1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

27, అక్టోబర్ 2010, బుధవారం

సేవ /సహాయం

సేవ /సహాయం  అనేది మన సంతృప్తి కోసం, ఎదుటి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడడంకోసం, వాళ్ళ  కష్టాలను కడ తేర్చడం కోసం, వాళ్ళ కన్నీళ్ళకు వీడ్కోలు పలకడం కోసం  మనం ఎదుటి వారికి  చేసే ఏదైనా పని మాత్రమే…..


ఎంతో  మంది  ఆదరణ, అండదండలతో, సహాయంతో మనం స్థితికి వచమని గుర్తించి ..మనం సమాజం  నుంచి, ప్రకృతి నుంచి, తల్లి దండ్రుల నుంచి, అధ్యాపకుల నుంచి, బందువుల నుంచి, స్నేహితుల నుంచి ....ఇలా ఎందరెందరో...తోటి వ్యక్తుల నుండి మనం పొందిన  సహాయాన్ని, మనం కూడా తోటి వ్యక్తులకు ఇవ్వాలనే భాద్యతోను,తిరిగి ఎటువంటి ప్రతిపలం  ఆశించకుండా  చెయ్యగలిగే సహాయమే... సేవ.. అదే సేవకు  నిజమైన నిర్వచనం ..


అంతే కాని నా పేరు కోసమో,కంపెనీ పేరు కోసమో,గ్రూప్/అసోసియేషన్  పేరు కోసమో,నా అహం కోసమో, సమాజంలో గౌరవం కోసమో చేస్తే అది కచ్చితంగా  నాకు, నా  అహానికి  తృప్తిని  ఇవ్వోచేమో గాని, అలాగే అవతలి వారి కష్టాలను తీర్చవచ్చునేమో కాని ...అది ఎన్నటికి సంపూర్ణమైన సేవ అవదేమో....


నీ  శ్వాస చివరి దాక  పరులకు  సహాయం  చెయ్యాలి  అనే  ఆశ చావక, మనం చేసే  నిస్వార్ధమైన సహాయమే... సేవ ...ఇలాంటి సేవకు మన సొంత మానసిక స్తితిగతులతోను,పరిస్తితులతోను ముడి వేయక, ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి, మన అహాన్ని,స్వార్ధాన్ని చంపుకొని, మన పేరు, ప్రతిష్టలతో  సంబంధం లేకుండా మనం చెయ్యడానికి సిద్దపడతాం...ముడిపడక నిరంతరం, నిష్కల్మషంగా  సాగుతూనే వుంటుంది...ఇలాంటి సేవ యొక్క ఆశయం  ఎలాగైనా, ఎటువంటి పరిస్థితులలోనైనా అవతలి వారికి  సాయం చేయడమే....


అలా కానప్పుడు.... సహాయం మన స్వార్ధం కోసంమన అహం కోసం, మన  పేరు ప్రఖ్యాతుల కోసం, మన ద్వారానే జరగాలి అని అనుకుంటే అది పరిపూర్ణం కాక  ఎక్కడో  ఒక  దగ్గర ఆగిపోతుంది...... ఇలాంటి సేవ/సహాయం ఎవరో  ఏదో అన్నారనో, మన మాట వినలేదనో, మనకు నచ్చని  వాళ్ళు పాల్గొంటున్నారానో, మన తోటి వారు మనలాగా చెయ్యటంలేదనో, మన ఆలోచనలను పరిగణనలోనికి తీసుకోలేదనో, మనకు పేరు రాలేదనో, మన ఆద్వర్యంలో జరగలేదనో, ఏదో  పేరు కోసం భాద్యతగా కాక భారంగా  చేయడమో... ఇలా ఏదో ఒక  కారణంతో నలుగురికి చెయ్యాల్సిన దానిని, నలుగురితో చెయ్యక...నేనొక్కడినే, నాకు నచ్చిన వాళ్ళతో,నా ఇష్ట ఇష్టాల ప్రకారం, నాకు పేరు  రావాలని మాత్రమే  చెయ్యాలనే  తాపత్రయంతో ప్రారంబించినప్పుడు  అది పూర్తిగా సాగక, మధ్యలోనే ఆగిపోవడమే కాక అది సంపూర్ణంగా నీ ఆశయాలను సాదించలేదు....స్వచ్చమైన సేవ కాదు.......

"ఎప్పుడైతే  నీ  సహాయం /సేవ నిస్వార్ధం  అవుతుందో,

నిష్కల్మషమైన నీ  గుండె  చప్పుడు అవుతుందో,

ఎదుటివారి ఆనంద ప్రవాహం కోసం  చేసే  యజ్ఞం  అవుతుందో,

నలుగురితో కలిసి, నలుగురికి చేసే మంచి  పని  అవుతుందో ,

అప్పుడే అది నిజమైన సేవ అవుతుంది..నువ్వు ఎప్పుడు పొందలేని మానసిక సంతృప్తి  అవుతుంది....

అందుకే కలసి జీవించు - కలసి పోరాడు  -కలసి జయించు - కలసి ఆనందించు..కలకాలం హాయిగా, ఆనందంగా జీవించు.....నీతోటి వారికి జీవితాన్ని అందించు...

                                                                                   నా అనంతరంగం..అమ్మ శ్రీనివాస్ 

3 కామెంట్‌లు:

kam చెప్పారు...

Nijaniki meeru raasindaantho ekabhavinchalani undi.
Ekkado nalo vyathirekatha bayataki vasthondi. Pariseelinchanu. Adi vyatirekatha kaadu. Ekkado prathikoolata.

Meeru inka baaga lopalivaraku velli vipuleekarinchi vrasiunte bagundedhi.

kam చెప్పారు...

Hi Srinivas,

I am glad that there is really some activity going on. I would get in touch with you and possibly sometime in January.

regards,
Kam

Amma Sreenivas చెప్పారు...

Sir sorry for very delayed reply for any clarifications, suggestions u can reach me at 9177999263