నిద్రలేమి ఒక రకమైన ఇబ్బంది, అయితే ఏ అర్ధరాత్రికో, తెల్లవారుజాముకో నిద్రపట్టి ఉదయం లేవలేకపోవడం మరో సమస్య. మారుతున్న జీవనశైలిలో వీటి బారిన పడేవాళ్లు ఎక్కువవుతున్నారు. ఈ సమస్యకు దూరంగా ఉండడానికి మీరేం చేస్తున్నారు? ఒకసారి చెక్ చేసుకుంటారా?
1.పగలు ఎక్కువగా అలసట అనిపించినా కూడా అరగంటకు మించకుండా కునుకు తీస్తారు తప్ప ఎక్కువ సేపు నిద్రపోవడం లేదు.
ఎ. అవును
బి. కాదు
2.మధ్యాహ్నం మూడు దాటిన తర్వాత పది నిమిషాల పాటు కునుకు తీసినా సరే ఆ రాత్రి సరిగా నిద్రపట్టదు. కాబట్టి మీరు మూడు గంటల తర్వాత నిద్రపోరు.
ఎ. అవును
బి. కాదు
3.శారీరక వ్యాయామాన్ని వీలును బట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం రెండులోపు చేస్తున్నారు. సాయంత్రం ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు ఉత్తేజితమైన దేహం విశ్రాంతిని కోరే సరికి అర్ధరాత్రి దాటవచ్చని మీకు తెలుసు.
ఎ. అవును
బి. కాదు
4. కెఫీన్ ఉత్తేజాన్నిస్తుంది, కాబట్టి కెఫీన్ ఉన్న పానీయాలను సాయంత్రం నాలుగు తర్వాత తీసుకోకుండా పరిమితిని పాటిస్తున్నారు.
ఎ. అవును
బి. కాదు
5. ఒక్కో రోజు ఒక్కో సమయానికి నిద్రపోవడం వల్ల బాడీక్లాక్ ఒక నిర్ణీత సమయాన్ని పాటించదు. కాబట్టి నిద్రకు ఉపక్రమించడానికి కచ్చితమైన సమయాన్ని పాటిస్తున్నారు.
ఎ. అవును
బి. కాదు
6.ఐరన్ లోపం కూడా నిద్రపట్టకపోవడానికి కారణమవుతుంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించి డాక్టరు సలహా తీసుకోవాలని మీకు తెలుసు.
ఎ. అవును
బి. కాదు
మీ సమాధానాల్లో 'ఎ'లు ఐదుకంటే ఎక్కువగా వస్తే మీకు నిద్రలేమి, ఆలస్యంగా నిద్రపట్టడం వంటి సమస్యలు లేవని అర్థం. నిద్రపట్టకపోవడం అనే సమస్యతో బాధపడుతుంటే 'ఎ'లను సూచనలుగా భావించి జీవనశైలిని మార్చుకుంటే సరిపోతుంది.
గురువారం :
03/03/2011
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి