సాగాలి నీ పరుగు విజయాన్ని పొందేవరకు
వెయ్యాలి ముందడుగు ఆనందం అందే వరకు సాగాలి …
అందనంత ఎత్తున ఏది లేదు తెలుసునా
అందుకోను సాధ్యమే చెయ్యి ఆలోచనా
సాధనుంటే చాలుగా అసాధ్యమంటు లేదుగా
ధైర్యముంటె నీవుగా దరికి చేరు త్వరత్వరగా
నిర్ణయాన్ని తీసుకో నిర్భయంగ సాగిపో సాగాలి..
తలపడే తపనే ఉంటే తరలిరాద విజయం వెంటే
జాగురతే నీకు ఉంటే జీవితాన నవ్వుల పంటే
అద్భుతాలు చేసే తెలివి నీకూ ఉంది తెలుసుకో
సాధించిన విజయాలన్ని ఒక్కసారి తలచుకో
నిర్ణయాన్ని తీసుకో నిర్భయంగ సాగిపో సాగాలి..
యుక్తి తోటి శక్తి తెలుసుకో సత్తువేంటో రుజువు చేసుకో
గెలుపు వైపు మలుపు తీసుకో తీరు చేరు దారి చూసుకో
అలుపెరుగని ఆవేశంతో………
అనుకున్నది వశం చేసుకో………..
నిర్ణయాన్ని తీసుకో నిర్భయంగ సాగిపో సాగాలి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి