1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

28, ఆగస్టు 2010, శనివారం

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా ?

పల్లవి : అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా..స్వర్ణోచ్చవాలు చేద్దామా…
ఆత్మవినాశపు అరాజకాన్నే స్వరాజ్యమందామా… దానికి సలాము చేద్దామా…
శాంతికపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం..
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా….. ఓ పవిత్ర భారతమా !
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
నిత్యం కొట్టుకుచచ్చే జనాల శ్వేచ్చను చూద్దామా.. దాన్నే స్వరాజ్యమందామా…

ఛరణం 1: కులాలకోసం గుంపులు కడుతూ..మతాలకోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే ..జనాలు తలలర్పిస్తారే..
సమూహక్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే ?…తెలిసీ భుజం కలిపి రారే ?
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి…పోరి ఏమిటి సాధించాలి…
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ..ఈ చిచ్చుల సిధూరం…
జవాబు చెప్పే భాధ్యత మరచిన జనాల భారతమా..! ఓ ..రణాల భారతమా..!!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
ఆత్మవినాశపు అరాజకాన్నే స్వరాజ్యమందామా..దానికి సలాము చేద్దామా…

ఛరణం 2:  అన్యాయన్ని సహించని శౌర్యం, దౌర్జన్యాన్ని దహించే ధైర్యం,
కారడవులలో కౄరమృగంలా దాక్కొని ఉండాలా.. వెలుగుని తప్పుకు తిరగాలా ?
శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం,
స్వజాతివీరులననచే విధిలో కవాతు చెయ్యాలా… అన్నల చేతిలొ చావాలా ?
తనలో దైర్యం అడవికి ఇచ్చి…. తన ధర్మం చట్టానికి ఇచ్చి…
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే….
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మంధారం…
ఈ సత్యా సింధూరం… వేకువవైపా చీకటిలోకా ఎటు నడిపేరమ్మా !…
గతి తోచని భారతమా….!!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
యుద్ధనినాదపు అరాజకాన్నే స్వరాజ్యమందామా..దానికి సలాము చేద్దామా…

ఛరణం 3: తనతలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని, తనలో నీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకొని, ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని, కళ్లు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుదంట…. ఆవేశం!
ఆ హక్కేదో తనకే ఉందని శాశిస్తుందట … అధికారం !!
కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం…. చితి మంటల సింధూరం…
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా…! ఓ.. విషాద బారతమా…!!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
ఆత్మవినాశపు అరాజకాన్నే స్వరాజ్యమందామా..దానికి సలాము చేద్దామా…
శాంతికపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం..
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా….. ఓ పవిత్ర భారతమా….
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
నిత్యం కొట్టుకుచచ్చే జనాల శ్వేచ్చను చూద్దామా…
దాన్నే స్వరాజ్యమందామా……..!!!

విశిష్టత     : 1997 ‘నంది’  అవార్డ్ విజేత
సాహిత్యం   : సిరివెన్నెల సీతారామశాస్త్రి
చిత్రం       : సింధూరం (Sindhuram)
స్వరకల్పన : శ్రీ (sri)
గానం       : ‘గానగంధర్వ’ ఎస్.పి.బాలు (S.P.Balu)

కామెంట్‌లు లేవు: