1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

నాయకత్వం

ఏమీ తెలియని వారికి ఏమైనా చెప్పచ్చు. అన్నీ తెలిసిన వారికీ ఏమైనా చెప్పచ్చు. ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసనుకునేవారికి ఎంత చెప్పాలని చూసినా, అపార్థమే తప్ప అవగాహన ఉండదు.

ఉవ్వెత్తున ఎగసిపడే అలల వల్ల ప్రయోజనం ఉండదు ప్రళయం తప్ప. ప్రశాంతంగా ప్రవహించినప్పుడే ప్రయాణం అందరికీ క్షేమకరం.

నాయకత్వం వహించమని ప్రతి ఒక్కరూ చెప్పగలరు. కానీ చెప్పిన మాట వినకపోయినా పర్లేదు. అర్థం చేసుకునే కనీస ప్రయత్నం కూడా కష్టమవుతుంది మనుషులకి. చెప్పిన ప్రతి మాటకి, చేసిన ప్రతి చేష్టకి తలాడించినంత కాలం మంచి నాయకుడంటారు. పొరపాటున జాగ్రత్త చెప్పబోయామా... ఇక అంతే... ఇతరుల ఉనికి కూడా గిట్టదు.

ప్రతి ఒక్కరి చేత చులకన కావించబడే మంచితనాన్ని ఇక నేనెంతమాత్రము ఆదరించను. ఏకాకిగా మిగిలిపోవాల్సి వచ్చినా గమ్యానికెంత విలువ ఇస్తానో, ఆచరణకు అంతే విలువ ఇస్తాను.

ఇతరులకి అర్థమవ్వాలనో, అందరికీ ఆమోదయోగ్యం కావాలనో పిచ్చి అపోహలు పెట్టుకోను. అర్థం చేసుకునేవారితోనే నడక సాగిస్తాను.

ఎంత సేపు సమాధనమిచ్చుకుంటూపోతే సమిధగా మిగిలిపోవాల్సిందే.

జీవిత గమనంలో మర్చిపోలేని, వెలకట్టలేని విలువైన పాఠాలు నేర్పిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ ఋణపడి ఉంటాను. మనిషిగా ఎదగడంలోను, జీవితాన్ని అర్థం చేసుకోవడంలోను సహకరించి, నేను ఎలా వ్యవహరించకూడదో నాకు ఉదాహరణలతో చూపిన శ్రేయోభిలాషులందరికీ సుమాంజలులు.
by Prasanthi

కామెంట్‌లు లేవు: