1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

7, నవంబర్ 2009, శనివారం

ఋగ్వేదం

ఋగ్వేదం(వేదాలు)

మన హిందూమతానికి ఆధారభూతాలు వేదాలు.ఇవి ఋగ్వేదం,యజుర్వేదం,సామవేదం,అధర్వణవేదం అని నాలుగు.

మనము మొదట ఋగ్వేదం గురించి క్లుప్తంగా తెలుసుకొందాము.

ఋగ్వేదం దేవతాస్తుతి పరాలైన మంత్రాల సమూహము.ఋగ్వేదంఅనగా దేవతలని కుడా చెప్పవచ్చు.ఇందులోముఖ్యమైన దేవతలు ౩౩ మంది.వీరికి సామాన్య మానవులవలె శరీరాలుఉన్నవి.ఇంద్రుడు,సూర్యుడు,వరుణుడు,మిత్రుడు మరియు అగ్ని ఇందులో ప్రముఖంగా కనిపించే దేవతలు.

ఋగ్వేద ఆశయము:

మన అందరి ఆశయాలు ఒకటిగా ఉండాలనియు అందరి హృదయాలు,ఆలోచనలు మంచివిగా ఉండాలనియు ఒకసత్యమార్గమున నడవాలని,అందరు ఒక్కటే అని ఏకత్వము భోదిస్తుంది.ఇదే ఋగ్వేదములోని ప్రధానఆశయము.అందరు ఒక్కటే,అందరు భగవంతుని అంశలే,శక్తులే.అందరియందు ఉన్నా ఆత్మస్వరుపుడుఒక్కడే,భేదములు ఉండరాదు అని శాసించునది.ఇలాంటి విశాలభావాన్ని మరిచి,భేదములు అభివృద్ధి చేసుకొనిసంకుచిత జీవనం గడుపుతున్నారు.ఆనాడు సంకుసితమును కూలద్రోసి విశాలత్వమును,ఏకత్వమును చాటినదిఋగ్వేదము.

కామెంట్‌లు లేవు: