Hi Friends...
It is my pleasure to share our 3 Years Journey/Progress (Book Let) of AMMA SOCIAL WELFARE ASSOCIATION with you all. Your support (in different ways) is the only reason for today's our PROGRESS.
Thanks to one and all…
May God bless you & your family and Give you all types of Strengths to help others…..
Pl check the attached book let in your free time.
Your initiation is always ours inspiration…..
Love all-Serve all
AMMA Srinivas
అమ్మస్వచ్చంద సేవా సమితి - A Brief Introduction
అమ్మస్వచ్చంద సేవా సమితి
అమ్మ అనే పదంతో మనందరికీ ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిలేదు .
సృష్టిలో తియ్యనైన పదం "అమ్మ"
నిశ్వార్ధమైన ప్రేమకు రూపం "అమ్మ"
భావిభారత పౌరులను తీర్చిదిద్దే గురువు "అమ్మ"
ఇలా ఒక తల్లి
ఎలా అయితే తన బిడ్డను చుడాలనుకుంటుందో
ఎలా అయితే తన బిడ్డను ప్రేమిస్తుందో, ఆదరిస్తుందో
ఎలా అయితే ఉన్నత లక్ష్యాల దిశగా నడిపిస్తుందో
ఎలా అయితే మానవత విలువలను ఇనుమడింప చేస్తుందో
అలానే మన ఈ అమ్మ (స్వచ్ఛంద సేవ సమితి) కూడా ప్రేమ కోల్పోయిన వారికీ ప్రేమను అందించాలని, ప్రతి ఒక్కరి మోముపైన చిరునవ్వును చూడాలని, దారి తెలియని వాళ్ళకి దారిచూపించాలని, ప్రతి ఒక్కరికి విలువలతో కూడిన విద్యను అందించి తద్వారా వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో స్థాపించబడి, "అందరిని ప్రేమించడం - అందరినిసేవించడం" అనే నినాదంతో "నిస్వార్ధమైన సేవను అందించాలనే" లక్ష్యంతో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న పిల్లవాడిలా వడివడిగా ముందుకు కదులుతోంది..
2008జనవరి 1 న అనాధ ఆశ్రమ సందర్శనతో స్పూర్తినొందిన / ప్రేరణ పొందిన 15మంది సన్నిహితుల, స్నేహితుల సముదాయమే ఈ "అమ్మ". ఆనాటి ప్రేరణే/ఆలోచనలు ఏప్రిల్ 27, 2008న కార్య రూపం దాల్చాయి.
మొదట అనాధ ఆశ్రమాలను, వ్రుద్దాశ్రమాలను మరియు అనేకరకాలైన ఆశ్రమాలను ప్రతి వారం సందర్శించడం ద్వారా అక్కడి వారితో ఆనందంగా గడపడం, ఆడటం, పాడటం అక్కడివారిలో నిరాశ, నిష్ప్రుహలను పారద్రోలుతూ వారికీ ఆనందాన్ని పంచుతూ "మీకు మేమున్నాము" అనే భరోసాను కల్పిస్తూ, వారి కష్టాలను, సుఖాలను పంచుకుంటూ.... వారికీ జీవితంమీద ఆశని, ఆసక్తిని కలిగించి వారిని జీవితం లో ఉన్నత లక్ష్యాలను చేరుకొనే దిశగా నడిపించడానికి ప్రయత్నిస్తోంది.
ఈ ప్రయత్నంలో భాగంగా ఇలాంటి సామజిక భాద్యతను నిర్వర్తిస్తున్న అనేక రకాల స్వంచ్చాండ సేవ సంస్థలతో కలసి పనిచేయడం, వాటి పని తీరును గమనిస్తూ, సమాజం లో అట్టడుగుస్థాయిలలో ఉన్నవారి అవసరాలను, సమస్యలను వాటికి గల కారణాలను గుర్తించడం. వాటికి మా పరిధికి లోబడి సహాయం చేయడం, వేరే సంస్థల ద్వారా చేయూత నందించడం చేస్తూ ఉన్నాము....
అన్ని కష్టాలకు, భాధలకు, సమస్యలకు కారణం మన ఆలోచన విధానం. దానిని సరిగా ఉంచుకున్న నాడు, దానిని సరైన పద్ధతిలో ఉపయోగించిన నాడు, సరైన పద్ధతిలో పెట్టిన నాడు ఈప్రపంచంలో ఎక్కడ ఈ విధమైన అసమానతలు ఉండవని గ్రహించి, ఈ ఆలోచన విధానాన్ని సరైన పద్ధతిలో పెట్టగలిగేది, మార్చగలిగే ఒకే ఒక ఆయుధం జ్ఞానం/విజ్ఞానం కాబట్టి ఈ జ్ఞానాన్నిఅందరికి అందచేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది..
జ్ఞానాన్ని సంపాదించే మార్గమే/ప్రయత్నమే "విద్య/చదువు". కాబట్టి మంచి విలువలతో కూడిన జ్ఞానాన్ని/చదువును అందరికి అందించడానికి పాఠశాలలకు, ఆశ్రమాలకు, మురికివాడలకుతిరుగుతూ అక్కడ తరగతులను నిర్వహిస్తోంది. వీటితో పాటు ఆటలు, పాటలు ద్వారా కూడా అక్కడి వారికీ చదువు యొక్క విలువలను తెలుపుతూ వారికీ చదువు ఫై అవగాహనా కలిపిస్తోంది.
కార్మిక నగర్, మెట్రో లాంటి మురికి వాడలు, ఫోరం ఫర్ స్ట్రీట్ చిల్ద్రెన్ లాంటి అనాధశ్రమాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం వలన వచ్చిన అనుభవాలు, పాటాలతో ప్రస్తుతం ప్రతి నెలా క్రింద తెలిపిన కార్యక్రమాలను చేస్తోంది
"చేయూత" అనే పథకం/ప్రాజెక్ట్ లో భాగంగా పేద, సామర్ద్యం కల విద్యార్దులకు వారి అవసరాలకు ఆర్ధిక సహాయం చెయ్యడం
"వికాస్" అనే పథకం/ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వ పాటశాలలో వ్యాస రచన, వక్తృత్వ పోటీలను నిర్వహించడం-బహుమతులను ప్రధానం చెయ్యడం.దీని ద్వారా వారు ధైర్యంగా వారి ప్రతిభను ప్రదర్శించడానికి కావలిసిన ధైర్యాన్ని, ప్రేరణను అందివ్వడానికి కృషి చేస్తోంది.
"షేర్ అండ్ కేర్" అనే పథకం/ప్రాజెక్ట్ లో భాగంగా ఒక అనాధాశ్రమాన్ని కాని, వృద్ధాశ్రమాన్ని కాని సందర్శించి వారితో సమయం గడపడం ద్వారా వారికి మేమున్నాము అనే ఆలోచనను, భరోసాను కలగచేయడం. అవసరమైనప్పుడు ఆర్ధిక సహాయం చెయ్యడం.
"సేవ్ ఎర్త్ అండ్ లైఫ్" అనే పథకం/ప్రాజెక్ట్ లో భాగంగా ప్రతి నెలా సంరక్షణకు వీలుగా ఉన్న చోట చెట్లను నాటుతూ, వాటిని పరిరక్షించడానికి అక్కడి వారికి ప్రేరణ కల్పించి...వారికి పర్యావరణం మీద అవగాహనా కల్పించడం తద్వారా దాని పరిరక్షణకు కృషి చెయ్యడం.అలాగే అవసర సమయాల్లో రక్త దాతలను వెతికి, రక్త దానాలు చేయించడం.
వీటితో పాటుగా పాత బట్టలు సేకరించి అవసరమైన చోట అందించడం, మనం చెయ్యలేని పనులను, సహాయాలను వేరే సంస్థ ద్వారా చేయూత నందించడం చేస్తూ ఉన్నాము...ఇలా సహాయం చేసే వ్యక్తులకు, సంస్థలకు మాకు తగిన సమయాన్ని కేటాయించడం ద్వారా వారికి సహాయం చెయ్యడం. కొంతమంది వృద్ధులను, అనాధ పిల్లలను ఆశ్రమాలలో చేర్చడం...ఇలా మాకున్న సమయంలో, ఆర్ధిక వనరులతో ఇతరులకు చేయగల సహాయాన్ని చేస్తూ, అనేక మందిలో ఇతరులకు సహాయం/సేవ చెయ్యాలనే స్పూర్తిని రగిలిస్తూ ఒక్కటిగా ముందు పోతోంది ఈ మన అమ్మ స్వచ్చంద సేవా సమితి.... దీని గురించి మరిన్ని వివరాలకోసం ...
http://www.aswa.tk/ or http://www.ammasocialwelfareassociation.blogspot.com/
https://groups.google.com/forum/?fromgroups#!forum/amma-social-welfare-association
ఇలాంటి కార్యక్రమలు చేయడానికి ఈ "అమ్మ" కు, తద్వారా సమాజానికి సేవ చేయడానికి సమయాన్ని అందించి నేరుగా కార్యక్రమ్మాల్లో పాల్గొంటూ సహాయం చేసే వారు కొందరైతే, ఆర్ధికంగాసహాయం చేస్తున్న వాళ్ళు మరికొందరు...
ఇతరులకు సేవ చేయడం సామజిక సేవ కాదు ఇది మన భాద్యత … దీనికోసం మన ప్రతి ఒక్కరికి సమాజానికి మనవంతు సాయం చేద్దామని ఉంటుంది .. కాని మనం మన పరిస్థితులతో ముడి పెట్టుకొని వాయిదా వేస్తూ వస్తాము …. దీనికోసం బాగా డబ్బు కావాలనే భావనలో .. మనం స్థిరపడ్డాక చేద్దామని వాయిదా వేస్తాము…
కాని మన బాధ్యతను నిర్వర్తించడానికి డబ్బు అవసరమే కానీ అన్ని దానితోనే తీరవు, తీర్చడం వీలు కాదు అని తెలుసుకోలేకపోతున్నాము ….
ఇక్కడ డబ్బు లేక పేదరికం కాదు, డబ్బుతో మాత్రమే తీరే సమస్యలే కాదు ప్రేమను, ఆనందాన్ని, ఆప్యాయతని , అభిమానాన్ని , చిరునవ్వును, సంతోషాన్ని , సమయాన్నిపంచడంద్వారా పరిష్కరించగలిగే సమస్యలే అధికం.
ఇలా అధిక మొత్తంలో డబ్బులు అవసరం లేదు అని, చేతులు కలిస్తేనే చప్పట్లు, కొన్ని నీటి బోట్ల సముదాయమే సముద్రం అవుతుందని గ్రహించి "చిన్న మొత్తాల పొదుపు" ద్వారా ఇలాంటివిపరిష్కరించవచ్చానే ఉద్దేశంతో నెలకు మన అనవసర ఖర్చులని తగ్గించుకొని 100/- తగ్గకుండా దాచిపెట్టడం ప్రారంభించడం జరిగింది. ఇలా 15మందితో మొదలైన ఈ భాద్యతను ఈ రోజు 120కిపైగా స్వీకరించడానికి, ఇందులో చేరడానికి ముందుకు వచ్చారు, ఇంకా వస్తున్నారు...
ఇలాంటి మన చిన్న మొత్తాలు కొందరి జీవితాలను నిలపెట్టడానికి , కొందరి మోముపై నవ్వును, కొందరి చదువులకు, కొందరి ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతున్నాయి అంటే అతిశయోక్తికాదు...నమ్మలేమేమో..
ప్రపంచంలో ప్రతిది ఒక్కరితోనే, ఒక్కటితోనే మొదలవుతింది... ఆ ఒక్కటి మరియు ఒక్కరు నువ్వే...నీ భాద్యత ను నువ్వు నిర్వర్తించు...ఇలా అందరు ముందు వెళితే..అందరి ఆలోచన సరళిమారగలితే ఇలాంటి స్వచ్ఛంద సంస్థల అవసరమే ఉండదు అని ఆశిస్తూ.... దీనికి మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించాలని కోరుకుంటూ.. ఈ" అమ్మ" కు మొదటి బిడ్డనుఐనందుకు ఎంతో ఆనందపడుతూ.... ఇలాంటి నిస్వార్ధమైన సేవలను మనం అందరికి అందించాలని, అందిస్తామని హామీ ఇస్తూ..
మీ శ్రేయోభిలాషి.... సేవకుడు
ఎస్. శ్రీనివాస ప్రసాద్ రావ్
Note: Kindly IGNORE the Spelling Mistakes in Telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి