1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

26, జూన్ 2009, శుక్రవారం

ఆదిభిక్షువు వాడినేది కోరేది?



ఆదిభిక్షువు వాడినేది కోరేది?
బూడిదిచ్చే వాడినేది అడిగేది? (2)
ఏది కోరేది, వాడినేది అడిగేది? (2)


తీపిరాగాలా ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవానినేది కోరేది? (2)

కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది?
ఏది కోరేది, వాడినేది అడిగేది? (2)


తేనెలొలికే పూలబాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది? (2)

బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది?
ఏది కోరేది , వాడినేది అడిగేది? (2)

గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిచేరు మన్మథుని మసి జేసినాడు
వాడినేది కోరేది?
వరగర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది? ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు, వాడినేది కోరేది?
ముక్కంటి, ముక్కోపి (2)
తిక్కశంకరుడు!

ఆదిభిక్షువు వాడినేది కోరేది?
బూడిదిచ్చే వాడినేది అడిగేది?
ఏది కోరేది, వాడినేది అడిగేది?

కామెంట్‌లు లేవు: