1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

16, సెప్టెంబర్ 2009, బుధవారం

మన ఆంధ్రప్రదేశ్

మన ఆంధ్రప్రదేశ్

భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఒక ప్రకాశవంతమగు అధ్యాయము. భారతదేశపు భాగ్యవిధాతగా, అన్నపూర్ణగా వాసికెక్కిన రాష్ట్రం మనది. ఎందరో మహానుభావుల త్యాగఫలంగా సంపాదించుకొన్న తొలిభాషా రాష్ట్రం మనది. అంతకు ముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండేది. క్రీ ||శే|| పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణంతో ఏర్పడ్డ మన రాష్ట్రం అనతి కాలంలోనే సర్వతోముఖాభివృద్ధి చెందింది. త్రిలింగ భూమిగా పేరు గాంచిన తెలుగునేలే నేటి ఆంధ్రప్రదేశ్‌గా రూపొంది విరాజిల్లుతోంది.

మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 5వ పెద్ద రాష్ట్రం. ఇటువంటి మన రాష్ట్రాన్ని గూర్చి తెలుసుకుందాం మనమందరం.

"దేశభాషలందు తెలుగు లెస్స" అని ఖ్యాతి గాంచిన భాష మనది. ఈ రాష్ట్రంలో పుట్టటం నిజంగా ఒక వరం, అదృష్టం. మన ఆంధ్రప్రదేశ్‌కు ఒక విశిష్టమైన ప్రత్యేకత, గుర్తింపు వున్నాయి. తెలుగు ప్రజలు ఒక వెలుగుతేజం, తెలుగుదేశం ఒక భవ్యదేశం. ఆంధ్రులు తమకంటూ ప్రత్యేక రాష్ట్రం లేనిదే తమ అర్హతకు స్థానం, తమ ప్రజ్ఞకు గుర్తింపు లభించదనే భావంతో ప్రత్యేక రాష్ట్రోద్యమం చేపట్టారు.

చివరకి శ్రీ పొట్టి శ్రీరాముల ఆత్మార్పణంతో గాని ఆంధ్రరాష్ట్రం అవతరించలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబరు 19 వ తేదిన మద్రాసులో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించి 58 రోజులు దీక్ష సాగించి 1952 డిశంబరు 15 వ తేదీన తుదిశ్వాస విడిచారు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేస్తామని 1952 డిశంబరు 19వ తేదీన ప్రకటించింది. ఆ విధంగా తొలి భాషారాష్ట్రం ఆంధ్రులకు ఏర్పడింది. ఈ విధంగా తెలుగుజాతి తమ కంటూ ఒక స్వరాష్ట్రాన్ని సాధించుకుంది.

ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూల్. ప్రస్తుతం దీని రాజధాని హైదరాబాదు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భాష తెలుగు మరియు ఉర్దూ. 1953 అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మొదటి గవర్నర్ చందులాల్ త్రివేధి. మొదటి మఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారు.

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారిగ అక్ష్యరాస్యత శాతం:

రాష్ట్రం

-

అక్ష్యరాస్యత శాతం

ఆదిలాబాద్

-

53%

నిజామాబాద్

-

53%

కరీంనగర్

-

56%

రంగా రెడ్ది

-

66%

మెదక్

-

53%

వరంగల్

-

58.41%

ఖమ్మం

-

57.72%

విశాఖపట్నం

-

59.45%

విజయనగరం

-

51.8%

శ్రీకాకుళం

-

55.94%

తూర్పుగోదావరి

-

65.49%

పశ్చిమగోదావరి

-

73.95%

కృష్ణా

-

69.91%

నల్గొండ

-

57.84%

హైదరాబాద్

-

79.04%

మహబూబ్ నగర్

-

45.53%

కర్నూల్

-

54.43%

గుంటూరు

-

62.80%

ప్రకాశం

-

57.86%

అనంతపురం

-

56.69%

కడప

-

64.02%

నెల్లూరు

-

65.90%

చిత్తూరు

-

67.46%

ఆంధ్రప్రదేశ్ - విశ్వవిద్యాలయాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం

1926

విశాఖపట్నం

ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

1964

హైదరాబాద్

ఉస్మానియా విశ్వవిద్యాలయం

1918

హైదరాబాద్

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం

1982

హైదరాబాద్

హైదరాబాద్ విశ్వవిద్యాలయం

1977

హైదరాబాద్

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం

1954

తిరుపతి

తెలుగు విశ్వవిద్యాలయం

1985

హైదరాబాద్

జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం

1972

హైదరాబాద్

1967 లో నాగార్జున పి.జి సెంటర్ గా ఏర్పడి (1976 లో యూనివర్సిటీగా మారినది)


గుంటూరు

1967 లో కాకతీయ పి.జి సెంటర్ గా ఏర్పడి (1976 లోయూనివర్సిటీగా మారినది)


వరంగల్లు

1982 లో శ్రీకృష్ణదేవరాయ పి.జి. సెంటర్ ఏర్పడింది (1976 లో స్వయం ప్రతిపత్తి పొంది 1982 లో యూనివర్సిటిగా మారినది)


అనంతపురం

పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం

1983

తిరుపతి

శ్రీ సత్య సాయి విశ్వవిద్యాలయం


పుట్టపర్తి

ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం


విజయవాడ

ఇంగ్లీష్ - విదేశీ భాషల కేంద్ర సంస్థ


హైదరాబాద్

కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం


తిరుపతి

ఆంధ్రప్రదేశ్ జనాభా

ఆంధ్రప్రదేశ్ జనాభా బట్టి భారతదేశంలో 5వ స్థానంలో ఉన్నది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కంటే జనాభాలో పెద్ద రాష్ట్రాలు నాలుగు మాత్రమే అవి.

  1. ఉత్తర ప్రదేశ్

  2. మహారాష్ట్ర

  3. బీహార్

  4. పశ్చిమ బెంగాల్

ఆంధ్రప్రదేశ్ - జిల్లాలు

జిల్లా

-

జిల్లా కేంద్రం

శ్రీకాకుళం

-

శ్రీకాకుళం

విజయనగరం

-

విజయనగరం

విశాఖపట్నం

-

విశాఖపట్నం

తూర్పు గోదావరి

-

కాకినాడ

పశ్చిమగోదావరి

-

ఏలూరు

కృష్ణా

-

మచిలీపట్నం

గుంటూరు

-

గుంటూరు

ప్రకాశం

-

ఒంగోలు

నెల్లూరు

-

నెల్లూరు

అనంతపురం

-

అనంతపురం

చిత్తూరు

-

చిత్తూరు

కడప

-

కడప

కర్నూలు

-

కర్నూలు

రంగా రెడ్ది

-

వికారాబాద్

నల్గొండ

-

నల్గొండ

మహబూబ్ నగర్

-

మహబూబ్ నగర్

కరీంనగర్

-

కరీంనగర్

నిజామాబాద్

-

నిజామాబాద్

మెదక్

-

సంగారెడ్ది

ఖమ్మం

-

ఖమ్మం

వరంగల్

-

వరంగల్

ఆదిలాబాద్

-

ఆదిలాబాద్

హైదరాబాద్

-

హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్ - మార్గాలు:

వ్యవసాయము, పరిశ్రమలు, వాణిజ్యం మొదలైన అన్ని రంగాల అభివృద్ధికి రవాణా సౌకర్యాలు ఎంతో అవసరం. రవాణా వ్యవస్థ దేశానికి నాడీ వ్యవస్థ వంటిది. ఆంధ్రప్రదేశ్‌లో అన్నిరకాల రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, విమానమార్గాలు, ఉపయోగంలో ఉన్నాయి.

రోడ్డు మార్గాలు:

ప్రయాణికులను, సరుకులను చేరవేయటానికి రోడ్లు ప్రధానమైన, ప్రాథమికమైన రవాణా మార్గాలు. మన దేశంలో రోడ్లను నాలుగు విధాలుగా విభజించారు.

  • జాతీయ రహదార్లు:

ఇవి రాష్ట్ర రాజధానులను, రేవు పట్టణాలను కలుపుతాయి.

  • రాష్ట్రీయ రహదార్లు:

ఇవి రాష్ట్రంలోని జిల్లా ముఖ్య పట్టణాలను రాష్ట్ర రాజధానితో కలుపుతాయి.

  • జిల్లా రహదార్లు:

ఇవి జిల్లాలోని తాలూకా కేంద్రాలను, ఇతర ఉత్పత్తి కేంద్రాలను రాష్ట్ర రహదారులతోనూ, రైల్వే స్టేషన్లతోనూ కలుపుతాయి.

  • గ్రామ రహదార్లు:

ఇవి గ్రామాలను తాలూకా కేంద్రాలతోనూ, ఇతర గ్రామాలతోనూ కలుపుతాయి.

రాష్ట్రంలోని జాతీయ రహదారులు:

  • 5వ నెంబర్ జాతీయ రహదారి:

ఇది కలకత్తా - మద్రాసులను కలుపుతుంది. ఇది రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు పట్టణాల గుండా పోతుంది .

  • 7వ నెంబర్ జాతీయ రహదారి:

ఇది ప్రధానంగా నాగపూరు - బెంగుళూరును కలుపుతుంది. ఇది రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం పట్టణాలను కలుపుతుంది.

  • 9వ నెంబరు జాతీయ రహదారి:

ఇది ప్రధానంగా పూనా - విజయవాడలను కలుపుతుంది.

  • 43వ నెంబరు జాతీయ రహదారి:

ఇది ప్రధానంగా రాయపూర్ - విజయనగరం కలుపుతుంది.

  • 4వ నెంబరు జాతీయ రహదారి:

ఇది ప్రధానంగా బెంగుళూరు - మద్రాసులను కలుపుతుంది.

  • 16వ నెంబరు జాతీయ రహదారి:

నిజామాబాద్ - జగదల్ పూర్.

  • 18వ నెంబరు జాతీయ రహదారి:

చిత్తూరు - కర్నూలు రోడ్డు.

రైలు మార్గాలు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రైల్వే జోన్ల క్రింద రైలు మార్గాలున్నాయి - దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే, ఆగ్నేయ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రైల్వేలలో ఎక్కువ భాగం దక్షిణ మధ్య రైల్వే క్రింద ఉన్నాయి. దీని ప్రధాన కేంద్రం సికిందరాబాద్. దీని క్రింద సికిందరాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ, గుంటూరు డివిజన్లు 3134 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 661 రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

ప్రధాన రైలు మార్గాలు

  • మద్రాసు - కలకత్తా రైలు మార్గాం:.

ఇది ప్రధానంగా మద్రాసు - కలకత్తా పట్టణాలను కలుపుతుంది. మన రాష్ట్రంలో గూడూరు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వాల్తేరు పట్టణాలు ఈ రైల్వే లైను మీద ఉన్నాయి.

  • మద్రాసు - కలకత్తా రైలు మార్గం:

ఇది ప్రధానంగా మద్రాసు - ముంబయి పట్టణాలను కలుపుతుంది. మనరాష్ట్రంలో రేణిగుంట, నందలూరు, కడప, గుంతకల్లు స్టేషన్లు ఈ రైల్వే లైను మీద ఉన్నాయి.

  • మద్రాసు - ఢిల్లీ రైలు మార్గం:

ఇది ప్రధానంగా మద్రాసు - ఢిల్లీ పట్టణాలను కలుపుతుంది. ఇది మనరాష్ట్రంలో గూడూరు, నెల్లూరు, విజయవాడ, కాజీపేట పట్టణాలను కలుపుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ పెద్ద జంక్షన్. దేశంలో ఉత్తర దక్షిణాలను కలిపే అనేక రైళ్ళు, ఈ స్టేషన్ మీదుగానే పోతున్నాయి.

జలమార్గాలు

ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 1000 కి.మీ సముద్ర తీర రేఖ ఉన్నది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులు వాటి కాలువలు కూడ రవాణాకు ఉపయోగపడుతున్నాయి. నది, కాలువలలో ముఖ్యంగా కృష్ణా కాలువ (995 కి.మీ), గోదావరి కాలువ (800 కి.మీ), బకింగ్‌హాం కాలువ (410 కి.మీ) కడప - కర్నూలు కాలువ (120 కి.మీ ) రవాణాకు అనుకూలంగా ఉన్నాయి. కృష్ణా కాలువలలోని కొమ్మునూరు కాలువ, బకింగ్‌హాం కాలువను గోదావరి కాలువతో కలుపుతూ కాకినాడ - మద్రాసులకు (640 కి.మీ) రవాణా సౌకర్యం కల్పిస్తున్నది. పడవలు, లాంచీల ద్వారా వీటిపై ప్రయాణం సాగుతున్నది.

ఓడరేవులు:

రాష్ట్రంలో మొత్తం ఎనిమిది ఓడరేవులు ఉన్నాయి. ఇందులో విశాఖపట్టణం పెద్దతరహా రేవుపట్టణం, కాకినాడ, మచిలీపట్నాలు మధ్యతరహా రేవులు, కళింగపట్నం, భీమునిపట్నం, నరసాపురం, వాడరేవు, కృష్ణపట్నం, రేవులు చిన్నతరహా రేవు పట్టణాలు.

విశాఖపట్నం:

ఇది సహజరేవు పట్టణం. 'డాల్ఫిన్స్ నోస్' అనే కొండ ఈ రేవుకు కోటవలె ఉన్నది. 1933 లో ప్రారంభమైన ఈ రేవు దినదినాభివృద్ధి చెందినది. ఇక్కడనే హిందుస్థాన్ షిప్‌యార్డ్ అనే నౌకా నిర్మాణ సంస్థ ఉన్నది.

కాకినాడ:

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం తరువాత చెప్పుకోదగిన రేవు పట్టణం కాకినాడ, ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది. ఇది మధ్యతరహా రేవు. ఈ రేవులో తీరానికి 8 కి.మీ. దూరంలో నౌకలు, స్టీమర్లు ఆగుతాయి. వాటి నుండి చిన్న పడవలు సరుకులను తీరానికి చేరవేస్తాయి. కాకినాడకు 7 కి.మీ. దూరంలో నక్కెలపూడి వద్ద ఒక లైట్ హౌస్ ఉన్నది. రైలు, రోడ్డు, కాలువలు, కాకినాడను ఇతర ప్రాంతాలతో కలుపుతాయి.

మచిలీపట్నం:

ఇది కృష్ణా జిల్లాలో ఉన్న చిన్నతరహా రేవు పట్టణం. ఒకప్పుడు ఉచ్ఛ స్థితిలో ఉండేది. ఇప్పుడు క్షీణదశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నది.

కళింగపట్నం:

ఇది శ్రీకాకుళానికి 29 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ రేవుకు వచ్చిన నౌకలన్నీ తీరానికి 3 కి.మీ దూరంలో ఆగుతాయి. అక్కడ నుండి చిన్న పడవలు సరకులను చేరవేస్తాయి.

భీమునిపట్నం:

ఇది విశాఖపట్నం జిల్లాలో ఉన్నది. తీరానికి 17 కి.మీ. దూరంలో ఉండగానే కనిపించే లైట్ హౌస్ ఈ రేవులో ఉన్నది.

నర్సాపురం:

ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నది పాయ అయిన వశిష్ట నది మీద ఉన్నది. ఇది పురాతనమైన రేవు పట్టణం.

నిజాంపట్నం:

ఇది గుంటూరు జిల్లాలో ఉన్నది.

కృష్ణపట్నం:

ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నది.

వాడరేవు:

ఇది ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో ఉన్నది.

విమాన మార్గాలు:

మనదేశంలో అంతర్జాతీయ విమాన యానాన్ని ఎయిర్ ఇండియా సంస్ఠ, దేశంలోని వివిధ పట్టణాల మధ్య విమాన యానాన్ని ఇండియన్ ఎయిర్ లైన్స్ సంస్థ నిర్వహిస్తున్నాయి.

భారతదేశంలో మొత్తం 90 విమానాశ్రయాలున్నాయి. అందులో పాలం (ఢిల్లీ), డమ్ డమ్ (కోల్‌కత్తా), సంకర్ (ముంబాయి), మీనంబాకం (చెన్నై), తిరువనంతపురం (కేరళ) విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాలు. ఇవికాక దేశంలో 13 పెద్ద విమానాశ్రయాలు, 40 మధ్య తరహా విమానాశ్రయాలు, 31 చిన్న విమానాశ్రయాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాలలో హైదరాబాద్ పెద్ద విమానాశ్రయము. మిగిలిన వాటిలో 3 మధ్యతరహా విమానాశ్రయాలు, 4 చిన్న విమానాశ్రయాలు ఉన్నాయి.

  • పెద్ద విమానాశ్రయం - బేగంపేట (హైదరాబాద్)

  • మధ్య తరహా విమానాశ్రయాలు -

    • తిరుపతి

    • విశాఖపట్నం

  • చిన్న విమానాశ్రయాలు -

    • రాజమండ్రి

    • కడప

    • దొనకొండ

    • వరంగల్లు

పెద్ద, మధ్యతరహా విమానాశ్రయాలలో ప్రతిదినం రాకపోకలుంటాయి. చిన్న విమానాశ్రయాలు ప్రత్యేక సమయాలలో మాత్రమే ఉపయోగించబడతాయి. ఈ విమానాశ్రయాలన్నీ కేంద్ర ప్రభుత్వ సివిల్ ఏవియేషన్ శాఖ క్రింద నిర్వహింబడతాయి.

హైదరాబాదు నుండి ఢిల్లీ, మద్రాసు, ముంబాయి, బెంగుళూరు, నాగపూర్, కలకత్తాలకు విమాన సౌకర్యాలున్నాయి. హైదరాబాద్ నుండి రాజమండ్రి, కడప, తిరుపతి పట్టణాలకు కూడ విమాన సౌకర్యాలు కల్పించబడినవి.


కామెంట్‌లు లేవు: