1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

25, డిసెంబర్ 2010, శనివారం

నిశ్చల స్థితి - నిర్మమ దృష్టి

నిశ్చల స్థితి - నిర్మమ దృష్టి

ఏముంది ఇందులో!
తామరాకు మీద
నీటి బొట్టులా...
ఆనందం, ఆవేదన
ఏదీ అంటదు
తన, పర
ఏదీ పట్టదు

ఎందుకో జనులు
ఇలాంటి భార రహిత స్థితికై తపిస్తారు!
ఏమనుకుంటారో దేవతలు
వరాలన్నీ...
వద్దన్న ప్రవరాఖ్యులపై
వరూధినిలా సంధిస్తారు!!

కావాల్సినవన్నీ వద్దనుకోవాలి
కానివాటికోసం కలవరించాలి!!

 

కామెంట్‌లు లేవు: