1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

13, ఏప్రిల్ 2018, శుక్రవారం

7 నెలలు- ఎదో గిల్టీ ఫీలింగ్


అశ్వా లో ఆక్టీవ్ మెంబర్స్ అందరికి బాంక్ లోన్ లేదా ఇంటరెస్ట్ కట్టినట్టు 3 నెలలు కాగానే రక్త దానం చేయడం అలవాటు.

గత 7-8 ఏళ్ల నుంచి నాకు అంతే. అనారోగ్య కారణాల వలన ఒక సారి దాదాపు 6 నెలలు ఇవ్వలేదు. *మరల ఇప్పుడు ఇవ్వగలిగి ఉండి కూడా రక్తం ఇవ్వకుండా 4 నెలలు (మొత్తంగా 7 నెలలు) అయ్యింది. ఎదో గిల్టీ ఫీలింగ్. ప్రకృతి ప్రాణ దానం చేసే అవకాశం మనకి ఇచ్చినపుడు, మనం ఇలా చెయ్యడం తప్పు కదండీ*

నా 39వ రక్త దానం 17.09.2017 జరిగింది, మళ్ళీ మా కాంప్ జనవరిలో జరిగింది అది మిస్ అయ్యా.... అశ్వా 30వ బ్లడ్ కాంప్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ.....

మేము జనరల్ గా బయట రక్త దానం చాలా తక్కువ చేస్తాం, ఎందుకంటే ప్రతి 3 నెలలకు థలాసీమియా పిల్లల కోసం ఇస్తాం కాబట్టి...... 2011 నుంచి 2016-17 దాకా థలసెమియా కి రక్త దాన శిబిరాలు చాలా తక్కువగా వచ్చేవి. ఇప్పుడు కొంత అవగాహన పెరిగింది అనుకోండి. మేము కూడా వాట్సాప్ గ్రూప్ ల ద్వారా రోజు 10-15 రిక్వెస్ట్ లు వస్తున్నాయి, కాబట్టి మేము కూడా బయట అత్యవసర కేసులకు ఇవ్వడం బాగా పెరిగింది.

నాయనా అనిల్ & మహేష్ .... ఎండాకాలం, వారికి రక్తం ఎంత అవసరమో తెలుసుగా... తొందరగా కాంప్ కండక్ట్ కరో.....

మీ అమ్మ శ్రీనివాస్
www.aswa.co.in

కామెంట్‌లు లేవు: