1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

31, మే 2018, గురువారం

అంతర్యామి అలసితి, సొలసితి... అంతట నీ శరనిదే జొచ్చితిని....

*అమ్మ శ్రీనివాస్*: అంతర్యామి అలసితి, సొలసితి... అంతట నీ శరనిదే జొచ్చితిని....

*చెప్పు చెకుముకి, అంటూ దేవుడు దర్శనమిచ్చారు*

*అమ్మ శ్రీనివాస్:* స్వామీ, మీకోసం...నేనొక కీర్తన రాసాను

*దేవుడు:* వద్దులే నాయనా కొంపదీసి చుట్టూ పక్కల చూడరా చిన్నికృష్ణ అంటావా.... లేక కీర్తనలో కూడా నన్నొక గంట సమయమో, రక్త దానమో, తలసీమియా పిల్లలకు అమృత  భాండమో, రోగులకు నా పుష్ప పల్లకినో, విద్యార్థులకు జీవన విద్యను కథలు, కీర్తన రూపంలో చెప్పమనో, మేడం లక్ష్మీ ని అడిగి ఆర్ధిక సాయమో, ఏమి కుదరకపోతే వైకుంఠంలో కూర్చొని డేటా లేక ఈవెంట్ రికార్డర్ అప్డేట్, డాక్యుమెంటేషన్ చెయ్యమని అడుగుతావేమో... నీ మేటర్ మా దాకా చేరింది బాబు.. మేమూ జియో ఫోన్ వల్ల అప్ టు డేట్ గా ఉన్నాం..

*అమ్మ శ్రీనివాస్:* కాదు స్వామి పనిని ప్రేమించి, ఇష్టంగా స్వీకరించి, భాద్యత తీసుకుని సామర్థ్యం వున్న వారు లేదా పెంచుకునే ఆలోచనవున్న కనీసం ముగ్గురు కత్తి లాంటి వాలంటీర్ లని ఇవ్వు... వారు తీసుకున్న పనిలోకి పరకాయ ప్రవేశం చేస్తే చాలు... ఇంకా ఎన్నో పనులు చెయ్యాలనే తపనతో తహ తహ లాడుతున్న గురువు గారు

*దేవుడు మనసులో:*  ఓరి... ఈడీ ఆశ ... 10 ఏళ్లకే... అయినా ఇక్కడ క్యూ చాలా పెద్దది ఉంది మాస్టారు...  నిబద్ధత కలిగిన వారు లేక ఇక్కడే మేము ఔట్ సోర్సింగ్ ఇచ్చి కూర్చొని ఉంటే... నీ నస ఏంటి బాబు... *ఓహో నీకు ఉచితంగా, బాధ్యతగా, ప్రేమగా, ఇష్టంగా చేసే వారు కావాలి కదూ.....*

*అమ్మ శ్రీనివాస్:* పెద్ద పనికి అవకాశాలు సమకూరుస్తున్నావు అదే సామీ డ్రీమ్ ప్రాజెక్ట్. బాగా చేసే వారిని చూపిస్తే వారికి ఈ పని అప్పగించాలి మహా ప్రభు.... నాకు తెలిసినంతలో నేను నేర్చుకున్నది పంచుకోవడం ద్వారా సంపూర్ణంగా తయారుచేసే సామర్థ్యం కొద్దో, గొప్పో నాకు ఉంది.

ఎందుకంటే ఎక్కువ మందికి పావో, సగమో, ముప్పావో చేసే ప్రేరణ ఉంటోంది, కానీ సంపూర్ణంగా చెయ్యాలనే ఆలోచన, తద్వారా మనల్ని మనం సంపూర్ణంగా తయారుచేసుకొనే ఆశక్తి వుండే వారే కనుమరుగాయే. *డబ్బు ఏదో విధంగా సమకూర్చగలం, కానీ మంచి పని కోసం, ప్రాణం పెట్టె మనుషులను పూర్తిగా కనపడకుండా చేస్తున్నావేంటి దర్శక రత్న.....

*భక్తా శ్రీనివాసా.....* ఎదో ఒక గంట ఇవ్వడమే గొప్ప విషయం అనుకుంటుంటే, నువ్వేంటి బాబు సంపూర్ణ రామాయణం, సంపూర్ణేష్ బాబు అనుకుంటూ....ఆశ, దోశ, అప్పడం, వడేమి కాదు.....

*నేనొక నిజం చెపుతా విను ప్రసాదు..* ఎంచుకున్న పని మీద నిబద్ధత, ఇష్టం, పనే జీవితం, పనే వృత్తి గా గడిపే వారు తక్కువ..   కాదు కాదు అరుదుగా వుంటారు. అది పూర్వ జన్మ సుకృతమేమి కాదు... దేవునికి దగ్గరగా చేరడానికి మనిషి ఎంచుకున్న సర్వోత్తమమైన మరో దారి (మానవ సేవయే మాధవ సేవ అనే నా మాటలు అర్ధం చేసుకోగలిగితే)... ఆవేశ పడి, అతిగా ఆలోచించి, ఆరోగ్యం పాడుచేసుకోక, 3 గంటలు కావస్తోంది బబ్బో.... మళ్ళీ కాసపటికి నాకు సుప్రభాత సేవ మొదలవుద్ది...

*స్వామీ.....ఎక్కడ*

*భయపడకు....వెళ్లిపోలేదులే* అగాధమౌ జలనిధిలోనే ఆణిముత్యమున్నటులే, కష్టాల మాటున కూడా సుఖమున్నదిలే.... దృఢ సంకల్పం ఉంటే ఎదైనా సాధించవచ్చు చెవుతుంటావుగా నువ్వు.... వెతుకుడి.... దొరుకుడు.

*సర్లే సామీ ఏమి చేద్దాం....* ప్రయత్నమే నాది, ఫలితం గురించి పెద్ద పరేషాన్ లేదు... ధోని సెపుతుంటాడులే... అవునయ్యా... నీ కర్మ సిద్దాంతమే, లేటెస్ట్ వెర్షన్....


నా అనంతరంగం దేవునితో సంభాషణ.... ఏదో నా రాతలు.... ఎవరినీ ఉద్దేశించినవి కావు... తప్పులేమన్న ఉంటే అన్యధా భవించక, తిట్టుకోక, నాకు తెలియజేయ ప్రార్ధన....అమ్మ శ్రీనివాస్ 2018/05/31 02:09 

కామెంట్‌లు లేవు: