1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

26, ఫిబ్రవరి 2018, సోమవారం

వ్యవస్థల్లో వ్యక్తులు తరచూ మరచిపోయే విషయం....

*వ్యవస్థల్లో వ్యక్తులు తరచూ మరచిపోయే విషయం....* వ్యవస్థలో వ్యక్తులు కొంచెం ఇబ్బంది పడ్డా (అది కూడా  వ్యక్తిగతంగా కాక, సంస్థాగతంగా ఆలోచించి, అర్దం చేసుకునే పరిపక్వత లేకపోవడం వల్లనే వస్తుంది) పర్వాలేదు కానీ, వ్యవస్థకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి

*ఎందుకంటే ఈ వ్యక్తి పోతే, మరో వ్యక్తి వస్తాడు... కానీ వ్యవస్థ పోతే దాని కోసం తన సర్వస్వం పణంగా పెట్టి, రాయి రాయి కూడగట్టి, నిర్మించడం, దానిని ముందుకు తీసుకెళ్లే దమున్న నాయకుడు దొరకడం చాలా కష్టం...*

వ్యక్తి ముఖ్యమా, వ్యవస్థ ముఖ్యమా అంటే ...వ్యక్తులు లేని వ్యవస్థలు ఉండవు, లేవు...కానీ ఎంతోమంది నిర్మించిన వ్యవస్థకు భంగం కలిగించే ఎవరైనా వ్యవస్థకు భారమే, కాబట్టి వారిని అక్కడ వదిలెయ్యడమే మంచిది, ఎందుకంటే వీరు చేసిన / చేస్తున్న సాయం కంటే, వీరి కారణంగా నెలకొన్న వాతావరణాన్ని సరిచేసుకోవడానికి సంస్థ ప్రత్యేక దృష్టి సారించాలి. కాబట్టి వ్యవస్థల్లో వ్యక్తులు, ఆ వ్యవస్థను అర్ధంచేసుకోని, గౌరవించే మానసిక పరిపక్వత కలిగేవుండడం చాలా ముఖ్యం.... ఇదే ఈ సమస్యకు పరిష్కారం..

నా అనంతరంగం
అమ్మ శ్రీనివాస్
2018/02/26 09:41

9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

రైతుల పాలిట కల్ప వృక్షం – వేస్ట్ డికంపోసర్


నమస్కారం,

రైతులు యూరియా, పోటాష్, DAP కి బదులుగా 20/- మాత్రమే విలువైన దీనిని (మదర్ కల్చర్ / వేస్ట్ డికంపోజర్) ను వాడండి వేల రూపాయలు ఆదా చేసుకోండి. ఇది అన్ని రకాల పంటల ఎదుగుదలకు, పురుగులు, తెగుళ్లు నివారణకు ఉపయోగపడుతుంది.

వేస్ట్ డీకంపోసర్ గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్న మిత్రుల కోసం! వాడడం మొదలు పెడితే మీకే తెలుస్తుంది. ఇక శాస్త్రీయత అంటారా! ఘజియాబాద్ యూనివర్సిటీ సైంటిస్ట్స్ విడుదలచేసిన వీడియోలలో స్పష్టంగా చెప్పడం జరిగింది, దేశవాళీ ఆవు పేడనుంచి సేకరించబడిన బాక్టీరియా అని. వారిచ్చిన document లో ఫోన్ నంబర్లు ఉన్నాయి. సంప్రదించొచ్చు. ఇందులో మాఫియాకు అవకాశం ఎక్కడిది.

కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతులకు అందిస్తోంది. నేను కొన్ని వేలమందికి పంచగలిగా. స్వయంగా దాదాపు 100 ఎకరాల్లో వాడుతున్నాను. జీవామృతం తయారు చేసుకోలేని రైతులకు ఇది వరం లాంటిది. కేవలం 20 రూపాయల ఖర్చుతో ఒక ఊరిలో ఉన్న రైతాంగాన్ని మొత్తంగా రసాయనిక ఎరువులు మాన్పించగల అద్భుత అస్త్రాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది ఎరువుల వాడకం తగ్గినపుడు పురుగు మందులు అవసరం సహజంగానే 80% వరకు తగ్గుతుంది అని నా అభిప్రాయం. ముఖ్యంగా ముల్చింగ్ మరియు మిశ్రమ పంటల పై అవగాహన పెంచుకోగలిగితే పూర్తిగా ప్రకృతి వ్యవసాయం లో పట్టుసాధించ వచ్చు అని అంటున్నారు శ్రీ రాంబాబు గారు.

ఈ ద్రావణం ఒక సారి తెచ్చుకుంటే, కొన్ని సంవత్సరాల వరకు పాలలో పెరుగు (చేమిరి) తోడేసినట్టు మనమే సులభంగా తయరు చేసుకోవచ్చును.

చాలా మంది దీని గురించి తెలుసుకొని తీసుకెళ్తున్నారు, కానీ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు వారి కోసమే ఈ పోస్ట్. 


ఉపయోగాలు (Telugu & English)
https://drive.google.com/open?id=18MzJw2vG5Z8peYVfvLFJL0tfYgw_hkkX

https://drive.google.com/open?id=1hsXJKjSdBDztbDkC3n9dmwp04IEqDgmd


YouTube Videos







ఇందులో నా పాత్ర సేకరించి అందించడమే సుమీ.....

అమ్మ శ్రీనివాస్
9948885111
http://ammasocialwelfareassociation.blogspot.in/