1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

30, మే 2009, శనివారం

ప్రాచీన భారత శాస్త్రవేత్తలు

సుశ్రుతుడు- శస్త్రచికిత్సా పితామహుడు (ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
వర్గాలు ప్రాచీన భారత శాస్త్రవేత్తలు వ్రాసినవారు సురేష్ బాబు on Monday, August 25, 2008 at 1:16:00 PM

[https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjlFH4xWv9AWFuiWT5pzzq8TyErKLV-Qqm7NDqTHm9kOdv3Qcbq2hgvR_qO1Hz25AtAT2ynNwN0T1jhRVMILJdjazG6hE0Tjy2KK1a9GxVG0HG8EjU5Dktb4x0TUScpHwnvUOdsQUyY-PHi/s320/susruthatw3.png]సుశ్రుతుడు క్రీ.పూ 4 వ శతాబ్దమునకు చెందినవాడు.ఇంతకు మించి వీరి వృత్తాంతము తెలియరావడం లేదు.

వీరు ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు.మరియు మత్తుమందు ఉపయోగించడంలోనూ,కంటి శుక్లాలు తొలగించడంలోనూ,మూత్రపిండరాళ్ళు తొలగించడంలోనూ మరియు విరిగిన ఎముకలు అతికించడంలోనూ అనుభవజ్ఞులు.
ప్రక్క చిత్రాలలో సుశ్రుతుడు శస్తచికిత్స చేయడాన్ని మరియు అతడు ఉపయోగించిన పరికరాలను చూడవచ్చు.

[https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEifGFMMKs8z3V53PznGBAt9mr4mC06dyZvsOwWfn8Yr14WVkRPFZLj9B9TyT4EJFDO2UrrmGojTgUnOZ-_qUEJVBjEx5AIL-LkGDcOKjbC7GadIFcjU5uqrr4rDK5-gQ8FvdNgBy08uzAuK/s320/images.jpg]
ప్రపంచంలో మొట్టమొదట సిజేరియన్ చేసినది కూడా వీరే.

ఇతని మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ వృత్తాంతం చరిత్రలో క్రిందివిధంగా నమోదు చేయబడింది.
"ఒక రాత్రి ఒక ప్రమాదన్లూ దాదాపు ముక్కును కోల్పోయిన ప్రయాణికుడు సుశ్రుతుని తలుపు తట్టాడు.అతని ముక్కు నుండి రక్తం ధారాళంగా ప్రవహిస్తోంది.సుశ్రుతుడు మొదట అతని ముఖాన్ని శుభ్రంగా కడిగి ఏవో ఆకులను పిండి ఆ ఆకురసమును అతని ముక్కుపై పిండాడు.తర్వాత అతనికి కొద్దిగా ద్రాక్షరసం(వైన్) త్రాగడానికి ఇచ్చాడు.తర్వాత అతని ముక్కు పొడవును ఒక ఆకుతో కొలిచి అతని గడ్డం నుండి కొద్దిగా మాంసం ముక్కను కోశాడు.ఆ రోగి బాధతో మూలిగాడు కానీ ద్రాక్షరసం ప్రభావం వలన అతనికి నొప్పి తెలియలేదు.
తర్వాత గడ్డానికి కట్టుకట్టి రెండు గొట్టాలను ముక్కు రంధ్రాలలో పెట్టి ముక్కుతెగినచోట మాంసం ముక్కను ఉంచాడు.అక్కడ ఏదో మందుపొడిని,ఎర్ర చందనమును పూశాడు.మరియు మంగళివారు ఉపయోగించే లోహాన్ని ప్రవేశపెట్టాడు.తర్వాత నువ్వులనూనె తో పత్తిని తడిపి దానితో ఆ ముక్కుకు కట్టుకట్టాడు."

ఇదే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 26 శతాబ్దాలముందే చేయబడిన "ప్లాస్టిక్ సర్జరీ".వీరు ఈ విద్యలో కాశీ లోని దివోదశధన్వంతరి అను వారినుండి ప్రావీణ్యత సాధించారు.

వీరు రచించిన ప్రపంచప్రసిద్ద గ్రంథం "సుశ్రుతసంహిత".ఇందులో దాదాపు 101 రకాల శస్తచికిత్సకు ఉపయోగించే పరికరాలను తెలిపాడు.వీటికి జంతువులను సూచించు పేర్లను పెట్టాడు.

కణాదుడు(ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
వర్గాలు ప్రాచీన భారత శాస్త్రవేత్తలు వ్రాసినవారు సురేష్ బాబు on Friday, August 22, 2008 at 12:08:00 PM

పరమాణువుల గురించి పాశ్చాత్యులకన్నా ముందే కనుగొన్నవారు కణాదుడు.

వీరి తల్లిదండ్రుల గురించి,జన్మించిన స్థలం గురించి,మరణ వృత్తాంతం తెలియ రావడం లేదు.
వీరు క్రీ.పూ.6 వ శతాబ్దంలో జన్మించారు.వీరి అసలు పేరు కశ్యపుడు.చిన్నప్పటినుండే వీరు సునిశిత జ్ఞానం కలవారు.చిన్నచిన్న విషయాలను కూడా వీరు ఆసక్తిగా గమనించేవారు.

ఒకసారి వీరు ప్రయాగకు వారి నాన్న తో పాటు వెళ్ళారు.అక్కడి దారులపైన భక్తులు చల్లిన పూలు,బియ్యం గమనించి భక్తులు పూజల్లో నిమగ్నులై ఉందగా ఇతను మాత్రం ఆ గింజల్ని లెక్కించడం మొదలుపెట్టాడు.అది చూసి సోమశర్మ అను ఋషి చూసి ఎందుకలా లెక్కిస్తున్నావని అడిగాడు.అప్పుడు కణాదుడు ఆ గింజలు ఎంత చిన్నవైనప్పటికీ ఈ విశ్వంలో భాగమేకదా అన్నాడు.
ఈ విధంగా కణాదుడికి చిన్నచిన్న విషయాలపైన కూడా దృష్టి ఉండడంచూసి ఆ ఋషి అతనికి "కణాదుడు"(కణ అనగా ధాన్యపుగింజ) అని పేరుపెట్టాడు.

వీరు కనుగొన్నవి:
#ప్రపంచంలో మొట్టమొదట పరమాణుసిద్దాంతం ప్రతిపాదించారు.
#ఒక అణువులో కనీసం రెండు పరమాణువులు ఉంటాయని కనుగొన్నారు.
#ప్రతిపదార్థానికి మూలం పరమాణువులే అని వటిని విభజించలేమని,అవి కనపడవని తెల్పాడు.(ఇప్పుడు వాటినికూడా విభజించవచ్చని కనుగొన్నారు,కానీ ఆ కాలం లో కణాదుడిలా కనీసం ఎవరూ అణువును కూడా ఊహించలేకపోయారు).

కణాదుడు వైశేషికదర్శనం(మిగతా దర్శనాలు న్యాయ,సాంఖ్య,మీమాంస మొదలగునవి)ప్రతిపాదించాడు.ఇందులో విజ్ఞాన,మత మరియి వేదాంతాల సమన్వయం ఉంది.ఈ దర్శనాలు నవీన శాస్తజ్ఞులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఆర్యభట్ట (భారత శాస్త్రవేత్తలు)
వర్గాలు ప్రాచీన భారత శాస్త్రవేత్తలు వ్రాసినవారు సురేష్ బాబు on Monday, August 18, 2008 at 6:48:00 PM

భారతదేశం కన్న శాస్త్రవేత్తలలో ఆర్యభట్టు ప్రాతఃస్మరణీయుడు. ప్రపంచానికి సున్న("0") ను అందించిన గొప్పవాడు.

ఆర్యభట్ట క్రీ.శ. 476 వ సంవత్సరంలో పాటలీపుత్రంలో(నేటి పాట్నా)లో జన్మించాడు.కానీ చాలామంది ఇతడు కేరళలో జన్మించి,పాటలీపుత్రంలో స్థిరపడ్డాడని వాదనలు ఉన్నాయి.కాని వీటికి ఆధారంలేదు.ఇతడు వర్తక కుటుంబానికి చెందినవాడు.వీరి తల్లిదండ్రులు,జీవితం గురించి అంతగా పరిశోధన జరగలేదు.

ఏదేమైనప్పటికీ ఆర్యభట్టు తన సుప్రసిద్ద ఆర్యభట్ట సిద్దాంతం(ఆర్యభట్టీయం) పాటలీపుత్రంలోనే రచించాడనడంలో ఎటువంటి అభ్యంతరమూ లేదు.

గణితంలో ఇతని ఘనకార్యాలు:

1.ఇప్పుడు మనము పాశ్చాత్యులు కనుగొన్నారనుకొంటున్న విషయాలైన "భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగడం,భూమి చుట్టు చంద్రుడు తిరగడం" గురించి ఆనాడె తన గ్రంథం లో పేర్కొన్నాడు.
2.4 కు 100 కూడి వచ్చినదాన్ని 8 తో హెచ్చవేసి తర్వాత 62,000కు కూడి వచ్చినదాన్ని 20,000తో భాగిస్తే వృత్తపరిధి మరియు వృత్తవ్యాసం నిష్పత్తికి సమానమని చెప్పాడు.దీని విలువ 3.1416 అని చెప్పాడు.గమనించి చూస్తే ఇదే గణితంలోని "పై"విలువ అని తెలుస్తుంది.ఆధునిక గణితం ప్రకారం ఈ విలువ 3.14159.చూడండి ఆనాడే ఇతను ఎంత సరిగా విలువ గణించాడో.
3.చంద్రుని వెలుతురు సూర్యరశ్మి పరావర్తనంవలన కలుగుతుందని చెప్పాడు.
4.గ్రహణాలు రాహు,కేతువులవలన కాదు అని అవి ఒకే వరుసలోకి వచ్చినప్పుడు కలుగుతాయని గ్రంథంలో పొందుపరచాడు.
5.సంవత్సరానికి 365 రొజులని కూడా చెప్పాడు.
6.భూమి యొక్క చుట్టుకొలత 24385 మైళ్లని (నేటి విజ్ఞానం ప్రకారం ఇది 24900 మైళ్ళు) అని కనుగొన్నాడు.
తర్వాతికాలంలో ఇతని గ్రంథాన్ని గ్రీకులు,అరబ్బులు గ్రహించారు.

వీరు క్రీ.శ.550 లో మరణించారు.

భాస్కరాచార్యుడు (ప్రాచీన భారత శాస్త్రవేత్తలు)
వర్గాలు ప్రాచీన భారత శాస్త్రవేత్తలు వ్రాసినవారు సురేష్ బాబు on Thursday, July 31, 2008 at 3:22:00 PM

సనాతన భారతదేశం కన్న గణితశాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు.ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్యశాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి.చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు.పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత,గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు.

భాస్కరులు క్రీ.శ 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్( విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు.చిన్నపటి నుండే గణితం లో అనేక పరిశొధనలు ప్రారంభించాడు.వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది.

అదేమంటే భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట.ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే పద్దతి ఏమిటంటే కుండలలో ఇసుక,నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను,శుభాశుభాలను లెక్కించేవాడు.ఇలానే ఒకసారి తన కుమార్తె (పేరు లీలావతి) పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు.తన కుమార్తె జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు.కాని భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది.ముహూర్తనిర్ణయానికి ముందు లీలావతి ఒకరోజు ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకొంది.ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటిచుక్కల లెక్క,పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరం లోనే భర్త చనిపోయాడు.ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరులు తను మరియు లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేసాడు.ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు,సిద్దాంతాలు కనుగొని ప్రపంచప్రఖ్యాతుడయ్యాడు.తన కుమార్తెకు కూడా పేరుతెచ్చి పెట్టాడు.

సిద్దాంత శిరోమణి గ్రంధం ( భాస్కరులు ప్రపంచానికి అందించిన కానుక)

1150వ సంవత్సరం లో రచించిన "సిద్దాంత శిరోమణి" అను గ్రంధం భాస్కరులకు ఖ్యాతిని గణితప్రపంచానికి అమూల్యమైన కానుకను అందించినది.
ఇందులో భాగాలు నాలుగు.
అవి ౧.లీలావతి(అంకగణితం)
౨ .బీజగణితం
౩.గోళాధ్యాయ(గోళాలు,అర్దగోళాలు)
౪.గ్రహగణితo (గ్రహాలకు,నక్షత్రాలకు సంబంధించినది)
ఈ గ్రంధం సున్న (0) యొక్క ధర్మాలను, "పై" యొక్క విలువను,వర్గాలను,వర్గమూలాలను,ధనాత్మక-ఋణాత్మక అంకెలను,వడ్డీలెక్కలను,సమీకరణాలను గురించి తెలియజేస్తుంది.
మరియు పాశ్చాత్యులు గత శతాబ్దంలో కనుగొన్నామనుకొంటున్న కరణులు,వర్గ సమీకరణాలను,అనంతం (ఇంఫినిటి)ని కనుగొని చర్చించి,వాటిని సాధించింది.సమీకరణాలను వాటి 3వ,4వ ఘాతం వరకు సాధించింది.త్రికోణమితిని కూడా చాలా చర్చించింది.

మన దౌర్భాగ్యం మరియు అలసత్వం కొద్దీ గురుత్వాకర్షణను న్యూటన్ కనుగొన్నాడని పాశ్చాత్యులు చెబితే అదే నిజమని అనుకొని మోసపోతున్నాము.. కాని ఈ గ్రంధంలో(న్యూటన్ కన్నా 500 సంవత్సరాల పూర్వమే) భాస్కరుల వాక్యాలను గమనించండి.
"వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వలనే భూమిపై పడుతున్నాయి.కాబట్టి భూమి,గ్రహాలు,చంద్రుడు,నక్షత్రాలు చివరికి సూర్యుడు కూడా ఈ ఆకర్షణ వలనే వాటి కక్ష్యలలో పడిపోకుండా ఉన్నాయి.వాటికి కూడా ఆకర్షణలు ఉన్నాయి."

ఇంత స్పష్టంగా వీరు చెప్పినా ఇంకా మనం మన ప్రాచీన శాస్త్రవేత్తల గొప్పతనాన్ని తెలుసుకొనలేక పోతున్నాము.

తర్వాతి కాలంలో వీరు ఉజ్జయిని లోని ఖగోళగణితశాస్త్ర సంస్థకు అధ్యక్షుడయ్యారు.

వీరు మరణించిన సంవత్సరం 1183 లేక 1187.

కామెంట్‌లు లేవు: