ఒక మహాభక్తుడు అసలు స్వర్గం, నరకం ఎంటో తెలుసుకోవాలని తపన తో దేవున్ని ప్రార్థిస్తాడు. దేవుడు ప్రత్యక్షమై, ఆ భక్తునికి రెండు వేరు వేరు గదులను చూపి వాటిలో పలికి వెల్లి చూడు నీకు అసలు స్వర్గం, నరకం ఎంటో తెలుస్తుందీ అన్నడు.
మన వాడు మొదట ఒక గదిలోకి వెళ్ళి చూడగా ఆ గదిలో పెద్ద బల్ల దాని మీద కుండలో ఘుమ ఘుమ లాడే పాయసం ఉంది. ఆ బల్ల చుట్టూ బక్క చిక్కిన పాపులు ఆకలి తో కుండ వైపు చూస్తూ కూర్చొని ఉన్నారు. వారి చేతులకి
చివర పెద్ద గెరిటెలు దారంతో కట్టి ఉన్నయి. వారు ఆ కుండలో ఉన్న పాయసం తినడానికి వారి చెతులకు కట్టి ఉన్న గెరిటెలతో అందుకో గలుగుతున్నరే గాని పాయసం నోటికి అందెయ్ లోపు గెరిటెలు పెద్దగా ఉండడంతో పాయసం కస్త నేల పాలు అవుతోంది. అది చూసిన భక్తుడు ఎంటి స్వామి ఇదీ అని దేవున్ని అడిగాడు. ఇది నరకం నాయనా అని అన్నడు.
మనవాడు మరి స్వరగం ఎలా ఉంటుందో చూడడానికి రెండవ గదిలోకి అడుగు పెట్టాడు. నరకం లో ఎలా ఉందో ఆ బల్లా , పాయసం ఉన్నాయ్. బల్ల చుట్టూ పుణ్యవంతులు వారి చేతికి పెద్ద గెరిటెలు కట్టి ఉన్నాయ్ . కాని వీరు మాత్రం సంతొషంగా నవ్వుతూ అగుపడ్డారు. మనవాడికి ఏమీ పాలుపొలేదు. కాసేపు అలాగే వారిని గమనించి చూస్తూ ఉండిపోయాడు . వారు ఆ కుండలొ ఉన్న పాయసాన్ని వారి చేతులకున్న గెరిటెలతో తీసుకొని ఒకరికొకరు సహాయ పడుతూ పాయసం తాగడం చూసి ఆశ్చర్య పోయాడు. అప్పుడు దేవుడు చూసావుగా స్వర్గం అంటే ఇదే అని అద్రుశ్యమయ్యడు.
దీన్ని బట్టి మనకు తెలిసింది ఎంటి ?
ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్లనే రెండవ గదిలో వారు సంతోషంగా స్వర్గం లో ఉండగలుగుతున్నారు....మరో రకంగా చెప్పాలంటే ఎలాంటి పరిస్థితినైనా ఆనందంగా, స్వర్గంగా మార్చుకోగల్గుతున్నారు....ఎదుటివారికి సహాయం చెయ్యడం వల్ల మనం పొందే ఆనందమే స్వర్గం.....అన్ని మనకే కావాలని ఏది పొందకుండా దుఖంలో మునగడమే నరకం.....
శ్లో!! పరోపకారాయ ఫలంతి వృక్షాః! పరోపకారాయ వహంతి నద్యాః! పరోపకారాయ చరంతి గావః! పరోపకారార్థ మిదం శరీరం!! పరోపకారం ఇదం శరీరం అన్నది మన అందరికీ నోటి లో నానే మాటే దాని యొక్క పూర్తి శ్లోకం ఇది. భావం అంటారా, మీకందరికీ తెలిసిందే చెట్లు తమ పండ్లు తాము తినవు ,ఆ పండ్లు పరుల కొరకే .అలాగే నది లోని నీరు ,గోవుల యొక్క క్షీరం కూడ పరోపకారార్ధమే. అసలు ఈ జీవితమే పరోపకారం కోసం అంటాడు కవి [...]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి