మనజాతీయ గీతం
02వ సెప్టెంబరు, 2008
రవీంద్రనాధ్ టాగూర్ 1911వ సం.లో మొట్టమొదట బెంగాలీలో రచించిన జనగణమన గీతం, కొన్నాళ్ళపాటు ఆయన సంపాదకత్వం వహించిన ఆర్య సమాజ పత్రిక ‘తత్వబోధ ప్రకాశిక'లో ప్రచురించబడింది. ఆ కాలంలో డా. జేమ్‌స హెచ్. కజిన్‌స అనే ఐరిష్ కవి-ఆంధ్రరాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బీసెంట్ థియోసాఫికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేసేవారు.
కజిన్‌స ఆహ్వానం మేరకు 1919వ సం.లో రవీంద్రనాధ్ టాగూర్ మదనపల్లెకు విచ్చేశారు. ఒక ఫిబ్రవరి మాసం సాయంకాలం, డా. కజిన్‌స, ఆయన సతీమణి మార్గరెట్, మరికొందరు విద్యార్థులు టాగూర్‌ను ఒక బెంగాలీ పాట పాడమని పట్టుపట్టారు. అప్పుడు టాగూర్ ఈ గీతాన్ని ఆలపించారు. చివరి చరణమైన జయహే, జయహే, జయ జయహేకు వచ్చేసరికి శ్రోతలందరూ టాగూర్‌తో ఉత్సాహంగా గొంతులు కలిపారు.
[http://www.chandamama.com/telugu/download/imagestory.php?id=1220353478-0.gif]

టాగూర్ మదనపల్లెలో ఉన్నప్పుడే ఆ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. కజిన్‌స భార్య దానికి సంగీతం సమకూర్చారు. దానిని గురించి గుర్తు చేసుకుంటూ కజిన్‌స ఇలా అన్నారు : ‘‘ఆయన కొన్ని భౌగోళిక ప్రాంతాలను, పర్వతాలను, నదులను కీర్తించే పాటగా దానిని ఆలపించారు... ఆ తరవాత ఆ గీతంలో భారత దేశానికి చెందిన మతాలు కూడా చోటు చేసుకున్నాయి.''
1948, ఆగస్టు 15వ తేదీ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఢిల్లీ ఎరక్రోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినప్పుడు, శిక్ఖు రెజిమెంట్ ప్రప్రథమంగా ఆ జాతీయ గీతాన్ని ఆలపించింది. ఆ నాటి నుంచి మనమందరం జాతీయగీతంగా పాడుకుంటున్నాం.
నూరేళ్ళ పండుగ జరుపుకున్న మన జాతీయగేయం-వందేమాతరం.
18వ సెప్టెంబరు, 2008
[http://www.chandamama.com/telugu/download/imagestory.php?id=1221721181-0.gif]బంకించంద్ర చటర్జీ 1875వ సం.లో కలకత్తానుంచి తన స్వగ్రామమైన కాంతాలపడకు రైలులో ప్రయూణం చేస్తున్నారు. కిటికీ నుంచి చూసినప్పుడు అద్భుత ప్రకృతి సౌందర్యం ఆయనకు ఎంతో ఆనందం కలిగించింది. ప్రకృతి మాతను వర్ణిస్తూ గేయరచనకు ఆయనలో ప్రేరణ కలిగింది. వెంటనే ‘వందేమాతరం' గేయం ఆయన కలం నుంచి జాలువారింది. 1882వ సం.లో ఆయన ‘ఆనంద మఠం' అనే నవలను రచించారు.
ఒక సన్యాసుల బృందం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా రహస్యంగా తిరుగుబాటు జరపడం ఆ సుప్రసిద్ధ నవల ఇతివృత్తం. ఒక సందర్భంలో దేశభక్తులు ‘వందేమాతరం' గేయూన్ని ఆలపించే విధంగా రచయిత కథను మలిచారు. వారణాశిలో 1906వ సం.లో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో విశ్వకవి రవీంద్రనాథ టాగూర్ ఈ గేయూన్ని స్వరపరచి, స్వయంగా ఆలపించారు.
అప్పటి నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశంలోనూ ‘వందే మాతరం' గేయూన్ని ప్రార్థనాగీతంగా ఆలపించాలన్న నిర్ణయం జరిగింది. భారత రాజ్యాంగ శాసనం-టాగూర్ రచించిన జనగణమన గీతాన్ని జాతీయగీతంగానూ, ‘వందే మాతరం' గేయూన్ని దానికి సమాన ప్రతిపత్తిగల జాతీయ గేయంగానూ ఆమోదించింది. ‘వందేమాతరం' గేయూన్ని 1906సం. కాంగ్రెస్ సమావేశంలో ఆలపించడాన్ని పురస్కరించుకుని గత సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా ‘వందేమాతరం' గేయం నూరేళ్ళ పండుగ జరుపుకున్నాం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి