1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

6, జూన్ 2009, శనివారం

ప్రజ్ఞకు పది సోపానాలు

ప్రజ్ఞకు పది సోపానాలు

తలపెట్టిన కార్యము నుండి పొందబోవు ఫలితాల దృష్టితో పెంపొందించు ఆకాంక్ష
ఆకాంక్ష ను నిరంతర స్రవంతి లో కలిగి ఉండుటకు నిలిపి ఉంచు అంకిత భావము
అంకిత భావముతో అభ్యసించి ప్రాపంచిక పరిస్తుతులను విశ్లేషించి సాధించు విజ్ఞానము

విజ్ఞానాన్ని పెద్దల సమక్షము లో వారి అనుభవాల సారాన్ని రంగరించి రాబట్టు సూచనలు
సూచనలను ఆచరించి ప్రయోగించి నిత్య నూతన విదానాలను అవలంభించి చేపట్టు నిరంతర అభివృద్ధి
నిరంతర అభివృద్దిని కొనసాగించుటకు అంతర్గత సమస్యా సమాదానముల కొరకు కలిగి ఉండు పట్టుదల
పట్టుదలతో స్వీయ క్రమ శిక్షణతో సోమరితనాన్ని దరిచేరనివ్వక చేపట్టు ప్రామాణిక అభివృద్ధి
ప్రామాణిక అభివృద్ధి తో మానసిక విశాల దృక్పదాన్ని పాటిస్తూ కొనసాగించు నిత్య విద్యార్థి తత్వము
నిత్య విద్యార్థి తత్వము సాక్షి గా ముందుకు సాగి నిఘూడము గా అనుభవించు గమనము లో పరమానందాన్ని
పరమానందాన్ని ప్రాతిపదిక గా జ్ఞానాన్ని పంచుతూ పురోగమించి గెలుచుకో సేవలో ఉన్న సంతోషాన్ని

ఈ పది సోపానాలను అనసరించి అవలంభించి పరివర్తన చెంది జీవించు
అసమాన ప్రజ్ఞాశాలి గా

--ప్రభాకర్ రావు కోటపాటి

కామెంట్‌లు లేవు: