1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

నాన్నా -నమ్మకం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత (ABOUT MY FATHER)

మా నాన్న అంటే మనిషి మీద మనిషికి  ఉండే నమ్మకం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, యోగ జీవనం, పల్లెటూరు మొరటుతనం, పాత తరం పద్దతుల ప్రతి రూపంకష్టాలను ఆనందంగా ఎదుర్కొనే ఒక గుండె నిబ్బరం, కొత్త తరానికి అలవాటు పడని ఒక పిరికి తనం, కొన్ని మూడనమ్మకాల సముదాయంఉరి ప్రజల దైవం/స్నేహంఅమాయకంగా కనిపించే ఒక చిన్న పిల్లాడి  ప్రతి రూపం, మెరిశే మేఘం, విలువల వజ్రం, అందరి ఆదర్శం. 


అమ్మకు బ్రహ్మకు మద్యన నాన్నే ఒక నిచ్చేనని .....
దేహము విజ్ఞానము బ్రహ్మొపదేశమిచ్చి
ఇహపరాలు సాధించే హితమిచ్చె తండ్రివి..
తనుగానని కామమున నినువెడల నడిచితీ.
 కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్నా

నాన్నా నాన్నా.................... చనిపోయింది మీ దేహము మాత్రమేమీరు కాదుమీ ఆశయాలు అమరణము
  
నాన్నా! నీ మనసే  వెన్నా
అమౄతం కన్నా.. అది ఎంతో మిన్నా!

అనే పాటకు అచ్చమైన సాక్ష్యం గా నిలిచేది  "నాన్న" అని అనడంలొ అతిశయోక్తి లేదు..

తల్లిదండ్రులే అందరికి మొదటి గురువులని అంటారు. ......నాన్న గారు…! మొదటగా నాకందించిన స్నేహ హస్తం మీదే.. నా అభివౄద్దికి పునాది మీదేమీరు కనికరించిన, కాఠిన్యం చూపిన, తిట్టిన, కొట్టినా, మెచ్చినా అంతా నా ఉన్నతి కోసమే.
 
నా జీవితానికి ప్రేరణ, నా ఉన్నతికి ఆలంబన, ఆదర్శవంతమైన, మూర్తీభవించిన వ్యక్తిత్వం, మోముపై చెరగని చిరునవ్వు, అందరిని ఆప్యాయంగా పలకరించే నిర్మల, నిష్కలంకసమైన మనస్సు ..మా ఊరి మరియు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సామి, అయ్యోర,మోహన్ రావు, అన్న, పెదనాన్న, బాబాయ్, మామ, పంతులు  ఇలా ఎన్నో రకాలుగా పిలుచుకొనే కర్మ యోగి గురించి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి..

 నేను తనకి కొడుకుగా పుట్టడమే నా పూర్వజన్మ అదృష్టం...నా జన్మ జన్మల పుణ్యం. నా జీవితపు ప్రతి అడుగు ...ఒక మహా మనిషి అడుగు జాడల్లో నడవగలిగినందుకు నేను మొదట దేవునికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. మా నాన్న ఒక కర్మ  యోగి, ఒక పల్లెటూరు ప్రేమికుడు, పాతకలపు మనిషి, జాతకాల దురంధరుడు,మానవ విలువలు కలిగిన మనిషి, డబ్బు మీద ఆశ లేని, ఇతరులది ఏది  ఆశించని నైజం, దేహము మీద మొహం లేని  వెర్రితనం,అమాయకత్వంకోపాన్ని జయించిన   శాంతమూర్తిఆడంబరాలు లేని అతి సాదారణ జీవనం...కష్టాలను అలోవోకగా ఎదుర్కొనే గొప్ప ఆర్ధిక వేత్త, భాధలను ఆనందంగా అనుభవించే కర్మ జీవి....

నా ఆదర్శం, నా నేస్తం, నా స్నేహం,నా ప్రేమ, నా కరుణ, నా ఆలాపన నన్ను వంటరి చేసాడనే కోపం, దుఖం....కాని అర్ధవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి  కావలసిన మానసిక బలాన్ని, ఉత్తేజాన్ని పుష్కలమైన పాళ్ళలో ఇచ్చిన మహోన్నత రూపం...తన ఎప్పుడు ప్రాణంగా కొలిచే శ్రీ రాజరాజేశ్వరి కి సైతం చేతులెత్తి నమస్కరించడం తప్ప, పూజలు చెయ్యని దగ్గర తనం.

మా ఉరి మారాజు. జీవితం, జీవితాన్ని ఎలా కొనసాగించాలో చెప్పే ఒక పుస్తకం...ఒక గ్రంధం...ఎదుటి మనిషిని పల్లెత్తు మాట అన్ని తన నైజం...చిరు తిండి తినే పిల్లవాడి మనస్తత్వం...ఏమి అంటని ఒంటరి తనం. తన ఊరె ప్రాణంగా పెరిగిన విశ్వాసం, పట్టనానలో, కొత్త ప్రదేశాలలో, కొత్త వ్యక్తులతో ఇమడలేని, కొత్త నాగరిక పోకడలకు అలవాటుపడలేని మొండితనం..జీవితంలో ప్రతి నిముషాన్ని ఆనందంగా స్వాగతించే గుండె నిబ్బరం....ఒక మహానుభావుని జీవిత కథనం... 
జీవితంలో ఎక్కువ సార్లు డాక్టర్ దగ్గరకు వెళ్ళని ఒక పల్లెటూరు ప్రాణానికి...దేవుడు ఎటువంటి సందేశం లేకుండా తొందర పడి తీసుకెళ్ళి పోతాడని ఉహించని కొన్ని గ్రామాల  జనం, మా భందు వర్గం, ఏమి జరిగిందో తెలుసుకోలేని మా అమ్మ నిస్సహాయత...జీవితం క్షణికం అని తెలియచెప్పే సంగటన..మా జీవితాలలో మరిచిపోలేని, ఉహించని పెను తుఫాను. సునామి  భీబత్శానికి అతలాకుతలమైన తీర ప్రాంత ప్రజల జీవనం లాగ...మా జీవితాలలో అనుకోని, ఉహించని మలుపులు, సంగటనలు, స్థాన చలనాలు....జీవితంలో మరిన్ని కోణాలను చూపించ సాగాయి.. 
అయన అంతిమ యాత్ర ఒక కండ కావ్యం......నలుమూలల జనం...ఏడుపుల దావాలనం...ఒక మంచి మనిషికి, మన మనిషికి  గణ జన నీరాజనం. 
నా సేవా ద్రుక్పదానికి కారణం, నా వ్యక్తిత్వానికి అద్డం,నా గుండె నిబ్బరానికి మూలం, నా జీవితానికి మూలధనం

నేను ఇప్పటికి పైన పడుకోనే దగ్గరి తనం, కొడుకును స్నేహితునిగా చూసే పెంపకం, ఎప్పుడు మా పై చెయ్య చేసుకోని (చిన్న తనంలో ఒక్క సారి తప్ప) అయన ప్రేమానురాగాలు, ఎన్నటికి మరవలేని, మరిచిపోని తీపి గురుతులు...

కష్టాల్లో మా జీవితాలను ముందుండి నడిపిన అయన నాయకత్వం, జీవితంలో ఎక్కువ భాగం    చిన్న మొత్తాలతో , అన్ని సమయాల్లో కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన చానిక్యుడు ...మా రంగ మోహనుడు....

ఇంతవరకు నాన్న మా దగ్గరి నుండి ఏమి ఆశించలేదు..! వెనుకటి తరం పద్దతులు, అలవాట్లు ఇప్పటికి మా నాన్నలొ కనిపిస్తాయ్.. జెనరేషన్ విదానలు ఏవి తెలియవు.. తెలిసిన వంటబడవు


 మన మనసు తెలుసుకుని మసిలేది నాన్న!
 మన ఆశలు, ఆకాంక్షలు తీర్చేది నాన్న!!
 మన గురువు, దైవం అన్నీ నాన్న!!!


వారి నిస్వార్ధ సేవకు పాదాభి వందనం చేస్తూ "మీ అమ్మ శ్రీనివాస్ (నా అనంతరంగం)"  Date : 4/28/10

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Its an excellent explaination about a/ur father.....
every one should respect n responsible about their parents...the most valuable gift they expect from us is ONLY "PURE LOVE".....can t we give that gift being their child??????

Regards,
A daughterఅజ్ఞాత చెప్పారు...

Hi Srinivas,

A wonderful write-up with full of heartfelt feelings within…

Certainly your father must be observing you from above and feeling proud of you and your valuable social service activities…

God Bless you…

With regards,
SSRP Srinivas

Sarath Chandra చెప్పారు...

Great lines about a father