలు ఏది కుదరదు అని చెప్పడానికి, నేను నా కుటుంబం అని,  అంతులేని లేని కోరికలతో, తృప్తి లేని జీవితాన్ని అడ్డం పెట్టుకొని, ఏది చెయ్యకుండా కూర్చోవడం మహా పాపం సుమీ.....మనకి మనం సర్దిచెప్పుకోడానికి మన దగ్గర ఎన్నో కుంటి సాకులు ఎప్పుడూ సిద్ధమే అనుకోండి.

*చెయ్యాలనే తపన ఉంటే వయసుతో, అంతస్తుతో, సామర్థ్యంతో, హోదాతో సంభందం లేకుండా చేసే ఎన్నో రకాల సహాయాలు సిద్ధంగా ఉన్నాయి మిత్రమా.....ఆలోచించు... అడుగెయ్యి...*

నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్
2017/10/14 19:06

9, అక్టోబర్ 2017, సోమవారం

గత 2-3 ఏళ్లలో నా జీవితంలో జరిగిన మంచి మార్పులు


1. "ప్రజల సేవలో నా జీవితం" అనే నా ఆశయాన్ని గౌరవించి, నాతో కలిసి జీవితాన్ని పంచుకొనే అర్ధాంగి దొరకడం. Haritha Vemulapalli

2. మీకు నేను తోడున్నాను అంటూ ఒక బుడ్డి వాలంటీర్ మాకు కలగడం.

3. నా ప్రవృత్తిని వృత్తి మార్చుకొనే అద్భుత అవకాశం ఏకలవ్య ఫౌండేషన్ లో ఉద్యోగం చెరడం..., ప్రజలతో కలసి..ప్రజలలోకి వెళ్లి.. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రంలో పరోక్షంగా నైనా రైతులతో కలసి పని చేసే అద్భుత ఆకాశం మాత్రమే కాకుండా ఏన్నో అభివృద్ధి కార్యక్రమాలలో పాలుపంచుకొనే మంచి అవకాశం. దీనికి నన్ను సూచించిన ప్రసాద్ టెంటు Prasad Tentu, నన్ను ఎంపిక చేసిన వేణుజి Venugopal Reddy Peramareddy, నాకు ప్రతి క్షణం సహకారం అందిస్తున్న మల్లిక్ Mallik Vangaగారు...

అసలు కార్పొరేట్ ఉద్యోగాలు వదులుకొని, ఉన్న ఫలంగా ఊరు వదలి వెళ్లాలనే మేము తీసుకోవాలన్న సాహసోపేత నిర్ణయానికి "నెనున్నాను అని ప్రేరేపించిన మా సుందరం మాస్టర్ Sundar Raj Perumall" ప్రేరణ, ఎప్పుడు నన్ను ప్రోత్సహించే మా అమ్మ...

అలాగే నా చేతిలో పురుడుపోసుకొని, 9 ఏళ్లగా నా శ్వాసగా సాగిపోతున్న అమ్మ స్వచ్ఛంద సేవా సమితి (www.aswa.co.in) ని, నీకేమి భయం లేదు... నువ్వు ప్రత్యక్షంగా లేకపోయినా నడిపే అనుభవాన్ని, నమ్మకాన్ని నువ్వు ఇచ్చావు అని ముందుకొచ్చి బాధ్యత తీసుకున్న మా అశ్వ సభ్యులు...

కొత్త ఊరిలో ప్రతి పనిలో చేతనైనంత సాయం చేస్తున్న రాయలసీమ వాసులు ఆలాగే  ఇతర NGO ఫ్రెండ్స్, నా బంధువులు, ఏకలవ్య ఉద్యోగ సహచరులు...

అబ్బో .... ఇలా ఒకటేమిటి ఎన్నో ఎన్నేనో ఆనందాల, ప్రేరణ ల సమాహారం....వీరందరికి ఎంతో రుణపడి ఉన్నట్టే....

ఏ పనైనా సరిగా చెయ్యడానికి లేదా చెయ్యకపోవడానికి రెండే కారణాలు


నీకైనా, నాకైనా, ప్రపంచంలో ఎవ్వరికైనా.... *ఏదైనా పని తీసుకోవాలన్నా లేదా తీసుకున్న పని సరిగా చెయ్యడానికి లేదా సరిగా చెయ్యకపోవడానికి రెండే కారణాలు 1. ఇష్టం (PASSION) 2. ప్రాధాన్యత (PRIORITY)....*


నీకు ఒక పని మీద పై 2 ఎంత పాళ్ళలో వున్నాయో ఎవరు చెప్పనక్కర లేదు... నీ పనే చెప్తుంది....*ఎంత శాతం పని చేసావో, ఎంత సకాలంలో చేసావో.... అంత శాతం మాత్రమె ఆ పని మీద నీకు ఇష్టం, ప్రాదాన్యత వున్నాయి అన్నది సులభంగా అందరికి అర్ధమయ్యే విషయం. అది 1% కావచ్చు 50% కావచ్చు లేదా 99% కావచ్చు.


సర్దిచెప్పుకోవడానికి మొదట్లో మనం ఎన్నో కారణాలు చెప్తాం, అదే రాను రాను పని చెయ్యకుండా, ఒక్క కారణాలు మాత్రమే చెప్పే స్తాయికి మనల్ని తీసుకెళ్తుంది. *కాబట్టి కారణాలు చెప్తూ పోదామా, మనల్ని మనం మార్చుకొందామా, అభివృద్ధి పధం లోకి వెళ్దామా లేదా ఇలానే వుందామా అనేది ఎవరికి వారు ప్రశ్నించుకొని, స్వయంగా తీసుకోవాల్సిన నిర్ణయం*



నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్
2017/10/09 23:37

http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

1, అక్టోబర్ 2017, ఆదివారం

ఎదగలేం...ఎదగలేం...

*ఏ పనిలో నైనా నిరంతరము అభివృద్ధి సాధిస్తూ ఉండాలంటే....ఎదగాలంటే......*

ఎదగలేం...ఎదగలేం... వాయిదాలు వేసి
ఎదగలేం...ఎదగలేం... సగం సగం చేసి

ఎదగలేం...ఎప్పుడైన... త్యాగాలే చెయ్యక
ఎదగలేం...ఎప్పుడైన.... సమస్యలే ఎదురవక

ఎదగలేం...ఎక్కడైన... ప్రణాళికే లేక
ఎదగలేం...ఎక్కడైన... శ్రమ అసలే చేయక

ఎదగలేం...ఎందుకంటే... సంకల్పం లేక
ఎదగలేం...ఎందుకంటే... నిరంతరము సేయక

ఎదగలేం...ఎప్పటికీ... నిన్ను మార్చుకోక
ఎదగలేం...ఎప్పటికీ... నువ్వు నేర్చుకోక

ఎదగలేం...ఎన్నటికీ... పట్టుదలే లేక
ఎదగలేం...ఎన్నటికీ... బద్దకాన్ని వదలక

ఎదగలేం...ఏదైనా... పరిశీలన చేయక
ఎదగలేం...ఏదైనా... పరీక్షగా చూడక

ఎదగలేం...ఎందైనా... ఆనందం చూడక
ఎదగలేం...ఎందైనా... తృప్తి నీవు పొందక

ఎదగలేం...ఎదగలేం... ఆలోచన చేయక
ఎదగలేం...ఎదగలేం... సామర్థ్యం తెలియక

కాబట్టి ఏదైనా సాధించడానికి తపన, ఇష్టం, సంకల్పం, నమ్మకం, పట్టుదల, ధైర్యం, స్టైర్యం, పోరాడే తత్వం, నేర్చుకొనే నైజం ఇలా ఎన్నో కావాలి.... కాబట్టి మనల్ని మనం ప్రతి క్షణం మలచుకోవాలి....

నా అనంతరంగం.. అమ్మ శ్రీనివాస్ 2017/10/01 12:36
http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0