1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

5, ఫిబ్రవరి 2010, శుక్రవారం

సంరక్షించు నీ తోటి మానవులను


కాలం కాని కాలం లొ కాలసర్పాలను పోలిన వర్షాలు
పొరలి పొంగి ప్రళయంలా ప్రవహంచిన నదులు
మునిగి మగ్గి మ్రుత్యుభాదతొ మనస్సు చలించిన భాదితులు
చెదరిపొయి చేయలేక చేతగాక చేస్టలుడిగిన ప్రజలు
జీవులను జీవితాలను జనావాసాలను జలదరింపచేసిన జలప్రళయం

వీక్షించి విలవిలలాడి విరాలాలిచ్చిన కార్పోరేట్ సంస్థల ఉద్యోగులు
సందర్శించి సమీక్షించి సహకరించిన నిర్వాహకులు
తరలివచ్చి తమదర్మాన్నిపాటించిన త్యాగధనులైన యువకులు
సమయాన్ని వెచ్చించి స్వార్దరహితముగా సేవలుచెసిన స్వచ్చందసేవకులు
పర్యవేక్షించి ప్రతిక్షణము పొత్సాహించిన దిశానిర్దేశకులు
అనుకోని ఆప్తులను వస్తువులను చూసి ఆశ్చర్యముతో ఆనందపరవసులైన వరదభాదితులు
సంచి మరియు పుస్తకాలను చూసి సంబరముతో స్పూర్తిపొందిన పాఠశాల విద్యార్దులు
ఉదార సహాయముతో ఊరటతో ఉపశమనము పొందిన బాధా సర్పదస్టులు
నడచివచ్చిన నాయకులనుచూసి నమ్మకము పొందిన భావిపౌరులు
సమూహముగావచ్చిన సొదరప్రేమనుచూసి స్వాంతనపొందిన అన్నదాతలు
కనిపించాయి కర్రలతోకట్టి చీరలు కప్పిన నివాసాలు
సాక్షాత్కరించాయి పిల్లలు రాక మూతపడిన పాఠశాలలు
దర్శనమిచ్చాయి నీరుప్రవహించి కోసుకుపోయిన రహదారులు
స్వాగతమిచ్చాయి మేటవేసి నేలకొరిగిన పొలాలు
సాక్షమిచ్చాయి వరదవుద్రుతికి కూలిపొయిన వ్రుక్షాలు
సహాయకుల ఆదరణకు చెమ్మగిల్లాయి వయోవ్రుద్దుల కళ్ళు
సేవకుల సహాయాన్ని పొగిడాయి భాదితుల నొళ్ళు
దాతల బహుమానాలకు నర్తించాయి పిల్లల కాళ్ళు
విరాళాల ఇంటిసామానులకు పండుగ జరిపాయి ప్రజల ఇల్లు
కార్పోరేట్ సంస్థల కొరకు వినిపించాయి పొగడ్తల జల్లు
 
చాలాఉంది చేయవలసినది......
నిర్మించాలి నిలపెట్టాలి నివాసాలను
ప్రారంబించాలి ప్రోత్సాహించాలి పాఠశాలలను
ప్రణాలికవేయాలి పటిష్టముచేయాలి రహదారులను
విద్యనందించాలి వివేకులనుచేయాలి ప్రజలను
దారిచుపాలి ధైర్యమివ్వాలి భావిపౌరులకు
                                       --ఫ్రభాకర రావు కోటపాటి

కామెంట్‌లు లేవు: