నేను ఈ మధ్య చూసిన సినిమాలలో రెండు డవులాగులు నన్ను బాగా ఆకర్షించాయి....
1. భాద్యత, భయం (దీనిగురించి కొంత ముందే రాసానుగా)
2. జవాబుదారీ తనం
*నిజమే వ్యవస్థ, సంస్థ లో జవాబుదారీ తనం రావాలంటే వ్యక్తులలో మార్పు రావాలి.*
A. వ్యక్తి తన చర్యలకు తను జవాబుదారీ ఫీల్ అవడం
బి. వ్యక్తిగా వ్యవస్థలో జవాబుదారీ ని ప్రశ్నించడం
*మొదట A చేస్తే, B సులభం అవుతుంది... సమస్యల్లా A ని మర్చిపోయి, B ని ప్రయత్నించడం...*
సినిమా చూసి బయటి కొచ్చిన కాసేపైనా, కనీసం రాంగ్ రూట్లో వెళ్లకూడదు అన్న సెన్సిటివిటీ లేనంతగా తయారయ్యాం... మానవులం.....మహనీయులం...
*నా అనంతరంగానికి ఈ రోజు సమయం ఇచ్చాను మరి... పాపం మీకు తప్పుదుగా.... మీ అమ్మ శ్రీనివాస్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి