1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

2, ఫిబ్రవరి 2010, మంగళవారం

అంతర్మధనం

ఆవిరి పట్టక తప్పదు
అన్నంఆసాంతం ఉడకాలంటే
అంతర్మధనం తప్పదు
మనిషికిఆలోచన ఎదగాలంటే
చాలు చాలు చేసేదేముందని
చతికిలబడితే యెలా
సాధనలోనే బతుకున్నది
అదిసాగుతుండాలి శ్వాసలా
- డా. సి. నా. రె (ఆంధ్ర భూమి వారపత్రిక 11-3-1993)

కామెంట్‌లు లేవు: