పిల్లల గేయముల ప్రపంచమునకు స్వాగతము
తెలుగు సాహిత్యంలో చిన్నారి పదాలికి ఒక విశిష్ఠ స్థానం ఉంది. అప్పుడే మాటలు నేర్చుకుంటున్న చిన్నారులకు మీగడ తారకల లాంటి చిన్న చిన్న మాటలు, పాటల రూపంలో నేర్పేవిగా ఉంటాయి, ఈ చిన్నారి పాటలు. చిన్నారులకు సరళ భాషలో పరిసర విశేషాలను బోధ పరిచేవిగా, మానవ సంబంధాలను వివరించేవిగా ఉండే ఈ పదాలకు ఆద్యులేవరో తెలియదు., సామాన్య జనావళి నుండి పుట్టుకొచ్చి , వారి నొళ్ళలొ నాని బ్రతికినది ఈ ప్రక్రియ. ఈ పాటలు నిజమైన వారసత్వముగా చిన్నారులకు ఇవ్వబడినవి.
- చిట్టి చిట్టి మిరియాలు చెట్టుకింద పోసి పుట్టమన్ను తెచ్చి, బొమ్మరిల్లు కట్టి అల్లవారింటికి చల్లకి పోతే, అల్లవారి కుక్క భౌ భౌ అన్నది, నాకాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లు మన్నవి చంకలో పాప క్యార్ క్యార్ మన్నది.
· చెల్ చెల్ గుర్రం చలాకి గుర్రం రాజు ఎక్కే రంగుల గుర్రం రాణీ ఎక్కే జీను గుర్రం చెల్ చెల్ గుర్రం చలాకి గుర్రం
· చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పోయంగ ఆరగించంగ ముత్యాల చెమ్మ చెక్క ముగ్గు పోయంగ రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగ పందిట్లో అమ్మాయి పెళ్ళి చేయంగ
· చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటుక్కు మింగావా గూట్లో పెట్టావా గుటుక్కు మింగావా
· చందమామ రావే,జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి పూలు తేవే బండెక్కి రావే బంతిపూలు తేవే తేరు మీద రావే తేనెపట్టు తేవే పల్లకిలో రావే పాలు పెరుగు తేవే పరుగెత్తి రావే పనసపండు తేవే నామాట వినవే నట్టింట పెట్టవే అన్నింటిని తేవే అబ్బాయికి ఇవ్వవే
· ఒప్పులకుప్ప వయ్యారి భామ సన్న బియ్యం చాయపప్పు మినపపప్పు మెంతి పిండి మినపపప్పు మెరిక బియ్యం గాటి బెల్లం కవ్వడి నెయ్యి గుప్పెడు తింటే కులుకులాడే గుప్పెడు తింటే ఆనందమండి
· గుడి గుడి గుంజం గుండే రాగం పాముల పట్నం పడకే రాగం నీపెళ్ళెప్పుడు రేపా,యెల్లుండా ఎప్పుడు గుడి గుడి గుంజం గుండే రాగం పాముల పట్నం పడకే రాగం
· ఆడుదాం పాడుదాం అల్లరెంతో చెయుదాం గెంతుతాం దూకుతాం గమ్మత్తెంతో చేయుదాం కుందుదాం కూలుదాం గుంజరాలు తీయుదాం పరుగుదాం పట్టుదాం గుంజికాయ గుంజుదాం
· ఉడుతా ఉడుతా ఊచ్ ఎక్కడికెళ్దామోచ్. కొమ్మమీది జాంపండు కోసుకొస్తావా మా బేబికిస్తావా. ఉడుతా ఉడుతా ఊచ్.
· ఏనుగమ్మా ఏనుగు ఏ వూరెళ్ళిందేనుగు మా వూరెళ్ళిందేనుగు మంచినీళ్ళు తాగిందేనుగు ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు
· ఒకటి ఒకటి ఒకటి మానవులంతా ఒకటి రెండు రెండు రెండు మంచి చెడులు రెండు మూడు మూడు మూడు జెండా రంగులు మూడు నాలుగు నాలుగు నాలుగు వేదాలు మనకు నాలుగు ఐదు ఐదు ఐదు చేతికి వేళ్ళు ఐదు ఆరు ఆరు ఆరు ఋతువులు మనకు ఆరు ఏడు ఏడు ఏడు వారంరోజులు ఏడు ఎనిమిది ఎనిమిది ఎనిమిది దిక్కులు మనకు ఎనిమిది తొమ్మిది తొమ్మిది తొమ్మిది గ్రహాలు మనకు తొమ్మిది
· కాకి ఒకటి నీళ్ళకై కావ్ కావ్ అని అరిచెను అడవి అంత తిరుగుచూ అలసి సొలసి పోయెను చిన్న మూతి కూజా అడుగునున్న నీరు కన్నులారా చూచెను మనసారా తాగెను
· కోతి బావకు పెళ్ళంట కొండ కోన విడిదంట. కుక్క నక్కల విందంట ఏనుగు వడ్డన చేయునట.
· గుడి గుడి గుంజం గుండే రాగం పాముల పట్నం పడకే రాగం నీపెళ్ళెప్పుడు రేపా,యెల్లుండా ఎప్పుడు గుడి గుడి గుంజం గుండే రాగం పాముల పట్నం పడకే రాగం
· తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం వేణూనాద తారంగం వెంకట రమణ తారంగం వెన్నెలదొంగ తారంగం చిన్ని కృష్ణ తారంగం తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం
· నారాయణ నారాయణ నక్క తోక నా మొగుడు తెచ్చాడు కొత్త కోక నేనెందుకుంటాను కట్టుకోక ఎన్నాళ్ళు వుంటుంది చినిగిపోక మా అత్త వుంటుందా మొత్తుకోక.
· నేనొక అందాల డాక్టర్ని నాకొక చిట్టి పొట్టి బ్యాగుంది బ్యాగులో ఎన్నో మందులున్నాయి టాబ్లెట్ ప్లస్ టానిక్లిస్తా ఇసిజి ఇంజెక్షన్ ఇచ్చేస్తా గుండె తీసి గుండెను పెట్టేస్తా రోగాలన్ని తగ్గిస్తా
· పాపల్లారా రారండి చక్కటి రంగు చూడండి గులాబి పువ్వును నేనండి ఎరుపు రంగు నాదండి సంపంగి పువ్వును నేనండి పచ్చ రంగు నాదండి మల్లియపువ్వు నేనండి తెలుపు రంగు నాదండి ఆకాశమంతా నేనండి నీలంరంగు నాదండి
· పొద్దున్నే పొద్దున్నే లేద్దామా తోటలోని పూలను కోద్దామా కోసినవి రాశులుగా పోద్దామా పోసినవి మాలలుగా అల్లేద్దామా పొద్దున్నే పొద్దున్నే లేద్దామా తోటలోని పూలను కోద్దామా అల్లినవి గుళ్ళోకిచ్చివేద్దామా దేవునికి మాలలుగా వేద్దామా
· బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు వీది వీది తిప్పేరు వీసెడు గందం పూసేరు
· బుజ బుజ రేకుల పిల్లుందా బుజ్జారేకుల పిల్లుందా స్వామి దండల పిల్లుందా స్వరాజ్యమిచ్చే పిల్లుందా బుజ బుజ రేకుల పిల్లుందా బుజ్జారేకుల పిల్లుందా
· బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెళ్తివి రాజు గారి తోట లోన మేతకెళ్తిని రాజు గారి తోటలోన ఏమి చూస్తివి రాణి గారి పూల చెట్ల సొగసు చూస్తిని పూల చెట్లు చూసి నీవు ఊరుకుంటివా ఊరుకోక పూలచెట్లు మేసివస్తిని మేసివస్తె తోటమాలి ఏమి చేసెను తోటమాలి కొట్టవస్తె తుర్రుమంటిని.
· బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది పడమటింటి కాపురము చేయనన్నది అత్త తెచ్చిన కొత్త కోక కట్టనన్నది బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది పడమటింటి కాపురము చేయనన్నది మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది మొగుడి చేత మొట్టికాయ తింటానన్నది బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది, పడమటింటి కాపురము చేయనన్నది
· మామా మామా మామిడిపండు మామ నెత్తి బోడిగుండు అల్లం,బెల్లం తెచ్చిండు అందరికి ఇచ్చిండు పెద్ద గుండు ఎత్తెండు ఎత్తలేక ముక్కెండు కాలు జారి పడెండు కర్ర చేత పట్టెండు.
· వాన వచ్చి వాగులు పారే కోడి వచ్చి గుడ్డు పెట్టె తాత వచ్చి తొంగి చూసే అవ్వ వచ్చి గుడ్డు తీసే అమ్మ వచ్చి అట్టు వేసే అన్న వచ్చి గుటుక్కు మింగే నాకు మాత్రం గుండు సున్నా
· వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప తిరుగు తిరుగు తిమ్మప్ప తిరగలేను నరసప్ప వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి