ఫోన్ : లబ్బరు గాజులు లబ్బరు గాజులు లబ్బరు గాజులు తెచ్చానే...
స్వదేశ్ కుమార్ : (ఎత్తి) హలో ! యెస్ స్వదేష్ స్పీకింగ్ !
విదేశ్ రావ్ : హలో స్వదీ ! నేనేరా విదీని ! ఎలా ఉన్నావ్ ?
స్వదేశ్ : ఓహ్ నువ్వా ? నా సంగతి సరే గానీ నువ్వెలా ఉన్నావురా అమెరికాలో ?
విదేశ్ : నేనిప్పుడు అమెరికాలో లేన్రా ! ఇక్కణ్ణుంచే మాట్లాడుతున్నాను.
స్వదేశ్ : వార్నీ ! వ్హాటే ప్లెజెంట్ సర్‌ప్రైజ్ ! చెప్పాపెట్టకుండా అమెరికా నుంచి ఎప్పుడొచ్చేశావురా ? సరే ! డైరెక్టుగా ఇంటికొచ్చేయ్, మాట్లాడుకుందాం !
విదేశ్ : వచ్చేవాణ్ణే గానీ స్వైన్ ఫ్లూ టెస్టులు చేస్తామని చెప్పి ఇక్కడ షమ్సాబాద్ ఎయిర్ పోర్టులో మమ్మల్ని లగేజితో సహా ఆపేశార్రా ! తరువాత మా అడ్రస్సూ, ఫోన్ నంబరూ తీసుకుంటారట. నాకు హైదరాబాదులో సొంత అడ్రస్సేం లేదు గదా ! అందుకని నీ మెయిలింగ్ ఆడ్రస్ కొంచెం చెప్తావా, నోట్ చేసుకుంటాను ?
స్వదేశ్ : సరే రాస్కో ! కేరాఫ్ స్వదేష్ కుమార్, హౌజ్ నంబర్ 12-34-567/3a/abc/ijk/pqr/xyz....
విదేశ్ : చచ్చాం పో, ఇదేం నంబర్రా బాబూ ?
స్వదేశ్ : హహ్హహ్హా ! మా హైదరాబాదులో ఇళ్ళ నెంబర్లన్నీ ఇలానే ఉంటాయ్ - అనగా ఇలాగే తగలబడతాయ్.
విదేశీ : సరే, రాసుకున్నా. తరవాత ?
స్వదేశ్ : తరవాత.... కుతుబ్ షాహి టూమ్స్ చౌరస్తా....
విదేశ్ : ఆగాగు, ఒక విషయం చెప్పు. నువ్వుండేది టూమ్స్ దగ్గరా ?
స్వదేశ్ : అబ్బా ! టూమ్స్ అంటే టూమ్స్ కాదురా ! ఒక విషయం అర్థం చేస్కో, హైదరాబాదులో పేరుకీ ఏరియాకీ సంబంధం లేదురా బాబూ ! గోల్కొండ చౌరస్తా అంటారు. అక్కడ గోల్కొండ ఉండదు. చార్మినార్ చౌరస్తా అంటారు. అక్కడ చార్మినార్ ఉండదు.
విదేశ్ : అయితే దీనికి హైదరాబాదనే పేరు తీసేసి మాయాబజార్ అంటే బావుంటుందేమో !
స్వదేశ్ : అదేదో నువ్వు సి.ఎమ్. అయ్యాక ఆలోచించు. ప్రస్తుతానికి అడ్రస్ రాస్కో !
విదేశ్ : సరే, చెప్పు !
స్వదేశ్ : సాయిగణేష్ ఎంక్లేవ్... ఆనంద్ నగర్ కాలనీ... అవంతీ ఎస్టేట్స్... ధర్మాపూర్ లేయౌట్... బాలాపూర్ రోడ్డు... హైదరాబాద్.
విదేశ్ : మై గాడ్ ! ఎక్కడైనా ఒక కాలనీ, ఒక ఏరియా ఉంటుంది. నీ ఒక్క కొంపకి పరమపద సోపానపటంలా ఇన్ని పూర్ లేంటి ? నగర్ లేంటి ? లేయౌట్ లేంటి ? ఎంక్లేవులేంటి ? వింటూంటే పిచ్చెక్కిపోతోందిరా నాయనా ! అసలీ అడ్రస్ పట్టుకుని నువ్వు రోజూ ఆఫీసు నుంచి తిన్నగా ఇంటికి చేరుకోగలుగుతున్నావా ? అని !
స్వదేశ్ : అసలు జీవితం గాడితప్పినవాడే దారితప్పి హైదరాబాదొస్తాడ్రా. మళ్ళీ ఇక్కడ దారితప్పితే అదో పెద్ద ఇష్యూ కాదులే !
విదేశ్ : నువ్వన్నది నిజంరా ! నేను కూడా నా అమెరికా జీవితం గాడి తప్పడం వల్లే హైదరాబాదొచ్చా.
స్వదేశ్ : అంటే ?
విదేశ్ : అంటే ఏముంది ? నీకు తెలుసుగా, క్రైసిస్ ఎలా ఉందో ! యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాస్తా అనెంప్లాయ్డ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయిపోయింది. ఇదివరకులా ఉజ్జోగాలూ, సజ్జోగాల్లేవ్. నా ఉజ్జోగానిక్కూడా ఎసరొచ్చింది. నా వీసా కూడా రిన్యూ చేసే అవకాశం లేకపోయె. దాన్తో "నా జన్-మ-భూ-మి ఎన్-తా అన్-ద-మైనా దేశమూ...." అని పాడుకుంటూ ఇక్కడికొచ్చిపడ్డా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాకి !
స్వదేశ్ : బాధలో ఉన్నా భలే చెప్పావురా విదీ ! మరి నీ భవిష్యత్ ప్రణాళికేంటి ? ఇక్కడే పర్మనెంటుగా ఉందామనా ? మళ్లీ స్టేట్స్ వెళదామనా ?
విదేశ్ : నా చేతిలో ఏముందిరా ? నేను అనుకుని ఇక్కడికొచ్చానా, అనుకుని అక్కడికెళ్ళడానికి ? ముందిక్కడేదైనా జాబ్ చూసుకుని తరవాత ఆలోచిస్తా. కానీ ఎంత స్వదేశమైనా ఒరే, అక్కడ అన్నేళ్ళు ఉండొచ్చాక ఇక్కడుండడం కష్టమేరా బాబూ !
స్వదేశ్ : కష్టమంటే ఏ దృష్టితో నంటావ్ ?
విదేశ్ : ఎంత క్రైసిస్ లో ఉన్నా ఆ వాతావరణం వేరు. ఆ మనుషులు వేరు. ఆ థాట్ క్లైమేట్ వేరు. మంచి రూల్సు, రెగ్యులేషన్సు ఉంటాయి. అందరూ పాటిస్తారు. ఇక్కడ అంతా ఖరాబోళ్ళు, గరీబోళ్ళు. రూల్సు పెట్టినా ఎవడూ పాటించడు. పాటించే వాతావరణం లేదు. అక్కడ యాభై స్టేట్స్ ఉన్నా అన్ని ఉన్నట్లే ఉండదు. చాలా పీస్ ఫుల్ గా ఉంటుంది. ఇక్కడైతే ఎప్పుడూ ఏదో ఒక గోల, గొడవ, గందరగోళం, న్యూసెన్సు. ఎలా ఉండగలనా ? అని ఆలోచిస్తున్నాను.
స్వదేశ్ : యు ఆర్ మిస్టేకెన్ మ్యాన్ ! అంత డిసిప్లిన్ లేకపోవచ్చు గానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా కూడా బాగా డబ్బున్న దేశమే.
విదేశ్ : ఒరే స్వదీ ! నాకెంత జాబ్ లేకపోతే మాత్రం, ఇలాంటి పూర్ జోక్సేసి నవ్వించాలని చూడకురా బాబూ, చిరాగ్గా ఉంటుంది.
స్వదేశ్ : జోకులు కాదురా ! నిజమే చెబుతున్నా.
విదేశ్ : అదే, ఏంటా నిజం ? అనడుగుతున్నా.
స్వదేశ్ : మొన్న జరిగిన ఎన్నికల్లో మనవాళ్ళు ఎంత డబ్బు తగలేశారో తెలుసా ? ఒక్క ఆంధ్రాలోనే వెయ్యికోట్లు పెట్టారు. డెవలప్డ్ కంట్రీలూ గాడిదగుడ్డు అంటావ్, ప్రపంచంలో ఎక్కడున్నారో చూపించరా నాకు - మనలా ఖర్చుపెట్టేవాళ్ళు !
విదేశ్ : అవున్రా ! ఇందులో ఇండియానే గ్రేట్ ! అయినా అంతమాత్రానే ఇండియా రిచ్ అంటే ఎలా ?
స్వదేశ్ : తొందరపడకు, ఇంకా ఉంది విను. ఎందులో చూసుకున్నా ఇండియానే రిచ్చి. నువ్విప్పుడు హైదరాబాద్ నుంచి మీ స్వగ్రామం వెళ్లాలంటే నీకు టిక్కెట్లు దొరకవ్.
విదేశ్ : అదేంట్రా ?
స్వదేశ్ : అదంతేరా ! పనీపాటా లేకుండా, ఒకవేళ ఉన్నా ఎగ్గొట్టి మరీ డబ్బులు తగలేసి, బస్సులూ, రైళ్ళూ ఎక్కి చుట్టాల్నీ, పక్కాల్నీ చూడ్డానికి వెళ్ళే దర్జా మనవాళ్ళకే సొంతం. అందుకని నీకు టిక్కెట్లు దొరకవ్. ఏ డోరుకో, కిటికీకో వేళ్ళాడుతూ వెళ్ళాల్సిందే.
విదేశ్ : మై గాడ్ ! మళ్ళీ అదొకటా ?
స్వదేశ్ : అదొక్కటే కాదురా ! ఇంకా చాలా ఉన్నాయి. ఒక మాటడుగుతా చెప్పు. మీ దేశంలో క్రిస్మస్ ఏడాదికి ఎన్నిసార్లు జరుపుకుంటారు ?
విదేశ్ : ఛ ! ఇదేం ప్రశ్నరా ? ఒక్కసారే గదా !
స్వదేశ్ : ఛ ! దట్స్ వై ఐ పిటీ యుఎస్. ద పూర్ కంట్రీ ! మేమిక్కడ దీపావళి ఎన్నిసార్లు జరుపుకుంటామో తెలుసా ?
విదేశ్ : ఆఁ ఎన్నిసార్లేంటి ?
స్వదేశ్ : ఎన్నిసార్లంటే అది మాకే తెలీదు, నీకేం చెప్తాం ?
విదేశ్ : అదేంట్రా ? మన చిన్నప్పుడు మామూలుగా ఏడాదికోసారి జరుపుకునేవాళ్ళం కాదూ ?
స్వదేశ్ :ఇప్పుడంతా మారిపోయిందిరా ! ఇప్పుడిక్కడ మనకి నిత్యదీపావళి. అదే మన గ్రేట్ నెస్. బర్త్ డే రోజు టపాసులు కాలుస్తాం, పెళ్ళిరోజు కాలుస్తాం. పిల్లలు పుడితే కాలుస్తాం. రిజల్ట్స్ వస్తే కాలుస్తాం. రిజల్ట్స్ రాకపోయినా కాలుస్తాం. పరీక్షలు అయిపోతే కాలుస్తాం. పరీక్షలు జరక్కపోయినా కాలుస్తాం. ఎన్నికల్లో గెలిస్తే కాలుస్తాం, ఓడిపోయినా కాలుస్తాం. దీపం వెలిగిస్తే చాలు, ఫైరింజన్ వేసుకొచ్చి గగ్గోలు పెట్టే పిరికిదేశంరా మీది. మా డబ్బూ, మా ధైర్యం మీకెక్కడివిరా ?
విదేశ్ : నిజమేరా బాబూ ! ఈ విషయంలో కూడా ఇండియానే గ్రేట్.
స్వదేశ్ : చూశావా ? ముందు పూర్ జోక్ అదీ ఇదీ అన్నావ్. ఇప్పటికి నీతో ముచ్చటగా మూడుసార్లు ఒప్పించాన్రా, ఇండియానే రిచ్ అని !
విదేశ్ : ఖర్చుదేముందిరా ? ఎవడైనా పెడతాడు. పదికోట్లు కూడా పది నిమిషాల్లో తగలెయ్యొచ్చు. సంపాదించడంలోనే ఉందిరా అసలైన గొప్పతనం. ఇండియాలో ఎవరికుందిరా అంత సంపాదన ?
స్వదేశ్ : అక్కడే ఉందిరా మాకూ, మీకూ తేడా ! మీకు ఆఫీసుకెళితే గానీ డబ్బు రాదు. కళ్ళు తెరిచి చూడాలే గానీ ఇండియాలో ఎటు చూసినా డబ్బే. అసలు ఎప్పుడూ లక్ష్మీదర్శనానికి నోచుకోని దరిద్రజీవితం గదరా మీది.
విదేశ్ : ఒరే ! ఒరే ! స్వదీ ! అమెరికాని అలా అంటే నేనొప్పుకోన్రా ! నాక్కోపమొస్తుంది. అసలు నీ ఉద్దేశమేంటో చెప్పు.
స్వదేశ్ : మీ యవ్వారాలన్నీ క్రెడిట్ కార్డుల్తోనేగా జరిగేది. ఇహ మీరు డబ్బు మొహం చూసేదెప్పుడు ? అందుకని మీకు లక్ష్మీదర్శనం లేదన్నాను.
విదేశ్ : అలా అంటావా ? అలాగైతే సరే ! ఒప్పుకున్నాను. మరి ఇండియాలో ఎటు చూసినా డబ్బేనని ఇందాక ఓ గొప్ప స్టేట్ మెంట్ పడేశావు గదా ! ఎక్కడ్రా ? నాకేం కనిపించట్లేదేం ? కొంపదీసి నువ్వీమధ్య గబ్బర్ సింగ్ ముఠాలో గాని చేరావేంటి ?
స్వదేశ్ : ముఠాలెందుకోయ్ ఉద్యోగాలుండగా ? ఒక ప్రశ్న వేస్తా, సమాధానం చెప్పు. మీ దేశంలో ఒక పోలీసాఫీసర్ ఏ మాత్రం సంపాదిస్తాడు ?
విదేశ్ : నెలనెలా జీతమొస్తుంది, ఒక ఇల్లు కడతాడు. రెండు కార్లు ఉండొచ్చు. అది కాక కొద్దిగా స్టాక్స్ లో ఏమైనా పెడతాడేమో ! అంతే !
స్వదేశ్ : ఆపరా బాబూ ! ఇహ చెప్పకు. అమెరికా పేదరికం తల్చుకుంటే నాకు గుండె తరుక్కుపోతోంది. అదే మా దేశంలోనైతే పోలీసాఫీసరంటే సొంత వ్యాపారాలుంటాయి. పరిశ్రమలుంటాయి. కార్లే కాదు, ఏకంగా బస్సులూ, లారీలూ కూడా ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఉంటుంది. డజన్ ఫ్లాట్ లూ, ఇళ్ళూ ఉంటాయి. ఇద్దరు ముగ్గురు పెళ్ళాలుంటారు. ఏం చేస్తే మీ పోలీసాఫీసర్ మా పోలీసాఫీసర్ తో సమానమవుతాడంటావురా ? మా కానిస్టేబుల్ సంపాదనలో సగం కూడా లేదు గదరా నాయనా మీ పోలీసాఫీసర్ల సంపాదన !
విదేశ్ : మహాప్రభో ! నన్నింక వదిలేయ్. లొంగిపోయాను. పూర్తిగా లొంగిపోయాను. మీ United States of india - ఇదొక ధనికదేశం.
స్వదేశ్ : సో, ఆ పూర్ కంట్రీలో ఉద్యోగం పోయిందని చెప్పి ఊరికే వర్రీ అవకు. ఈ రిచ్ కంట్రీలో నువ్వెలాగైనా హ్యాపీగా బతకొచ్చు. ఇహ వచ్చెయ్... బయల్దేరి మా యింటికొచ్చెయ్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి