1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

12, మార్చి 2018, సోమవారం

మా తరం, మారని ఈ తరం.... ఏమైపోతామో తెలియని కలవరం...

ఒకప్పుడు దాహం అయినప్పుడు బావి తవ్వినట్టు అనే సామెత ఉండేది..ఎండాకాలం కదా! నీళ్లు రావు కాబట్టి అవి గుర్తొస్తాయి.. వానాకాలం అవసరం లేదు కాబట్టి, వృధాగా పోతున్నా పట్టించుకొము...ఇప్పుడు ప్రాణం పోయేటప్పుడు కూడా నీరు దొరకని స్థితికి వచ్చేసాం.....

అయినా అందరం నా..లాగే నాలుగు మాటలు చెప్పే వాళ్లే కానీ, నీరు ఆ..దా చెయ్యడానికి వళ్ళోంచి ఒక చిన్న పని కూడా చెయ్యం...

బద్దకం, స్వార్ధం, స్పందించని గుణం, చూస్తూ ఊరుకోవడం అనే లక్షణాలు మనం నాశనం అయిపోతున్నా... మార్చుకోమ్... సహజ వనరులు కనుమరుగయ్యి, ప్రకృతి ప్రళయ తాండవం చేసే వరకు మనలో మార్పు రాదేమో...

ఇదీ...మా తరం, మారని ఈ తరం.... ఏమైపోతామో తెలియని కలవరం...

హృదయలోతుల్లోంచి, జీవిత అనుభవాల్లోంచి...మదిలో మెదిలే భావాల సంపుటి....నా అంతంలేని ఆలోచనల తరంగం....అదే....*నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్...*  2018/03/12 19:20

http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

5, మార్చి 2018, సోమవారం

ఈ రోజే మరో అడుగు... జీవితంలో మరో మలుపు...

జీవితం అనే చదువులో..

సేవ అనే తరగతిలో..

మరొక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టే పనిలో గత కొన్ని నెలలుగా చేస్తున్న ప్రయోగాలు ఊపందుకున్నాయి..

ఈ రోజే మరో అడుగు... జీవితంలో మరో మలుపు...అశ్వా కలల ప్రాజెక్ట్ కోసం...

మరిన్ని వివరాల కోసం మరో 3 నెలలు మీకు, నాకు ఇద్దరికీ నిరీక్షణ తప్పదు....

ఇలాంటి ప్రయోగాలు జీవితాన్ని ఎటు తీసుకెళ్తాయో తెలీదు.... మంచి వైపే, మార్పు కోసం అడుగులు అనే సత్సంకల్పం తప్ప.

దీనికి అన్ని విధాలుగా సహకరిస్తున్న మా కుటుంబం... ఫలితం ఏదైనా మీకు అండగా మేమున్నాము అనే మిత్ర బృందమే.. మా ప్రయోగాలకు ఆధారం....

అమ్మ శ్రీనివాస్
  2018/03/05 23:04

ఇదో రకం దుర్వ్యసనం

చాలా మంది విషయం తెలుసుకోకుండా, వివరాలలోకి వెళ్లకుండా, సందర్భాన్ని అనుసరించకుండా, మన మాటల ప్రభావం చుట్టూ వున్న వారిపై ఎలా ఉంటుందో ఆలోచించకుండా, వారికిచ్చిన గౌరవాన్ని, స్వేచ్ఛను కాలదన్నుకొనే విధంగా.... ఏదంటే అది, ఇష్టం / నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తుంటారు... పైగా మొండిగా, మూర్ఖంగా తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటారు. వారు చెప్పేది ఒక్కోసారి మంచికే (చాలా తక్కువ శాతం మాత్రమే ఉంటుంది అనుకోండి) అయినా చెడ్డ లానే కనిపిస్తుంది, సమస్యను పెంచుతుంది, ప్రతికూల భావనలను కలుగచేస్తుంది తప్ప, పనికొచ్చేది ఏమి ఉండదు.

*పైగా ఇవన్నీ కవర్ చేసుకోవడానికి నాకు లోపల దాచుకోవడం తెలీదు, ఏదైనా ఇలా పైకి చెప్పేయడం అనే వెధవ కవరింగులు. తమ లోపల ఉన్న భావాలను వ్యక్తపరచడం తప్పుకాకపోవచ్చు, కానీ దానిని ఇష్టం వచ్చిన రీతిలో నోటికొచ్చినట్టు వ్యక్తపరచడం తప్పు. ఎందుకంటే మన మాటే మన ప్రపంచాన్ని సృష్టిస్తుంది కాబట్టి. అందులోనూ ఎవరైనా ఈ వ్యాధిని ఇట్టే పసిగట్టేయవచ్చు.*

వారి వారి వ్యక్తిగత, వృత్తి పరమైన జీవితాలలో ఇది మంచిది కాదు అని తెలిసినా, దీనివలన ఇబ్బందులు కలిగినా, ఆ దుర్వ్యసనం నుంచి బయటపడేందుకు ప్రయత్నించక.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, ఇతరుల పై నిందలు వేస్తూ తిరిగేస్తుంటారు. వీరి జీవితాన్ని ఎవరు బాగుచెయ్యలేరు, ఎందుకంటే ఎవరూ (95%) వీరి నోట్లో నోరు పెట్టడానికి పూనుకోరు. ఈ రకరకాల సమస్యల వలన వారికి దగ్గరగా, వారి చుట్టూ ఉండే వారు కూడా వారికి, వారి మాటలకి అంత విలువ ఇవ్వరు. పోనీ వీరి మానసిక స్థితిని అర్ధంచేసుకోని, ఇవన్నీ భరించి వారికి ప్రాముఖ్యతను ఇచ్చినా... వీరు మారకపోగా, అవకాశం ఇచ్చి, భరిస్తున్న వారికి ఏమి తెలీదు నాకంటే గొప్పోడు లేడు అని విర్రవీగుతుంటారు.

హృదయలోతుల్లోంచి, జీవిత అనుభవాల్లోంచి, మదిలో మెదిలే భావాల సంపుటి....నా అంతంలేని ఆలోచనల తరంగం, అదే *నా అనంతరంగం ౼ అమ్మ శ్రీనివాస్*

2018/03/05 06:47

http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

https://www.facebook.com/sreenivasaprasadrao.sarvaraju/posts/1565522236816600