1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

20, నవంబర్ 2010, శనివారం

దాహం

దాహం

కలిసే మనసులకి తనువుల అగాధాలు
తపించే తనువులకి మనసుల అగాధాలు
మనసు నమ్మకానికి మనిషి నిర్లక్ష్యపు అగాధాలు
మనిషి నమ్మకానికి మనసుల అగాధాలు
అర్ధమైన చోట అర్ధపు అగాధాలు
అన్నీ ఉన్న చోట అయోమయపు అగాధాలు
మనిషికో మతం
మనసుకో అభిమతం
ఏది కుటుంబం
ఏది కులం
ఏది సంఘం
ఏది దేశం
ఎటు చూసినా దాటలేని అగాధాలు
గమ్యం తెలియని గమనాలు
తీరని దాహలు
దేవుడు ప్రత్యక్షమవ్వాలి
కొన్ని వరాలు కోరాలి
లోకం బల్లపరుపు కావాలి
మనుషులు మరమనుషులు కావాలి
అంతరాలకి ఆలోచనలకి అవకాశం పోవాలి

తపస్సు చేస్తాను

కామెంట్‌లు లేవు: