సంక్రాంతి (Sankranti)
సంక్రాంతి పండుగ ఎప్పుడు జరుపుకుటారు--సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు. ప్రతిఏటా సంక్రాంతి పండుగ ఏ తేదీన వస్తుంది--జనవరి 14. హిందువుల పండుగలలో సంక్రాంతి పండుగ ప్రత్యేకత--సూర్యగమనాన్ని బట్టి వచ్చే ఏకైక ప్రధాన పర్వదినం. తమిళనాడులో సంక్రాంతిని ఏ విధంగా పిలుస్తారు--పొంగల్. సంక్రాంతి పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు--3 రోజులు. సంక్రాంతి పండుగ తొలి రోజు పేరు--భోగి. సంక్రాంతి పండుగ చివరి రోజును ఏమందురు--కనుమ. సంక్రాంతితో ప్రారంభమయ్యే భౌగోళిక మార్పు--ఉత్తరాయణం ప్రారంభం. సంక్రాంతి సమయంలో అలంకరించి ఇంటింటికి తిప్పే వృషభాన్ని ఏ పేరుతో పిలుస్తారు-గంగిరెద్దు. సంక్రాంతి రోజునే సన్యాసం పుచ్చుకున్న ప్రముఖ అద్వైత ప్రభోధకుడు--ఆదిశంకరాచార్యులు. |
శుభ సంక్రాంతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి