1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

29, డిసెంబర్ 2010, బుధవారం

అతి సర్వత్ర వర్జయేత్-– Excess is to be avoided in all things

అతి సర్వత్ర వర్జయేత్

 

తిదానాద్ధతః కర్ణస్త్వతిలోభాత్సుయోధనః
అతికామాద్దశగ్రీవస్త్వతి సర్వత్ర వర్జయేత్

"Karna was ruined by excessive liberality, Suyodhana by excessive avarice, Dasagriva by excessive lust – Excess is to be avoided in all things."

' విషయంలోను అతిగా ఉండకుడదు' అని దీని అర్ధం. మాటైనా, పనైనా, ఆటైనా ఏదైనా అవసరమైదానికంటే ఎక్కువ చేయడం మంచిది కాదు. మాట్లాడాల్సినదాని కంటే ఎక్కువ మాట్లాడటం వల్ల మాటలకుండే విలువ తగ్గిపోతుంది. మనం చెప్పాలనుకున్నది చెప్పి ఊరుకుంటే మాటలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. అలాగే చేయాల్సిన పనికి మించి చేయడం వల్ల ఎక్కువగా అలసిపోతాం, మన శక్తి, సమయం రెండూ వ్యర్ధమవుతాయి. అందుకే సమయానికి ఎంత అవసరమో అంతే పని చేయాలి. మన ప్రవర్తన కూడా హద్దుల్లో ఉండాలి. ఎవరితో ఎలా మెసలాలో అలాగే ఉండాలి కాని అతి చనువు తీసుకుని ప్రవర్తించడం వల్ల ఇతరలకు మనపై చెడు అభిప్రాయం కలిగే ప్రమాదముంది.

 

ప్రతి మనిషి జీవితంలోనూ ఒక పనికి కొన్ని హద్దులుంటాయి. మీరు చేసే పనులు మర్యాదపూర్వకంగా ఉండేలా చూసుకోవాలి. విషయంలోకూడా అతిగా ప్రవర్తించకూడదు. "అతి సర్వత్ర వర్జయేత్". మీరు మీ హద్దుల్లో ఉంటే ఇతరులు మీతో మర్యాదాపూర్వకంగానే వ్యవహరిస్తారు. చివరికి మీ ఆరోగ్యంకూడా మీ చేతుల్లోనే ఉంటుంది అంటున్నారు ఆరోగ్యనిపుణులు.

ఆరోగ్యం విషయంలో కూడా మీరు ఏది పడితే అది తినకుండా ఉంటే ఆరోగ్యానికి చాలామంచిదంటున్నారు వైద్యులు. అతిగా తినడం, అతిగా నిద్రపోవడం లాంటివి చేయకూడదంటున్నారు ఆరోగ్యనిపుణలు. అతిగా తింటే అజీర్తి, అతిగా నిద్రపోతే అలసత్వం మీ వెంటే ఉంటాయని వాటిని దూరంచేసుకోవాలనుకుంటే మీరు శరీరానికి కావలసినంత ఆహారం, నిద్ర అందిస్తే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు

 

 

Thanks & Regards

 

S. Sreenivasa Prasad Rao

WWW.SRI4U.TK

 

 

ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.

 

కామెంట్‌లు లేవు: