1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

13, ఆగస్టు 2011, శనివారం

- పద్యం 15, నరసింహ శతకం (శేషప్పకవి ప్రణీతము)

తల్లి గర్భమునుండి ధనము దేఁడెవ్వఁడు, వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు,

లక్షాధికారైన లవణ మన్నమెకాని, మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు

విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని, కూడఁబెట్టిన సొమ్ము గుడువఁబోఁడు

పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి దానధర్మము లేక దాఁచి దాఁచి

తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ?

తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు?

భూషణవికాస శ్రీధర్మపురనివాస

దుష్టసంహార నరసింహ దురితదూర

 

- పద్యం 15, నరసింహ శతకం (శేషప్పకవి ప్రణీతము)

 

Love all-Serve all

AMMA Srinivas

 

సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా-ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా...

 

కామెంట్‌లు లేవు: