నేనే కాదు...మనం అందరం బుక్స్ కొంటాం.... కానీ ఎన్ని చదువుతాం, ఎలా చదువుతాం లాంటి ఎన్నో ప్రశ్నలను పక్కన పెడితే, అసలు ఎలా భద్రపరుస్తాం అనేది మరో ముఖ్య ప్రశ్న? .... అసలు కొంటూ ఉండడం వల్ల మన దగ్గర ఏమి బుక్స్ ఉన్నాయో కూడా మనకు తెలీదు... కారణం భద్రంగా లోపల దాచిపెట్టడం వలన... దీనికి తోడు పాడైపోతాయేమో? అనే ఒక భావన... పుస్తకం తెచ్చుకొంది చదవడానికే కదా? మాసిపోకుండా దాచుకోవడానికా?..
నేనూ చదవాలి, రోజూ చదవాలి, అన్ని పుస్తకాలు చదివేయాలి, నాతో వుండే వాళ్లకి కొన్నాళ్ళకైనా ఎదో ఒక బుక్ చదవాలి అనిపించాలి... అందుకు ఏవేమి ఉన్నాయో అందరికి తెలియాలి..
ఇల్లు అలంకరణలో మనకు ఉపయోగపడనివి అన్ని అందరి మెప్పు కోసం ఉంచుతాం ? కానీ మన జీవితాల్ని ప్రభావితం చేసే వాటిని మనకీ, మన ఇంట్లో అందరికి, నలుగురికీ తెలిసే విధంగా, కనపడే విధంగా పెట్టుకోవాలి కదా సుమీ, ఎందుకు సంకోచం.... అందుకే యుద్ధ ప్రాతిపదికన ఇది నిన్న కొని, ఈ రోజు మొత్తం సర్దుకున్నా...మనసుకు ఎంతో హాయిగా ఉంది.
మా అమ్మ, మా చరిత, మా చరణ్ అప్పుడప్పుడు చదివినా నా పంట పండినట్టే....నాతో, మా ఆవిడతో పాటు..గా...
ఆర్డర్లో పెట్టాను....అప్పుడే అర్ధమైంది ఇంకా కథల పుస్తకాలు చాలానే కొనాలని...
ఇది.... ఈ రోజు నేను, నా పుస్తకం కథ...
2017/11/05 22:40
నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్
http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0