1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

20, జనవరి 2011, గురువారం

ఎక్కడ ఉన్న ఏమైనా మనమెవరికి వారై వేరైనా

 

ఎక్కడ ఉన్న ఏమైనా మనమెవరికి వారై వేరైనా

పల్లవి

ఎక్కడ ఉన్న ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
||నీ సుఖమే||

చరణం 1

అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని
||నీ సుఖమే||

చరణం 2

పసిపాప వలె ఒడి చేర్చినాను కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేశాను నువ్వుండలేనని వెళ్ళవు
||నీ సుఖమే||

చరణం 3

వలచుట తెలిసిన నా మనసుకు మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా
||నీ సుఖమే||

చరణం 4

నీ కలలే కమ్మగ పండనీ నా తలపే నీలో వాడనీ
కలకాలం చల్లగ ఉండాలనీ దీవిస్తున్నా నా దేవిని||2||
ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
||నీ సుఖమే||

 

కామెంట్‌లు లేవు: