1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

6, జూన్ 2009, శనివారం

ఎప్పుడు వచ్చామన్నది కాదు .... ఏమి చేసామన్నదే ముఖ్యం

ఎప్పుడు వచ్చామన్నది కాదు .... ఏమి చేసామన్నదే ముఖ్యం

"అన్నయ్య... ఎప్పుడు వచ్చామన్నది కాదు .. బుల్లెట్ దిగిందాలేదా" అన్నది పోకిరి సినిమాలో డైలాగ్.

అలాగే మన పని మనం చేసుకుపోవాలి. మన పనులను బట్టే మనకి గుర్తింపు కాని మనము ఎప్పుడు మొదలెట్టాము ..ఎంతకాలమున్నాము అన్నది కాదు .

మనము ఏదైనా పనిని మొదలుపెటట్టినప్పుడు అది ౩ దశలు గుండా పయనిస్తుంది అని స్వామి వివేకానంద చెప్పారు.

1 . హేళన చెయ్యడం/నవ్వడం :
మొదట్లో మనం ఈ పని చేస్తున్నాము అని తెలియగానే కొందరు హేళన చేస్తూ వెటకారంగా మాట్లాడుతూ నిరుత్సాహ పరచడానికి ప్రయత్నిస్తారు. వీల్లని మనం అస్సలు పట్టించుకోరాదు.

2 . ఆటంకాలు కల్పించడం:
మన పనికి ఆటంకాలు కల్పిస్తారు. మనకి సామర్ద్యం లేదంటారు. మనకి సహకరించే వారికి మన గూర్చి చెడు ప్రచారం లాంటివి చేస్తుంటారు. ఈ పనికన్నా వేరేదేదొ అయితే బాగుందంటారు. వీటిని మనం నేర్పుగా అధిగమించాలి .

3 . అంగీకరిస్తారు :
వీళ్లే మనం విజయవంతమైతే అది తమ గొప్పే అని చెప్పుకుంటారు. తమ సహకారం వల్లే మనం ముందుకెల్లినట్టు బిల్డప్పులు ఇస్తారు. మనల్ని అతిగా పొగుడుతారు.

కాబట్టి మనం చెయ్యాల్సినది , మనం అనుకున్నది సాదించే వరకూ ప్రయత్నించాలి. మన సామర్ద్యం మీద నమ్మంకంతో ముందుకెల్లాలి. పొగడ్తల్ని ,విమర్శల్నీ సరి సమానంగా తీసుకోవాలి . వాటివెనుక ఉన్న ఉద్దేశ్యాల్ని విశ్లేషించాలి. ఉపయోగ పడే మంచిని తీసుకుంటూ సాగిపోవాలి.

కామెంట్‌లు లేవు: