సృష్టిలో అన్నింటికన్నా తీయనిది స్నేహం! మంచి స్నేహితులు దొరకటం నిజంగా అదృష్టం. కష్టసుఖాల్లో... అన్నివేళలా నేనున్నానంటూ భరోసా ఇచ్చే మనిషి ఒకరు ప్రతి ఒక్కరికీ ఉండాలి. మరి మీలో స్నేహశీలత ఎంత పాళ్లలోఉందో చెక్ చేసుకోండి,,,
1. కులం- మతం, గొప్ప- పేద....అంతరాలు లేకుండా స్నేహం చేస్తారు.
ఎ. అవును
బి. కాదు
2. కష్టకాలంలో ఉన్న స్నేహితులకు మీవంతు సహాయాన్ని అందించటానికి ముందు ఉంటారు.
ఎ. అవును
బి. కాదు
3. స్నేహితుల ప్రైవసీని గౌరవించి వారి జీవితాల్లో మీకు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోరు.
ఎ. అవును
బి. కాదు
4. ఒకవేళ స్నేహితులు తప్పుడు పనులు చేస్తున్నా తప్పు దోవ పడుతున్నా వారిని మందలించి సరైన దోవలోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును
బి. కాదు
5. అప్పుడప్పుడు కలిగే చిన్న అభిప్రాయభేదాలు లేదా మనస్పర్థలను పెద్దవి చేసుకోకుండా వదిలేస్తారు.
ఎ. అవును
బి. కాదు
6. అపార్థాలు తలెత్తితే ఎప్పటికప్పుడు వాటిని స్నేహితులతో చర్చించి నిజానిజాలను తేల్చు కుంటారు.
ఎ. అవును
బి. కాదు
7. ఏ సమయంలోనైనా, ఎలాంటి కష్టం వచ్చినా మీరు వారి వెన్నంటే ఉంటారనే ధైర్యం మీ స్నేహితుల్లో కలిగిస్తారు.
ఎ. అవును
బి. కాదు
8. కుటుంబ సభ్యులకు ఇచ్చినంత గౌరవాన్ని స్నేహితులకు ఇస్తారు.
ఎ. అవును
బి. కాదు
9. అవసరం కొద్దీ చేసే స్నేహానికి దూరంగా ఉంటారు. చిరకాలం నిలిచే స్నేహం కోరుకుంటారు.
ఎ. అవును
బి. కాదు
10. స్నేహం అంటే కలిసి ఎంజాయ్ చేయటమేకాదు ఒకరికొకరు అండగా ఉండాలన్నది మీ అభిప్రాయం.
ఎ. అవును
బి. కాదు
పై ప్రశ్నలకు ఆరు కంటే ఎక్కువ సమాధానాలు 'అవును' అయితే స్నేహానికి నిజమైన అర్థం మీకు తెలుసు. మీరు చేసుకున్న స్నేహాలు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయి
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
7, ఏప్రిల్ 2011, గురువారం
మీరు మంచి స్నేహితులా...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి