1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

30, డిసెంబర్ 2010, గురువారం

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్ళని యదలో ముల్లు
కన్నీరుగ కరిగే కళ్ళు
నాలోని నీ రూపము నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

నేనోర్వలేను తేజము
ఆర్పేయరాదా దీపము
చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి
మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము
అపుడాగాలి మూగ గానం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

 

 

Thanks & Regards

 

S. Sreenivasa Prasad Rao

<Protect Trees—Protect yourself>

 

అతి సర్వత్ర వర్జయేత్ ! – విషయంలోను అతిగా ఉండకూడదు – Excess is to be avoided in all things

 

కామెంట్‌లు లేవు: