1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

1, మే 2018, మంగళవారం

ఇది నా గురించే కదా...ఇది వారి గురించే కదా...మంచిగా కొందరు...చెడుగా ఇంకొందరు....

ఇది నా గురించే కదా...ఇది వారి గురించే కదా...మంచిగా కొందరు...చెడుగా ఇంకొందరు.... సలహా కొందరికి....ఎత్తిపొడుపని మరికొందరికి....

ఇదీ నేను నా రాతలు పోస్ట్ చేసినప్పుడు వచ్చే అత్యుత్సాహ మెస్సేజ్ లు...

కానీ నా వరకు నేను రాసే పోస్టులన్నీ ఎప్పుడూ పలానా వ్యక్తి లేదా వ్యక్తులు లేదా ఒక సందర్భం గురించో రాయను సుమీ.... వాటి వెనుక వుండే మానసిక స్థితి గురించి కొన్ని వందల సందర్భాలు వ్యక్తిగతంగా ఎదుర్కొన్నాక... G నోట్స్ లో ఒక హెడ్డింగ్ పెట్టి వదిలేసి, ఖాళీ దొరికినప్పుడు దాన్ని విశదీకరిస్తాను... ఇదండీ సంగతి...

ఈ సందర్భంలో అలాంటి స్థితిలో ఉన్న లేదా పూర్వం ఉండిన వారు ఇది నా గురించే అని అనుకునే అవకాశం ఉంది....ఎందుకంటే ఇవి ప్రతి వ్యక్తి జీవితంలో, ఒకరి కంటే ఎక్కువ మందితో ఎదురయ్యే సందర్భాలే...

*నా ఉద్దేశ్యం ఇతరులకు ప్రేరణ కలిగించడం లేదా మనలో మనం తొంగి చూసుకోడానికి ఉపయోగపడి, తద్వారా వారి అభివృద్ధి కి, ఆనందానికి తోడ్పడే పనిముట్టు కావాలనే నా ఆశ...అనంతరంగ ఘోష.... కావున అందరూ ఆశావహ దృక్పథంతో వీటిని స్వీకరించాలని నా మనవి... ఎందుకంటే అందరిని ప్రేమించు-అందరిని సేవించు అనేది నేను నమ్మిన సిద్దాంతం... నిరాశవాదులను తాత్కాలికంగా పక్కన పెడతాను కానీ... ఎవరితోనూ బంధాలు తెంచుకోవడం నాకు ఇష్టం లేని పని సుమీ.....మీ అమ్మ శ్రీనివాస్*

కామెంట్‌లు లేవు: