మండే ఎండలు, పిల్లల పరీక్షలు కలిసి వాతావరణం చాలా వేడి వేడిగా వుంది. ఈ మండే ఎండలలో పుస్తక ప్రియులకి ఓ చల్లటి వార్త. విశాలాంధ్ర వారి వార్షిక క్లియరెన్సు అమ్మకం సందర్భంగా కొన్ని పుస్తకాల మీద 10 నుండి 50 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. విశాలాంధ్ర బ్యాంక్ స్ట్రీట్ బ్రాంచి మరియు యూసఫ్‌గూడా చౌరస్తాలో ఈ తగ్గింపు అమ్మకం ఈ నెల 25 వరకు వుంటుంది. పుస్తకాలు కొనాలనుకునేవారికి ఇదే మరి మంచి తరుణం వదులుకోకండి.
జాషువా, ఆరుద్ర, దాశరథి, వాసిరెడ్ది సీతాదేవి, గొల్లపూడి, బాపురెడ్డి మొదలయిన రచయితల పుస్తకాలపై 50 శాతం తగ్గింపు మరియు ఇతర పుస్తకాలపై 10 నుండి 25 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు.
మొత్తానికి గాంధీ వాడిన వస్తువుల వేలం రద్దు చేస్తున్నట్తు జేమ్స్ ఓటిస్ ప్రకటించాడు.
దేశంలో తొలిసారిగా అంధుల కొరకు Score Foundation అనే సంస్థ ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో అంధులు, కంటిచూపు తక్కువగా ఉన్నవారి కోసం సమస్త సమాచారాన్ని అందుబాటులో వుంచుతారు. http://www.eyeway.org లో అంధుల సమస్యలకు సలహాలు, సూచనలు పొందవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి