*వ్యవస్థల్లో వ్యక్తులు తరచూ మరచిపోయే విషయం....* వ్యవస్థలో వ్యక్తులు కొంచెం ఇబ్బంది పడ్డా (అది కూడా వ్యక్తిగతంగా కాక, సంస్థాగతంగా ఆలోచించి, అర్దం చేసుకునే పరిపక్వత లేకపోవడం వల్లనే వస్తుంది) పర్వాలేదు కానీ, వ్యవస్థకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి
*ఎందుకంటే ఈ వ్యక్తి పోతే, మరో వ్యక్తి వస్తాడు... కానీ వ్యవస్థ పోతే దాని కోసం తన సర్వస్వం పణంగా పెట్టి, రాయి రాయి కూడగట్టి, నిర్మించడం, దానిని ముందుకు తీసుకెళ్లే దమున్న నాయకుడు దొరకడం చాలా కష్టం...*
వ్యక్తి ముఖ్యమా, వ్యవస్థ ముఖ్యమా అంటే ...వ్యక్తులు లేని వ్యవస్థలు ఉండవు, లేవు...కానీ ఎంతోమంది నిర్మించిన వ్యవస్థకు భంగం కలిగించే ఎవరైనా వ్యవస్థకు భారమే, కాబట్టి వారిని అక్కడ వదిలెయ్యడమే మంచిది, ఎందుకంటే వీరు చేసిన / చేస్తున్న సాయం కంటే, వీరి కారణంగా నెలకొన్న వాతావరణాన్ని సరిచేసుకోవడానికి సంస్థ ప్రత్యేక దృష్టి సారించాలి. కాబట్టి వ్యవస్థల్లో వ్యక్తులు, ఆ వ్యవస్థను అర్ధంచేసుకోని, గౌరవించే మానసిక పరిపక్వత కలిగేవుండడం చాలా ముఖ్యం.... ఇదే ఈ సమస్యకు పరిష్కారం..
నా అనంతరంగం
అమ్మ శ్రీనివాస్
2018/02/26 09:41