1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

6, నవంబర్ 2009, శుక్రవారం

"నేర్చుకోవడం"అంటే ?

"నేర్చుకోవడం"అంటే - ఒక మంచి కథ

కౌరవపాండవులు ద్రోణాచార్యుల గురుకులం లో విద్యాభ్యాసం చేస్తున్న రోజులవి. ఒకసారి ద్రోణులు ఏదో పనిమీద కొన్ని రోజులు బయటకు వెళ్ళవలసి వచ్చింది. వెళ్తూవెళ్తూ తన శిష్యులకు కొద్దిగా ఇంటిపని(home work) ఇచ్చి వెళ్ళాడు. అతను వచ్చిన తర్వాత శిష్యులు తాము చదివినదంతా ద్రోణులకు అప్పజెపుతారు.

కాని ధర్మరాజు మాత్రం "ఒక వాక్యాన్ని మాత్రం చదివాను.అందులొని విషయాన్నే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని చెప్తాడు. ఇన్నిరోజులుగా ఒక్కవాక్యం మాత్రమే చదివి నేర్చుకొన్నావా? అంటూ కోపంతో ధర్మరాజును దండిస్తాడు.


ఐనా ధర్మరాజు ఏ మాత్రం చలించకుండాఉండడం చూసి ద్రోణులు ఆలోచనలో పడి ధర్మరాజును పిలిచి "నాయనా! నువ్వు చదివిన ఆ వాక్యం ఏమిటి?" అన్నాడు. అప్పుడు ధర్మరాజు పుస్తకం చూపాడు."ఎన్నడూ కోపం తెచ్చుకోవద్దు" అన్నదే ఆ వాక్యం. ద్రోణులు ఆనందభాష్పాలు రాలుస్తూ "నాయనా! నాకు నువ్వు ఈరోజు "నేర్చుకోవడం"అంటే ఏమిటో నేర్పావు" అన్నారు.


పైన చెప్పిన విధం నిజముగా నేర్చుకోవడం కాని చిలకలలా నేర్చుకొని తిరిగి వల్లించడం,వప్పచెప్పడం కాదు.

కామెంట్‌లు లేవు: