పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన, ఆసక్తి ఉన్న ఎంతోమంది దాని కోసం ఎంతో కృషి చేశారు. అయితే వెలుగులోకి వచ్చినవారు మాత్రం కొందరే.
ఉదాహరణకు దాదాపు ఇరవై ఏళ్ల క్రితం చెన్నైకి చెందిన సుబ్రమణ్యన్ అనే బ్యాంక్ ఉద్యోగి, మాధవన్ అనే డాక్టరు... ఇద్దరూ కలిసి ఉదయాన్నే మొక్కలతో నిండిన రిక్షాని తొక్కుతూ వీధివీధి తిరిగేవారు. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మొక్కలను నాటారు. అయితే మొక్క ఎవరింటి ముందు నాటారో ఆ ఇంటి వారిని కలిసి, 'ఈ మొక్కకు మేము రోజూ నీళ్లు పోస్తాం' అని వారి నుంచి మాట తీసుకునేవారు.
కొంతమంది ఒప్పుకుంటే మరి కొంతమంది వీరిని పిచ్చివాళ్లుగా చూసి నవ్వుకునేవారు. అక్కడితో వదిలెయ్యకుండా మాధవన్, సుబ్రమణ్యన్లు అప్పుడప్పుడు వచ్చి 'మొక్కలకు ఆ ఇంటివారు నీళ్లు పోస్తున్నారా? లేదా?' అని చూసి వెళ్లేవారు. వీరి మంచి పనిని గమనించిన యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెట్లను పశువుల నుంచి సంరక్షించడానికి చుట్టూ తీగలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు.
ఆ తర్వాత వీరు 'గ్లోబల్ గ్రీన్వేస్' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశారు. ఇరవై ఏళ్ల క్రితం వారు నాటిన మొక్కలు ఇప్పుడు అందరికీ 'నీడనిచ్చే చెట్లు' గా మారాయి. బంజరుభూమిగా మారిపోతున్న చెన్నైలో ఈ సంస్థ కారణంగానే పచ్చదనం కనిపిస్తోందని, వారి పనిని మెచ్చుకుంటూ జనాలు తృప్తిగా చెప్పుకుంటున్నారు.
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
26, జనవరి 2011, బుధవారం
‘ఈ మొక్కకు మేము రోజూ నీళ్లు పోస్తాం’
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి