1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

26, జూన్ 2011, ఆదివారం

సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా-ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా


ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం
నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకదే తొలి పాఠం
మునివేళ్ళతో మేఘాలనే మీటేంతగా ఎదిగాం మనం
పసివాళ్ళలా మట్టిలో ఎన్నాళ్ళిలాగ పడి ఉంటాం
కునికే మన కనురెపల్లో వెలిగిద్దాం రంగుల స్వప్నం
ఇదిగో నీ దారిటు ఉందని సూరీడిని రా రమ్మందాం
జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో

ఆకాశం నుండి సూటిగా దూకేస్తే ఉన్నపాటుగా
ఎమౌతానంటూ చినుకలా ఆగిందా బెదురుగా
కనుకే చినుకు ఏరుగా ఏరే వరద హోరుగా
ఇంతింతై ఎదిగి అంతగా అంతెరుగని సంద్రమైందిగా
సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా
ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా
జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో

పని మరీ ఆసాద్యమేం కాదే నిజం మహా రహస్యమా
వేసే పదం పదం పదే పదే పడదోసే సవాళ్ళనే ఎదుర్కోమ్మా
మొదలెట్టక ముందే ముగిసే కథ కాదే మన పయనం
సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం
జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో
Movie : Golconda High School

కామెంట్‌లు లేవు: