1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

12, అక్టోబర్ 2010, మంగళవారం

మంచి మాట(లు)

 

 

1.     మత ధర్మమనేది పుస్తకాలలో లేదు,సిద్ధాంతాలలో లేదు,మత విశ్వాసాలలో లేదు,ఉపన్యాసాలలో లేదు-చివరకు వాదనలలోను,తర్కంలోనూ కూడా లేదు.అది ఆచరించటంలోనూ, అనుభూతి చెందటంలోనూ ఉంది..

 

2.     తాత్కాలికమైన అపజయాల్ని, వైఫల్యాల్ని, చూసి బెదరిపోకుండా ఎదుర్కోవాలి. ఆలాంటపుడే విజయంలోని మాధుర్యం తెలిసేది.

 

3.     ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేరు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.

 

4.     ఒక్కోప్పుడు మనల్ని గురించి మనం చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటాం. ఎదుటివారిని గడ్డిపోచలా తీసేస్తాం. వాళ్ళకేమీ తెలీదనీ, అన్నీ మనకే తెలుసనీ భ్రమ పడతాం. దానితో వాళ్ళకే బాధ్యతలు అప్పగించం. అన్ని పనులు మన నెత్తినే వేసుకుంటాం.

 

5.    నాయకుడు అనేవాడు అందరిని నమ్మకూడదు, అలాగని నమ్మకుండాను ఉండకూడదు. అపనమ్మకము మృత్యువుతో సమానము. అతినమ్మకము అకాల మృత్యువుతో సమానము

 

6.     లోకంలో అందరూ తెలివైనవారే, ఎవరూ తెలివితేటలుల్కెఅ చెడిపోవడం లేదు. ఉన్న తెలివితేటల్ని సక్రమంగా వినియోగించక చెడిపోతున్నారు.

 

7.     "జననం ఒక సుప్రభాతం, మరణం ఒక సంధ్యా రాగం... రెండిటి మధ్య జీవితం సుఖదుఖాల సంగమం... అందులో నీ ప్రస్తానం కావాలి ఒక అమృతకావ్యం"

 

 

Thanks & Regards

S.Sreenivasa Prasad Rao

CIQ GO GREEN TEAM

<Protect Trees—Protect yourself>

 

కామెంట్‌లు లేవు: