భాధ్యత తీసుకొనే వారు :
ఈ కోవలోకి వచ్చే వారికి పని/భాద్యత ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎప్పుడిచ్చారు లాంటి వాటి మీద ఫోకస్ చాల తక్కువ వుంటుంది. వీరికి ఎన్ని పనులున్న, ఎంత బిజీ గ వున్నా, సహాయ సహకారాలు అందిన, అందకపోయినా, ఆ పని చేసే సామర్ద్యం వున్నా, లేకపోయినా...ఎలాగైనా సరే.... తీసుకున్న పని పూర్తి చెయ్యడమే వీరి లక్ష్యం. వీరిలో 1. అలోచించి అవసరమైన మార్పులు చేసుకుంటు పని పూర్తి చేసే వారు 2. చెప్పింది చెప్పినట్టు చేసే వారు అని రెండు రకాలుగా విభజించవచ్చు. 1, 2 లలో ఏ కోవలో వున్నా, వీరు సంస్థలోనైనా, సమాజంలో నైనా, ముఖ్యులుగా, మూల స్తంభాలు తయారవుతారు. అందరూ 2లో ప్రయాణం మొదలెట్టి తన మీద/సంస్థ మీద/సమాజం మీద అవగాహన పెరిగి, ఇన్వాల్వ్ అయ్యే కొద్ది 1 లో చేరుతారు. వీరు ఎక్కడైనా అవకాశాలు సృష్టించుకోగలరు, అవసరమైన సామర్ధ్యాలు తెచ్చుకోగలరు. సమాజం లో ఆశావహ దృక్పథం, ప్రేరణ, సహృద్భావ వాతావరణానికి వీరే కారణం.
భాధ్యత నుంచి తప్పించుకోనేవారు:
వీరు వ్యక్తిగత జీవితంలో, ఏదైనా సంస్థలో, సమాజంలో లేదా ఎక్కడైనా.... ఏ స్తాయిలో వున్నా,వీరి చుట్టూ ఎన్ని వనరులు వున్నా, వీరికి ఎన్ని సామర్ధ్యాలు వున్నా. వీరి చుట్టూ ఎన్ని అవకాశాలు వున్నా...సరిగా ఇన్వాల్వ్ అవ్వకుండా... వారి మీద, వీరి మీద, అది లేదు, ఇది లేదు, అది కావలి, ఇది కావలి అని రకరకాల కుంటి సాకులు చెప్తూ.... పని జరగకపోవడానికి కారణం నేను కాదు అని సొంత డబ్బాలు చెప్పుకుంటూ, ఎవరో ఒకరి మీదో/సమాజం మీదో బురద జల్లి తప్పించుకొనే ప్రయత్నం చేస్తూవుంటారు. వీరిలో మరో రకం మాటలు చెప్తూ, అర చేతిలో స్వర్గం చూపిస్తూ, ఊహించుకుంటూ వుంటారు. సమాజం లో నిరాశ, నిష్ప్రుహలకు వీరే మూలకారణం, మూలాధారం
కనీస అవగాహన లేని వారు కూడా కొన్ని రోజుల పరిచయంలోనే అవతలి వారు భాధ్యత తీసుకొనేవారా లేదా తప్పించుకొనేవారా అని సులభంగా గుర్తు పట్టేస్తారు.
మనలో ఎక్కువమంది విజయం సాధించక పోవడానికి భాద్యత తీసుకోకుండా, తప్పించుకొనే ప్రయత్నమే కారణం అని నా అనంతరంగం చెప్తోందండోయ్...
నిజమేనంటారా... మీరే చెప్పాలి అవునో...కాదో...
నా అనంతరంగం ... అమ్మ శ్రీనివాస్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి