బేధాభిప్రాయాల నీడలు ఎన్ని వచ్చినా
మనల్ని కదిలించలేవని,
వాన చినుకులంత
స్వచ్ఛమైన చిరునవ్వుల్తో..
పగలే వెన్నెలలయ్యే మోహావేశంతో..
వెన్నెలలూ వేడనిపించే
కోరికల గాడ్పుల మధ్య-
అరుణిమలు నింపుకునే
తనువుల తన్మయత్వానికి
గాఢానుబంధనాల సౌఖ్యాన్ని జతచేస్తూ,
సాగే నిశ్శబ్ద యుద్ధంలో-
ప్రశాంతానుభూతిని గుండెనిండా నింపుకుంటూ
ఒకరి వెన్నంటి మరొకరుగా
మసలే మన జీవన ప్రయాణంలో
ఇరువురమూ ఒకరమేనని
ఒక్కటిగా కలిసిపోవాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ...
ఇలాంటి పుట్టినరోజులెన్నో
మనిద్దరిమధ్యా జ్ఞాపకాలై
మధురానుభూతినివ్వాలని ఆశిస్తూ...
ప్రేమతో.....
మనల్ని కదిలించలేవని,
వాన చినుకులంత
స్వచ్ఛమైన చిరునవ్వుల్తో..
పగలే వెన్నెలలయ్యే మోహావేశంతో..
వెన్నెలలూ వేడనిపించే
కోరికల గాడ్పుల మధ్య-
అరుణిమలు నింపుకునే
తనువుల తన్మయత్వానికి
గాఢానుబంధనాల సౌఖ్యాన్ని జతచేస్తూ,
సాగే నిశ్శబ్ద యుద్ధంలో-
ప్రశాంతానుభూతిని గుండెనిండా నింపుకుంటూ
ఒకరి వెన్నంటి మరొకరుగా
మసలే మన జీవన ప్రయాణంలో
ఇరువురమూ ఒకరమేనని
ఒక్కటిగా కలిసిపోవాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ...
ఇలాంటి పుట్టినరోజులెన్నో
మనిద్దరిమధ్యా జ్ఞాపకాలై
మధురానుభూతినివ్వాలని ఆశిస్తూ...
ప్రేమతో.....
ఎప్పటికీ-నీ నేస్తం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి