ఇది ప్రసిద్ధమైన 'అశోకుని సింహ రాజధాని', సారనాధ్ సంగ్రహాలయంలో గలదు. దీనిని భారత ప్రభుత్వం తన జాతీయ చిహ్నంగా దత్తత తీసుకుంది. దీనిని, సారనాధ్ లోని, అశోకుని ఏకసింహ రాజధాని నుండి దత్తత తీసుకున్నారు.
అశోకుడు స్థాపించిన అశోక స్తంభంపై గల నాలుగు సింహాల తల, దాని క్రింద భాగాన, అశోకచక్రం దానిక్రింది భాగాన తలకిందులుగా వున్న కలువపువ్వు, దానిక్రింద వ్రాయబడ్డ సత్యమేవ జయతే.. దానిక్రింద నాలుగు జంతుబొమ్మలూ వరుసగా ఎడమనుండి కుడికి, ఏనుగు, గుర్రం, ఎద్దు మరియు సింహం గలవు.
దీనిని, జనవరి 26 1950 రిపబ్లిక్ దినం నాడు భారత జాతీయ చిహ్నంగా దత్తత తీసుకున్నారు.
భారతీయ పాస్ పోర్టు ఈ చిహ్నం, భారత ప్రభుత్వము యొక్క లెటర్ హెడ్ పైన, భారత కరెన్సీ నోట్లపైన, మరియు భారత ప్రభుత్వం జారీచేసే పాస్ పోర్టుపైన కానవస్తుంది.
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి