1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

6, నవంబర్ 2010, శనివారం

అయ్యప్ప స్వామి దీక్ష / మాల ధారణ

With the blessing of SriGuru & Sri Gayathri Matha

This Blog

Linked From Here

The Web

This Blog

 

 

 

 

Linked From Here

 

 

 

 

The Web

 

 

 

 

 

Thursday, November 13, 2008

అయ్యప్ప స్వామి దీక్ష / మాల ధారణ

సమయం లో నల్లని పంచలు, మేడలో రుద్రాక్ష మాలలు, నుదుట గంధం విభూది తో మనకు అయ్యప్ప భక్తులు కనిపిస్తారు. 40 రోజుల దీక్ష తీస్కోని, అయ్యప్ప ని పూజించే భక్తులను మనం "స్వామి " గా సంభోదిస్తాం. అయ్యప్ప దీక్ష అనునది మళయాళ నెలల లో వృశ్చికం ( నవంబర్ 14/15/16 ) నుండి మొదలవుతుంది. మండల పూజ

( సుమారు25 dec ), మకర సంక్రాంతి ( సుమారు 14jan ) రెండు రోజలలో అయ్యప్ప స్వామి దర్శనం చేస్కొంటారు. రెండు రోజలలో మకర సంక్రాంతి రోజు దర్శనం ప్రదానమైనది. రోజు జ్యోతి దర్శనం జరుగుతుంది. జ్యోతి రూపం లో అయ్యప్ప భక్తులకు దర్శనం ఇస్తారు.

 

శబరిమల ఆలయం, మళయాళ నూతన సంవత్సర మొదటి రోజు, ప్రధాన పండగల రోజు తెరుస్తారు. ఉదా : ఓనం, విశు. 41రోజుల దీక్ష తప్పనిసరిగా తెస్కొని అయ్యప్ప దర్శనం చేయవలెను. అయ్యప్ప దీక్ష అనునది తల్లి ద్వారా కానీ, గురువుగారి ద్వారా కాని, గురుస్వామి ద్వారా కాని తెస్కోనవలెను. రుద్రాక్ష మాల మెడలో పడిన దగ్గర నుండి " స్వామి " అని అందరి చేత పిలువబడుతాడు. అమ్మాయిలు దీక్ష తీసుకోడానికి నిబంధనలు ఉన్నాయి. అమ్మాయి 1 -9 వయస్సు లోపు వారు, 50 వయస్సు దాటినా వారు దీక్షకు అర్హులు. దీక్ష తీసుకొన్న ఆడువారిని "మాలికాపురం" గా పిలుస్తారు. ( అయ్యప్ప యొక్క శక్తి స్వరూపం).

 

దీక్ష తీసుకొన్న వారు ఖచ్చితంగా నియమ నిభంధనలను పాటించాలి. తెల్లవారక ముందే లేచి, చన్నీటి స్నానం చేసి, శరణు ఘోష చేసి, నైవేద్యం పెట్టాలి. చెప్పులు, బూట్లు ధరించకూడదు. నలుపు / కాషాయం రంగు మాత్రమే ధరించాలి. జుట్టు కత్తిరింపు, ధూమపానం, మందు తాగటం, మాంసాహారం భుజించడం చేయకూడదు. బ్రహ్మచర్యం తప్పకుండ పాటించాలి. వేరే వారిని పిలిచేటప్పుడు కూడా స్వామి అనే సంభోదించాలి. నియామాలు పాటించకుండా శబరిమల దర్శనం వ్యర్ధం.

 

" ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప "

 

 

Thanks & Regards

 

S. Sreenivasa Prasad Rao

<Protect Trees—Protect yourself>

 

ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.

 

కామెంట్‌లు లేవు: